ఇండస్ట్రీకి దూరమైపోయాడని భావించిన రమణ గోగులని సంక్రాంతికి వస్తున్నాంతో తిరిగి తీసుకొచ్చిన అనిల్ రావిపూడి, భీమ్స్ సిసిరోలియోలు ఊహించిన దానికన్నా అద్భుత ఫలితం అందుకున్నారు. గోదారి గట్టు మీద రామసిలకవే అంటూ ఆయన పాడిన పాట హోరెత్తిపోవడమే కాదు ఓపెనింగ్స్ లోనూ కీలక పాత్ర పోషించిందన్నది వాస్తవం. అంతగా మేజిక్ చేసిన రమణ గోగులకు ఒక్కసారిగా డిమాండ్ పెరిగిపోయింది. ఈ క్రేజీ సీనియర్ సింగర్ తో పాడించుకోవాలని పలువురు మ్యూజిక్ డైరెక్టర్లు వెంటపడుతున్నా రమణ గోగుల మాత్రం ఆచితూచి అడుగులు వేస్తూ ఎంపిక చేసుకుంటున్నారట.
తాజా అప్డేట్ ఏంటంటే చిరంజీవి – అనిల్ రావిపూడి కాంబో మూవీలోనూ రమణ గోగుల పాడబోతున్నారు. భీమ్స్ కంపోజ్ చేసిన మరో పెప్పి ట్యూన్ ఈసారి దద్దరిల్లిపోయేలా ఉంటుందని ఇన్ సైడ్ టాక్. ఇంకా రికార్డింగ్ జరగలేదు కానీ ఇటీవలే ట్యూన్ విన్న మెగాస్టార్ చాలా బాగుందని కితాబు ఇచ్చారట. ఫోక్ స్టైల్ లో ఉంటూనే మాస్ టచ్ తో అదిరిపోయేలా వచ్చిందని సన్నిహితుల టాక్. ఫైనల్ వెర్షన్ విన్నాక అంచనాలు ఎక్కడికో వెళ్ళిపోతాయని అంటున్నారు. ఇక్కడ ఇంకో ప్రత్యేకత ఉంది. రమణ గోగుల – పవన్ కళ్యాణ్ కాంబోతో గతంలో తమ్ముడు, బద్రి లాంటి మ్యూజికల్ ఛార్ట్ బస్టర్స్ వచ్చాయి.
ఇప్పుడు అన్నయ్య చిరంజీవికి రమణ పాడితే వింటేజ్ వైబ్స్ మరింత పెరగడం ఖాయం. ఈ సినిమాలో నాలుగు పాటలు ఉంటాయట. చిరు కామెడీ టైమింగ్ ని పూర్తిగా వాడుకుంటూ తనదైన మాస్ టచ్ అనిల్ రావిపూడి తయారు చేసిన సబ్జెక్టు సగం స్క్రిప్ట్ అయిపోయింది. మిగిలినది ఇంకో నెల రోజుల్లో పూర్తి చేయొచ్చు. వేసవిలో రెగ్యులర్ షూటింగ్ నెలల్లో ఫస్ట్ కాపీ సిద్ధం చేయాలనే లక్ష్యంతో పరుగులు పెడతారట. హీరోయిన్ ఎంపిక ఇంకా ఖరారు కాలేదు. అదితిరావు హైదరితో పాటు పలు పేర్లు పరిశీలనలో ఉన్నాయి కానీ ఫైనల్ కాలేదు. సినిమా అనౌన్స్ మెంట్ త్వరలోనే వీడియో రూపంలో ఇస్తారని సమాచారం.
This post was last modified on March 16, 2025 4:51 pm
రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలపై ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి స్పందించారు. నీళ్లు వద్దు, గొడవలే కావాలని కొందరు…
సాధారణంగా ఏదైనా ఆర్డర్ ఇస్తే డెలివరీ బాయ్స్ వెంటనే ఇచ్చేసి వెళ్ళిపోతుంటారు. కానీ తమిళనాడులో జరిగిన ఒక ఘటన మాత్రం…
ఏపీ రాజధాని అమరావతిలో కీలక ప్రాజెక్టును తిరిగి పట్టాలెక్కించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో సుమారు రూ. 2…
సెన్సార్ చిక్కుల్లో పడి నానా యాతన పడ్డ సినిమాల్లో జన నాయకుడుకి మోక్షం దక్కలేదు కానీ పరాశక్తి సంకెళ్లు తెంచుకుంది.…
వైసీపీ అధినేత జగన్ మారుతాడేమో, ప్రజల్లో ఆయనపై సానుభూతి పెరుగుతుందేమో అని కూటమి నాయకులు పలుసార్లు భావిస్తూ వచ్చారు. అందుకే…
వైసీపీ అధినేత జగన్పై సీఎం చంద్రబాబు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. వైసీపీ పాలనతో రాష్ట్రం పూర్తిగా విధ్వంసమైందని అన్నారు.…