టాలీవుడ్లో గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తూనే క్వాలిటీ, వెరైటీ చూపించే హీరో నాని. దసరా, హాయ్ నాన్న, సరిపోదా శనివారం.. ఇలా ఏడాదిన్నర వ్యవధిలో మూడు భిన్న చిత్రాలతో ప్రేక్షకులను మెప్పించాడు. ఇక ఈ వేసవికి నాని నుంచి రాబోతున్న ‘హిట్-3’ మీద కూడా భారీ అంచనాలే ఉన్నాయి. ఒక సినిమా చేస్తుండగానే.. ఇంకో సినిమాకు అన్నీ సిద్ధం చేసుకుని.. కొత్త చిత్రం విడుదలైన వెంటనే ఆ చిత్రాన్ని పట్టాలెక్కించడం నానికి అలవాటు. ఈసారి కూడా అలాగే ప్లాన్ చేసుకున్నాడు కానీ.. తాను ఓకే చేసిన చిత్రాన్ని డైరెక్ట్ చేయాల్సిన వ్యక్తి సందిగ్ధంలో ఉండడం వల్ల అది వెంటనే పట్టాలెక్కే పరిస్థితి లేదు.
‘హిట్-3’ తర్వాత సుజీత్ దర్శకత్వంలో సినిమాను ఓకే చేశాడు నాని. కానీ అతను ‘ఓజీ’ సినిమాను పూర్తిచేయాల్సి ఉంది. అది పవన్ కళ్యాణ్ చేతుల్లోనే ఉంది. కానీ పవన్ ఇంకా ‘హరిహర వీరమల్లు’నే పూర్తిచేయలేదు. అది అయ్యాకే ‘ఓజీ’ పని మొదలుపెడతాడు. కాబట్టి సుజీత్ ఖాళీ అవ్వడానికి టైం పడుతుంది. ఈలోపు నాని ప్యారడైజ్ పూర్తి చేయనున్నాడు. ఇదిలా ఉండగా.. నాని-సుజీత్ సినిమాను నిర్మించాల్సిన డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ ఆ మూవీ నుంచి తప్పుకుందన్నది తాజా సమాచారం. కారణాలేంటన్నది తెలియదు మరి. అలా అని సుజీత్-నాని మూవీ ఆగిపోతుందని అనుకోవడానికేమీ లేదు.
నానితో ‘శ్యామ్ సింగరాయ్’ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేసిన వెంకట్ బొల్లినేని లైన్లోకి వచ్చారట. ఈ సినిమాను తన బేనర్లో చేస్తానని.. అందుకోసం ఎన్నిరోజులైనా వెయిట్ చేస్తానని ఆయన అంటున్నారట. ‘శ్యామ్ సింగ రాయ్’తో తన బేనర్‌కు మంచి విజయాన్నందించిన నాని మీద వెంకట్‌కు చాలా అభిమానం ఉంది. నాని ప్రతి పుట్టిన రోజుకూ ఆయన శుభాకాంక్షలు చెబుతూ పలు మీడియాల్లో యాడ్స్ ఇస్తారు. ‘శ్యామ్ సింగరాయ్’ తర్వాత ‘సైంధవ్’తో షాక్ తిన్న ఆయన.. మళ్లీ నాని సినిమాతోనే బౌన్స్ బ్యాక్ అవ్వాలని చూస్తున్నారు.
This post was last modified on March 9, 2025 2:52 pm
రాజకీయాల్లో విమర్శలు చేయొచ్చు. ప్రతివిమర్శలు కూడా ఎదుర్కొనచ్చు. కానీ, ప్రతి విషయంలోనూ కొన్ని హద్దులు ఉంటాయి. ఎంత రాజకీయ పార్టీకి…
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని గత 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికి 17 మాసాలుగా ఈ…
తెలుగు ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన తమిళ స్టార్ ద్వయం సూర్య, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద కమర్షియల్ హిట్ లేక…
భారత ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసేది.. `రూపాయి మారకం విలువ`. ప్రపంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాలరుతోనే తమతమ కరెన్సీ…
తిరుమలలో పరకామణి చోరీ వ్యవహారంపై రెండు రోజుల కిందట ప్రెస్ మీట్ లో మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు…
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…