టీజర్ నుంచి పాటల దాకా ప్రశంసల కన్నా ఎక్కువగా ట్రోలింగ్ కు గురవుతున్న సల్మాన్ ఖాన్ సికందర్ ట్రైలర్ ఇవాళ వచ్చేసింది. ముంబైలో జరిగిన గ్రాండ్ ఈవెంట్ లో రిలీజ్ చేశారు. మే 30 విడుదల దూరం లేకపోవడంతో బయ్యర్ల ఆశలన్నీ దీని మీదే ఉన్నాయి. ఛావా తర్వాత బాక్సాఫీస్ కు జోష్ ఇచ్చే బొమ్మ ఇదే అవుతుందనే నమ్మకంతో ఉన్నారు. అందులోనూ హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్లతో ఊపు మీదున్న రష్మిక మందన్న హీరోయిన్ కావడం, ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం, సంతోష్ నారాయణన్ సంగీతం అంతో ఇంతో అంచనాలను సజీవంగా ఉంచాయి. తీరా మూడు నిమిషాల వీడియో చూశాక నిరాశపడటం ఖాయం.
ఎందుకంటే సికందర్ పక్కా మన సౌత్ సినిమాల మిక్స్చర్ లా కనిపించింది. ఎక్కడో రాజ్ కోట్ లో ఒక యువకుడు సికందర్ (సల్మాన్ ఖాన్). సమాజమంటే చాలా మక్కువ. ఏదో చేయాలని తాపత్రయపడుతుంటాడు. ప్రియురాలు (రష్మిక మందన్న) వెన్నంటే ఉంటుంది. ఈలోగా ఒక మిషన్ మీద ముంబై రావాల్సి వస్తుంది. అక్కడో బ్రాహ్మణ కుటుంబంతో పరిచయం. వాళ్ళ అమ్మాయి (కాజల్ అగర్వాల్) తో దోస్తీ. కట్ చేస్తే ఓ విషాదం చోటు చేసుకుని సికందర్ చాలా కోల్పోతాడు. దీనికి కారణమైన వాడిని (సత్యరాజ్) మట్టుపెట్టేందుకు బయలుదేరతాడు. ఆ తర్వాత ఏం జరుగుతోంది క్లైమాక్స్ చూడకుండానే చెప్పొచ్చు.
మురుగదాస్ ఎలాంటి రిస్క్ తీసుకోకుండా రెగ్యులర్ టెంప్లేట్ లో వెళ్ళిపోయాడు. సర్కార్, ఠాగూర్ షేడ్స్ పుష్కలంగా ఉన్నాయి. ముఖ్యంగా ఒక కీలక ఎపిసోడ్ లో అయినవాళ్లంతా చనిపోవడం చిరంజీవి – జ్యోతికలను గుర్తుకు తెస్తుంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా ఏమంత గొప్పగా లేదు. జవాన్, పఠాన్ లాంటి ట్రైలర్లు చూసినప్పుడు ఏదైతే పాజిటివ్ ఫీల్ కలిగిందో అది సికందర్ ఇవ్వలేదు. మరి అసలు కంటెంట్ ఏమైనా సర్ప్రైజ్ ఇస్తుందేమో చూడాలి. మార్చ్ 30 ఆదివారం రోజు థియేటర్లలు అడుగు పెడుతున్న కండల వీరుడు ఈద్ పండగ జరుపుకున్న ఫ్యాన్స్ కి కానుక ఇస్తాడో షాక్ ఇస్తాడో వేచి చూడాలి.
This post was last modified on March 23, 2025 9:51 pm
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ వైసీపీ నేతలను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ``అన్నీ గుర్తుంచుకున్నా.…
దసరా తర్వాత న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలయికలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది.…
రాజకీయాల్లో మార్పులు జరుగుతూనే ఉంటాయి. ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారుతారు. ఇలాంటి పరిణామమే ఉమ్మడి కృష్నాజిల్లాలో కూడా చోటు చేసుకుంటోంది.…
ప్రస్తుతం ఇండియాలో తెరకెక్కుతున్న చిత్రాల్లో అత్యంత హైప్ ఉన్న వాటిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా ఒకటి. ఏకంగా రూ.800…
భారీ అంచనాల మధ్య అవతార్ ఫైర్ అండ్ యాష్ విడుదలయ్యింది. ఇవాళ రిలీజులు ఎన్ని ఉన్నా థియేటర్లలో జనం నిండుగా…
మన దగ్గర అయిదు టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాలు సంక్రాంతికి తలపడుతున్నా సరే పెద్దగా టెన్షన్ వాతావరణం లేదు కానీ తమిళంలో…