సోషల్ మీడియాలో ఎప్పుడు ఏది ట్రెండ్ అవుతుందో అర్థం కాదు. ప్రస్తుతం తెలుగు సోషల్ మీడియాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ డ్యాన్సులు ట్రెండింగ్ టాపిక్‌గా మారిపోయంది. పవన్ కెరీర్ ఆరంభంలో మంచి డ్యాన్సర్ లాగే కనిపించేవాడు కానీ.. తర్వాత తర్వాత వాటి మీద పెద్దగా ఫోకస్ పెట్టలేదు. ఐతే చివరగా పవన్ వీర లెవెల్లో డ్యాన్సులు వేసిందంటే ‘సర్దార్ గబ్బర్ సింగ్’ సినిమాలోనే అని చెప్పాలి. ఆ చిత్రంలో ప్రి క్లైమాక్స్‌లో పవన్ డ్యాన్స్ మెడ్లీ ఉంటుంది. ఇంద్రలోని ఫేమస్ వీణ స్టెప్‌తో పాటు పవన్ రకరకాల డ్యాన్సులు వేస్తాడు. అది విలన్ గ్యాంగును ఏడిపించే క్రమంలో వెటకారంగా వేసే డ్యాన్సులు.
సినిమా రిలీజైనపుడు అవేమంత పాపులర్ కాలేదు కానీ.. ఇప్పుడు అనూహ్యంగా సోషల్ మీడియాను ఈ స్టెప్స్ ఊపేస్తున్నాయి. గత కొన్ని రోజులుగా తెలుగు సోషల్ మీడియాలో ఇదే ట్రెండింగ్ టాపిక్.దీనికి అడుగు పడింది ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ రీ రిలీజ్ సందర్భంగా. ఓ థియేటర్లో మహేష్ బాబు ఫ్యాన్స్ కొందరు సినిమా చూస్తూ.. మధ్యలో ‘సర్దార్ గబ్బర్ సింగ్’లోని పవన్ స్టెప్పులను రీక్రియేట్ చేశారు. ఆ వీడియో వైరల్ అయిపోయింది. నిజానికి ఇది ట్రోలింగ్ లాగే భావించారు అందరూ. దీని మీద మహేష్, పవన్ ఫ్యాన్స్ మధ్య వాదోపవాదాలు కూడా జరిగాయి. ఐతే ఇంతకీ అసలు స్టెప్ ఏంటో కనుక్కునే ప్రయత్నంలో నెటిజన్లు ‘సర్దార్ గబ్బర్ సింగ్’లో పవన్ స్టెప్స్‌ను రీ విజిట్ చేసే ప్రయత్నం చేశారు.
ఆ క్రమంలో రకరకాల పాటలకు ఈ స్టెప్స్‌ను సింక్ చేసి వీడియోలు పోస్ట్ చేయడం మొదలుపెట్టారు. ఇది కొన్ని రోజుల్లో పెద్ద ట్రెండుగా మారిపోయింది. గతంలో మలయాళ స్టార్ మోహన్ లాల్ స్టెప్స్‌ను అన్ని పాటలకూ సింక్ చేసినట్లే.. పవన్ స్టెప్స్‌ను సింక్ చేయడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో వేల కొద్దీ వీడియోలు తయారయ్యాయి. ట్రోల్స్‌లా మొదలైన ట్రెండ్ కాస్తా.. పవన్ ఫ్యాన్స్ కూడా సరదాగా తీసుకునేలా మారి సోషల్ మీడియాలో వైరల్ ట్రెండ్‌గా మారిపోయింది.
This post was last modified on March 12, 2025 2:31 pm
బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…