కోర్ట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నాని మాట్లాడుతూ ఒకవేళ ఈ సినిమా నచ్చకపోతే హిట్ 3 చూడొద్దంటూ పిలుపునివ్వడం ఎంత హాట్ టాపిక్ అయ్యిందో చూశాం. ఎంత నమ్మకం ఉన్నా మరీ ఇంత పెద్ద స్టేట్ మెంట్ ఇవ్వడం ఏంటని అభిమానులు కూడా ఆశ్చర్యపోయారు. కానీ నాని కాన్ఫిడెన్స్ మరోసారి గెలిచింది. కోర్ట్ యునానిమస్ విన్నర్ గా నిలిచింది. సాధారణంగా కోర్ట్ రూమ్ డ్రామాలు టాలీవుడ్ లో ఆడిన దాఖలాలు తక్కువ. ఇప్పుడు హిలేరియస్ అంటాం కానీ అప్పట్లో చెట్టు కింద ప్లీడర్ కూడా యావరేజే. వకీల్ సాబ్ వంద కోట్లు దాటలేదు. అందుకే కోర్ట్ విజయావకాశాల మీద అనుమానాలు లేకపోలేదు.
ఇప్పుడవన్నీ బద్దలైపోయాయి. కోర్ట్ బుకింగ్స్ మొదటి రోజుకు పోటీగా శని ఆదివారాలు ఎక్కువగా జరిగే సంకేతాలు కనిపిస్తున్నాయి. పోటీలో ఉన్న వాటిని తోసిరాజని బుకింగ్ ట్రెండ్స్ లో జోరు చూపిస్తోంది. ఇప్పుడు నాని నిశ్చింతగా ఉన్నాడు. ఇవాళ జరిగిన సక్సెస్ ప్రెస్ మీట్ లో హిట్ 3 బుకింగ్స్ మొదలుపెట్టమంటారా అంటూ జోకేసినా తన మాట గెలిచిన ఆనందం మొహంలో కనిపించింది. హిట్ 3కి ప్రత్యేకంగా కోర్ట్ ద్వారా బజ్ రావాల్సిన అవసరం లేకపోయినా నాని హామీ వల్ల రెండింటికి ముడిపడింది. ఇప్పుడది తీరిపోవడంతో న్యాచురల్ స్టార్ అభిమానుల సంతోషం మాములుగా లేదు.
మే 1 విడుదల కాబోతున్న హిట్ 3 ప్రమోషన్లు పాటల విడుదలతో వచ్చే వారం నుంచి మొదలుపెట్టొచ్చని సమాచారం. నాని ఈ ప్రాజెక్టుని చాలా ప్రతిష్టాత్మాకంగా తీసుకున్నాడు. మొదటి రెండు భాగాల్లో నటించిన విశ్వక్ సేన్, అడివి శేష్ ల కంటే తన మార్కెట్ పెద్దది కావడంతో బడ్జెట్ కూడా లెక్క చేయకుండా రిస్కీ లొకేషన్లో షూటింగ్ కి ఎస్ చెప్పాడు. దర్శకుడు శైలేష్ కొలను మీద నమ్మకంతో పెద్ద స్కేల్ మీద నిర్మించాడు. వయొలెన్స్ ఏ స్థాయిలో ఉంటుందో టీజర్ శాంపిల్ లో చూపించారు. ఇక ట్రైలర్ ఎలా ఉండబోతోందనే అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. థియేట్రికల్ బిజినెస్ పెద్ద ఎత్తున ఉండబోతోంది.
This post was last modified on March 14, 2025 7:51 pm
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ వైసీపీ నేతలను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ``అన్నీ గుర్తుంచుకున్నా.…
దసరా తర్వాత న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలయికలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది.…
రాజకీయాల్లో మార్పులు జరుగుతూనే ఉంటాయి. ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారుతారు. ఇలాంటి పరిణామమే ఉమ్మడి కృష్నాజిల్లాలో కూడా చోటు చేసుకుంటోంది.…
ప్రస్తుతం ఇండియాలో తెరకెక్కుతున్న చిత్రాల్లో అత్యంత హైప్ ఉన్న వాటిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా ఒకటి. ఏకంగా రూ.800…
భారీ అంచనాల మధ్య అవతార్ ఫైర్ అండ్ యాష్ విడుదలయ్యింది. ఇవాళ రిలీజులు ఎన్ని ఉన్నా థియేటర్లలో జనం నిండుగా…
మన దగ్గర అయిదు టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాలు సంక్రాంతికి తలపడుతున్నా సరే పెద్దగా టెన్షన్ వాతావరణం లేదు కానీ తమిళంలో…