కేవలం సినిమాలో వినోదం ఉంటే సరిపోదని.. ప్రమోషన్లను కూడా సినిమా థీమ్‌కు తగ్గట్లు సరదాగా డిజైన్ చేసి ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నాయి చిత్ర బృందాలు. కామెడీ మూవీ అయిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా విషయంలో దర్శకుడు అనిల్ రావిపూడి ఎలాంటి ప్రమోషనల్ ఐడియాలు అమలు చేశాడో తెలిసిందే. సినిమా చాలా సరదాగా ఉండబోతోందన్న విషయాన్ని ప్రమోషన్ల ద్వారా అతను బాగానే ప్రేక్షకుల్లో ఇంజెక్ట్ చేయగలిగాడు. ఇప్పుడు ‘రాబిన్ హుడ్’ సినిమా విషయంలో కూడా టీం అదే ట్రెండును ఫాలో అవుతోంది. ఈ సినిమాకు సంబంధించి ప్రతి ప్రమోషనల్ ఐడియా ఫన్నీగా ఉంటోంది. ఈ క్రమంలోనే కొత్తగా ఒక ఫన్నీ ‘పాడ్ కాస్ట్’తో వచ్చారు దర్శకుడు వెంకీ కుడుముల-హీరో నితిన్. దీనికి ‘పాడు కాస్ట్’ అనిపేరు పెట్టడం విశేషం.
ఇందులో భాగంగా నితిన్ కొన్ని టిపికల్ ప్రశ్నలు అడిగితే.. వాటికి వెంకీ ‘హానెస్ట్’గా సమాధానాలు ఇచ్చే ప్రయత్నం చేశాడు. హీరో ఫైట్ చేస్తుంటే ఫైటర్లంతా ఒకేసారి రాకుండా వెనుక నుంచి ఒకరి తర్వాత ఒకరు రావడం గురించి నితిన్ అడిగితే.. అసిస్టెంట్ డైరెక్టర్లు వాళ్లను అలాగే ఒకరి తర్వాత ఒకరిని పంపిస్తారని అన్నాడు వెంకీ. తన సినిమాలకు శుభం కార్డు వేయకపోవడం గురించి అడిగితే.. సినిమా పూర్తయ్యాకే కదా శుభమో, అశుభమో తెలిసేది అంటూ కౌంటర్ వేశాడు వెంకీ.
హీరోయిన్లను నార్త్ ఇండియా నుంచే ఎందుకు తీసుకొస్తారు అంటే.. ఆ ప్రశ్న రాకూడదనే తన సినిమాల్లో వరుసగా సౌత్ హీరోయిన్లనే పెడుతున్నట్లు వెంకీ చెప్పాడు. హీరోలు నిద్ర లేచినపుడు చాలా ఫ్రెష్‌గా, అందంగా ఎలా కనిపిస్తారు అని అడిగితే.. రాత్రి పడుకునే ముందే హీరోకు మేకప్ వేసి పడుకోబెడతాం అని బదులిచ్చాడు వెంకీ. ఇలా సరదా ప్రశ్నలు, సమాధానాలతో ‘పాడు కాస్ట్’ భలే ఫన్నీగా అనిపించింది. దీనికి పార్ట్-2 కూడా రాబోతున్నట్లు వెల్లడించడం విశేషం.
This post was last modified on March 13, 2025 8:05 pm
క్రేజీ కాంబినేషన్ లో రూపొందిన ఒక సినిమా తొమ్మిదేళ్ళు ల్యాబ్ లోనే మగ్గిపోవడం చాలా అరుదు. ఏదో ఒకరకంగా బయటికి…
అప్పుడు మహ్మద్ గజని… ఇప్పుడు వైఎస్ జగన్ అంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. దేవాలయాలు, హిందూ సంప్రదాయాలపై వైసీపీ దాడులు…
సంక్రాంతి సీజన్ లో భారీ అంచనాల మధ్య వచ్చిన ది రాజా సాబ్ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ఒక రకమైన…
సంక్రాంతి రేసులో రెండో పుంజు దిగుతోంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ది రాజా సాబ్ ఫలితం మీద దాదాపు…
వాళ్లు వీళ్లు అన్న తేడా లేకుండా మోసమే శ్వాసగా మారి.. తమ మాటల్ని నమ్మినోళ్లను మోసం చేసే సైబర్ బందిపోట్లు..…
వేటూరి, సిరివెన్నెల లాంటి దిగ్గజ గేయ రచయితలు వెళ్ళిపోయాక తెలుగు సినీ పాటల స్థాయి తగ్గిపోయిందని సాహితీ అభిమానులు బాధ…