టాలీవుడ్ ప్యాన్ ఇండియా సినిమాల షూటింగ్ ఏ దశలో ఉన్నా విడుదల తేదీలు కనీసం ఏడాది ముందు రిజర్వ్ చేసుకోవాల్సిన పరిస్థితి ప్రస్తుతముంది. ఒకవేళవాయిదా పడే అవకాశమున్నా ముందు జాగ్రత్త చర్యగా డేట్లు లాక్ చేసుకుంటున్న ట్రెండ్ ని మనోళ్లు సీరియస్ గా ఫాలో అవుతున్నారు. నాని ది ప్యారడైజ్ ఇంకా రెగ్యులర్ షూట్ వెళ్లకపోయినా అనౌన్స్ మెంట్ టీజర్ లో వచ్చే సంవత్సరం మార్చి 26 థియేటర్లలో అడుగు పెడుతుందని అధికారికంగా ప్రకటించారు. ఒకవేళ ఎవరైనా పోటీకి వచ్చే ఉద్దేశంతో వాళ్లకు ముందే హింట్ ఇచ్చినట్టు అవుతుందనే కారణం కావొచ్చు. కానీ రామ్ చరణ్ క్లాష్ ఉండొచ్చని లేటెస్ట్ అప్డేట్.
బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందుతున్న ఇంకా టైటిల్ నిర్ణయించని విలేజ్ స్పోర్ట్స్ డ్రామాని 2026 మార్చి 26 విడుదల చేయాలని ప్రాథమికంగా నిర్ణయించుకున్నట్టు యూనిట్ లీక్. నిజానికి ఈ ఏడాది దసరా లేదా దీపావళికి వస్తుందని ఫ్యాన్స్ భావించారు. దానికి తగ్గట్టే చిత్రీకరణ చాలా వేగంగా జరుగుతోంది. జాన్వీ కపూర్, శివరాజ్ కుమార్, జగపతిబాబు, దివ్యేన్దు సహా మెయిన్ ఆర్టిస్టులందరూ పూర్తిగా సహకరిస్తూ పాల్గొంటున్నారు. అలాంటప్పుడు ఆలస్యమనే మాటే ఉండదు. కానీ ఏఆర్ రెహమాన్ ఇంకా రెండు పాటలివ్వాలి. వాటితో పాటు రికార్డు అయినవి తీయాలి. రీ రికార్డింగ్, పోస్ట్ ప్రొడక్షన్ కు ఎక్కువ సమయం కేటాయించాలి.
ఇవన్నీ చూసుకుంటే సెప్టెంబర్ లేదా అక్టోబర్ లో రావడం అసాధ్యం. అందుకే ఈ టెన్షన్ లేకుండా ప్రశాంతంగా వచ్చే సంవత్సరం వద్దామని ప్లాన్ చేస్తున్నారట. వచ్చే వారం మార్చి 27 రామ్ చరణ్ బర్త్ డే. ఆ రోజే ‘పెద్ది’ టైటిల్ తో పాటు రిలీజ్ డేట్ ని ప్రకటించే అవకాశం ఉందని విశ్వసనీయ సమాచారం. అదే నిజమైన పక్షంలో నాని వర్సెస్ రామ్ చరణ్ ఫైట్ తప్పకపోవచ్చు. అయినా ఇంకా చాలా టైం ఉంది కాబట్టి ఇప్పటికిప్పుడే ఈ బాక్సాఫీస్ ఫైట్ గురించి అంచనాకు రాలేం కానీ రెండు ప్రెస్టిజియస్ మూవీ ఒకే రోజు తలపడటం సేఫ్ కాదు. ఆర్ఆర్ఆర్, రంగస్థలం మార్చిలోనే వచ్చాయి కాబట్టి ఆ సెంటిమెంట్ ఏమైనా చూస్తున్నారేమో.
This post was last modified on March 21, 2025 12:14 pm
ప్రధాన ప్రతిపక్ష హోదా ఇస్తే తప్ప.. సభకు వెళ్లేది లేదని.. వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ భీష్మించిన విషయం…
రాజకీయాల్లో కొన్ని ప్రాంతాల పేరు విన్నంతనే…కొన్ని పార్టీల పేర్లు, కొందరు రాజకీయ నేతల పేర్లు ఠక్కున గుర్తుకు వస్తాయి. ఆ…
ఏపీలో వైసీపీ విపక్ష స్థానంలోరి మారిపోయింది. తెలంగాణలో బీఆర్ఎస్ కూడా 6 నెలలకు ముందుగానే విపక్షంలోనే మారిపోయింది. విడదీయ లేనంత…
స్టార్ వారసులు ఫ్యామిలీ లెగసిని కొనసాగించే క్రమంలో తాతలు, తండ్రుల బ్లాక్ బస్టర్స్ రీమేక్ చేయడం అభిమానులు కోరుకుంటారు. కానీ…
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ ఐటీ శాఖ మంత్రి సెలవు రోజు ఆదివారం ఎంచక్కా ఆధ్మాత్మీక పర్యటనకు వెళ్లారు.…
దర్శకుడు అట్లీతో అల్లు అర్జున్ చేయబోయే ప్యాన్ ఇండియా సినిమా తాలూకు ప్రకటన కోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. దానికి…