టాలీవుడ్ స్టార్ హీరోల్లో అత్యంత పొడగరి, భారీ కాయుడు ఎవరంటే ప్రభాస్ పేరు ముందు వరుసలో ఉంటుంది. ఆహార్యంలో అతణ్ని మ్యాచ్ చేసే హీరో టాలీవుడ్లో కనిపించడంటే అతిశయోక్తి కాదు. అలాంటి హీరోను తన బాడీ బిల్డింగ్‌తో డామినేట్ చేశానని అంటున్నాడు మంచు విష్ణు. ‘కన్నప్ప’ సినిమాలో లీడ్ రోల్ కోసం విష్ణు బాగానే బాడీ పెంచాడు. ఆ సినిమా నుంచి ఈ మధ్య రిలీజ్ చేసిన రెండు పాటల్లోనూ కండలు తిరిగిన దేహంతో భలేగా కనిపించాడు విష్ణు. ఐతే విష్ణు ఎంత బాడీ బిల్డింగ్ చేసినా సరే.. ప్రభాస్ ముందు అది తక్కువే అవుతుందని అనుకుంటాం. కానీ స్వయంగా ప్రభాస్.. విష్ణును చూసి నీలో నేను సగం ఉన్నా అని కామెంట్ చేశాడంటే ఆశ్చర్యపోవాల్సిందే.
ఈ విషయాన్ని స్వయంగా విష్ణు ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. ఇప్పుడున్న టెక్నాలజీలో హీరోలను తెర మీద చాలా బలంగా చూపించడానికి పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. లేని సిక్స్ ప్యాక్‌లతో మాయ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తెర మీద ప్రభాస్‌ను మ్యాచ్ చేయడానికి ఏదైనా టెక్నాలజీ వాడారా అని ఓ ఇంటర్వ్యూలో అడిగితే ఇంట్రెస్టింగ్ ఆన్సర్ ఇచ్చాడు విష్ణు. ‘‘ప్రభాస్ ఈ మధ్య బాగా సన్నబడ్డాడు. కన్నప్ప షూటింగ్‌కు వచ్చినపుడు కూడా చాలా సన్నగా కనిపించాడు. అతణ్ని స్లీవ్ లెస్ డ్రెస్ వేసుకోమంటే కుదరదని చెప్పాడు. ‘నీలో నేను సగం ఉన్నా. స్లీవ్ లెస్ వేస్తే బాగోదు’ అన్నాడు’’ అంటూ షాకింగ్ కామెంట్ చేశాడు విష్ణు.
ఈ మధ్య సోషల్ మీడియాలో నెగెటివిటీ బాగా ఎక్కువైపోయిన విషయాన్ని ప్రస్తావిస్తూ.. ‘కన్నప్ప’లో నటించినందుకు ప్రభాస్‌కు డబ్బులు ఇవ్వకపోతే చంపేస్తా అని ఒక నెటిజన్ తనను బెదిరించినట్లు విష్ణు చెప్పడం విశేషం. ప్రభాస్ అయినా.. మోహన్ లాల్, అక్షయ్ కుమార్, శరత్ కుమార్, కాజల్ లాంటి వాళ్లయినా తమ మీద ఉన్న అభిమానంతోనే ఈ సినిమాలో నటించినట్లు విష్ణు తెలిపాడు.
This post was last modified on March 16, 2025 5:51 pm
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని గత 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికి 17 మాసాలుగా ఈ…
తెలుగు ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన తమిళ స్టార్ ద్వయం సూర్య, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద కమర్షియల్ హిట్ లేక…
భారత ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసేది.. `రూపాయి మారకం విలువ`. ప్రపంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాలరుతోనే తమతమ కరెన్సీ…
తిరుమలలో పరకామణి చోరీ వ్యవహారంపై రెండు రోజుల కిందట ప్రెస్ మీట్ లో మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు…
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…
శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…