‘మిర్చి’ సినిమా ఇంటర్వెల్ బ్యాంగ్‌లో ‘నా ఫ్యామిలీ సేఫ్’ అంటూ ప్రభాస్ చెప్పే డైలాగ్ ఎంత పాపులరో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. కాల క్రమంలో అదొక మీమ్ టెంప్లేట్‌గా మారిపోయింది. ఇప్పుడు ఒక దర్శకుడు ఈ టెంప్లేట్‌తో పెట్టిన పోస్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ దర్శకుడు ఎవరో కాదు.. ‘హిట్’ ఫ్రాంఛైజీ చిత్రాలతో సెన్సేషన్ క్రియేట్ చేసిన శైలేష్ కొలను. నాని నిర్మాణంలో ప్రియదర్శి ప్రధాన పాత్ర పోషించిన ‘కోర్ట్’ మూవీ ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో రెండు రోజుల ముందే ఈ చిత్రానికి ప్రిమియర్స్ వేశారు. ఆ షో చూసిన అనంతరం శైలేష్ ‘నా సినిమా సేఫ్’ అంటూ పోస్టు పెట్టాడు. ‘మిర్చి’లో ‘నా ఫ్యామిలీ సేఫ్’ అంటూ ప్రభాస్ డైలాగ్ చెప్పే ఫొటోను కూడా అతను జోడించాడు. ఇంతకీ అతనిలా పోస్టు పెట్టడానికి కారణం ఏంటంటే..?‘కోర్ట్’ సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్లో నాని ఒక ఆసక్తికర సవాలు విసిరాడు. ‘కోర్ట్’ సినిమా చూసి అది నచ్చకపోతే తాను హీరోగా నటిస్తున్న ‘హిట్-3’ సినిమా చూడాల్సిన అవసరం లేదని అన్నాడు. దీన్ని బట్టే ‘కోర్ట్’ మీద నాని నమ్మకం ఎలాంటిదో జనాలకు అర్థమైంది. ఇప్పుడు సినిమా చూసిన వాళ్లంతా నాని అంత ధీమాగా ఆ ప్రకటన చేయడంలో ఆశ్చర్యం లేదంటున్నారు.
‘కోర్ట్’కు ఫుల్ పాజిటివ్ టాకే వచ్చింది. కాబట్టి ‘హిట్-3’ సినిమాకు వచ్చిన ఇబ్బందేమీ లేదని తేలిపోయింది. ఈ నేపథ్యంలోనే శైలేష్ ఈ పోస్ట్ పెట్టాడు. ‘కోర్ట్’ సినిమా హిట్ కాబట్టి నాని ఛాలెంజ్ నిలబడిందని.. తన సినిమా సేఫ్ అని అతనిలా వ్యాఖ్యానించాడు. ‘కోర్ట్’ సినిమా నుంచి తీసుకోవడానికి చాలా ఉందని.. ఇది సమాజానికి చాలా అవసరమైన సినిమా అని అతను వ్యాఖ్యానించాడు. ఈ పోస్ట్ పెట్టి ఇక తాను ‘హిట్-3’ ఎడిట్ రూంకు వెళ్లాల్సి ఉందంటూ బై చెప్పాడు శైలేష్. నాని నిర్మాణంలో ఇంతకుముందు వచ్చిన ‘అ!’, ‘హిట్’, ‘హిట్-2’ మంచి అప్లాజ్ తెచ్చుకోక.. తన విన్నింగ్ స్ట్రీక్‌ను ‘కోర్ట్’ కూడా కొనసాగించేలాగే కనిపిస్తోంది.
This post was last modified on March 13, 2025 8:10 pm
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…