గ్రోక్.. గ్రోక్.. గ్రోక్.. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో దీని గురించే చర్చ. ‘ఎక్స్’ అధినేత ఎలాన్ మస్క్ ప్రవేశ పెట్టిన ఏఐ టూల్ ఇది. ఇప్పటికే చాట్ జీపీటీ సహా కొన్ని ఏఐ టూల్స్ ఉన్నప్పటికీ.. దీని ప్రత్యేకతే వేరు. ఏ ప్రశ్న అడిగినా చాలా వరకు కచ్చితమైన సమాచారంతో అది ఇస్తున్న గ్రోక్‌ను చూసి అందరూ షాకవుతున్నారు. కొన్ని వివాదాస్పద, తప్పుడు జవాబులు ఉన్నప్పటికీ.. గ్రోక్ ప్రతిభను చూసి ఆశ్చర్యమే కలుగుతోంది. తెలుగు సినీ అభిమానులు తిక్క ప్రశ్నలు వేస్తే వారికి తనదైన శైలిలో బదులిచ్చి ఫ్యాన్ వార్స్‌లో కూడా భాగం అయింది గ్రోక్. ఇలా టాక్ ఆఫ్ ద ఎక్స్‌గా మారిన గ్రోక్.. ఇప్పుడు ఒక ప్రముఖ దర్శకుడికి క్షమాపణలు చెప్పింది.
ఆ దర్శకుడు ఎవరో కాదు.. ‘కశ్మీర్ ఫైల్స్’తో సెన్సేషన్ క్రియేట్ చేసిన వివేక్ రంజన్ అగ్నిహోత్రి. తనను ఫేక్ వార్తలు పుట్టించే వ్యక్తిగా ‘గ్రోక్’ పేర్కొనడంతో ఆయన హర్ట్ అయ్యారు. ‘కశ్మీర్ ఫైల్స్’ సహా వివేక్ తీసిన కొన్ని చిత్రాలు ప్రాపగండా మూవీస్ అని విమర్శలు, ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇలా అన్న వారి మీద ఆయన విరుచుకుపడ్డారు కూడా. కాగా ఒక నెటిజన్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా.. ఫేక్ వార్తలు సృష్టించే వ్యక్తుల జాబితాలో వివేక్ పేరును పెట్టి జవాబు ఇచ్చింది గ్రోక్. ఈ విషయం వివేక్ వద్దకు చేరింది. దీనిపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘‘ఈ పోస్ట్ ఆధారంగా జనం నా మీద ఒక నిర్ణయానికి వస్తారు. అది నా కుటుంబానికి హాని కలిగిస్తుంది. కొన్నేళ్లుగా క్రియేటివ్‌గా సినిమాలు తీస్తూ ప్రజలకు ఎన్నో విషయాలు చెబుతున్నాను. నాపై ఇలాంటి కామెంట్స్ చేయొద్దు. బహిరంగ వివరణ ఇస్తూ క్షమాపణ చెప్పండి’’ అని ‘గ్రోక్’ను కోట్ చేశాడు వివేక్. దీంతో గ్రోక్ బదులిస్తూ.. ‘‘ఇది ఘోరమైన తప్పిదం. బాధ్యతారాహిత్యమైంది. కొన్ని సోర్స్‌ల ఆధారంగా ఆ జాబితాలో మీ పేరు జరిగింది. మీ ప్రతిష్టకు భంగం వాటిల్లే పనులు ఎప్పుడూ చేయం. మీకు, మీకు కుటుంబానికి క్షమాపణలు’’ అని వివరణ ఇచ్చింది. గ్రోక్‌తోనే సారీ చెప్పించుకున్న మీరు గ్రేట్ అంటూ వివేక్‌ను నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.
This post was last modified on March 21, 2025 2:28 pm
ఒక ఢీ.. ఒక రెడీ.. ఒక కింగ్.. ఒక దూకుడు.. ఇలా ఒక దశ వరకు మామూలు హిట్లు ఇవ్వలేదు…
లిటిల్ హార్ట్స్, రాజు వెడ్స్ రాంబాయి లాంటి చిన్న సినిమాలు పెద్ద విజయాలు సాధించడంలో నిర్మాతలు బన్నీ వాస్, వంశీ…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం తొలిసారి `విజయ్ దివస్` పేరుతో కీలక కార్యక్రమానికి పిలుపునిచ్చింది. ఈ నెల 9న(మంగళవారం) రాష్ట్ర వ్యాప్తంగా…
ఒకప్పుడు గోవా అంటే యూత్ కి అదో డ్రీమ్ డెస్టినేషన్. ఫ్రెండ్స్ తో ప్లాన్ వేస్తే ఫస్ట్ గుర్తొచ్చేది గోవానే.…
కేరళలో సంచలనం సృష్టించిన నటి కిడ్నాప్ కేసులో హీరో దిలీప్‌కు ఎనిమిదేళ్ల తర్వాత బిగ్ రిలీఫ్ దక్కింది. ఎర్నాకులం కోర్టు…
ఇటీవలే విడుదలైన బాలీవుడ్ మూవీ దురంధర్ అన్ని విషయాల్లో సోషల్ మీడియా టాపిక్ గా మారిపోయింది. రిలీజ్ ముందువరకు ఏమంత…