రీఎంట్రీలో వరుస బెట్టి సినిమాలు అనౌన్స్ చేసుకుంటూ పోతున్నాడు పవన్ కళ్యాణ్. పునరాగమనంలో తొలి చిత్రం అయిన ‘వకీల్ సాబ్’ ఇంకా పూర్తి కాలేదు కానీ.. అప్పుడే ఐదో సినిమా అనౌన్స్ చేశాడు. సితార ఎంటర్టైన్మెంట్స్ బేనర్లో ‘అప్పట్లో ఒకడుండేవాడు’ ఫేమ్ సాగర్.కె.చంద్ర దర్శకత్వంలో పవన్ నటించబోతున్న సంగతి తెలిసిందే. అధికారికంగా ప్రకటించలేదు కానీ.. ఈ చిత్రం మలయాళ బ్లాక్‌బస్టర్ ‘అయ్యప్పనుం కోషీయుం’ రీమేక్ అన్నది తెలిసిన విషయమే.
పైగా పవన్ ఈ చిత్రంలో పోలీస్ పాత్ర చేయబోతున్నట్లు కూడా సంకేతాలు ఇచ్చేశారు. దీన్ని బట్టి ఒరిజినల్లో బిజు మీనన్ చేసిన సిన్సియర్ పోలీసాఫీసర్ పాత్రలో పవన్ నటించనున్నట్లు స్పష్టమైంది. ఐతే ఈ పాత్రను, సినిమాను ఉన్నదున్నట్లుగా తెలుగులో తీస్తే ఆడుతుందా అన్నది సందేహం.
‘అయ్యప్పనుం కోషీయుం’ ఇద్దరు ఇగోయిష్టుల మధ్య సాగే పోరు నేపథ్యంలో కొంచెం క్లాస్‌గా సాగే సినిమా. మలయాళ ప్రేక్షకుల అభిరుచికి అది బాగానే ఉంటుంది. కానీ దాన్ని తెలుగులో యాజిటీజ్‌గా తీస్తే మాత్రం మన వాళ్లకు నచ్చుతుందా అన్నది సందేహం. పైగా ఈ సినిమాను లాక్ డౌన్ టైంలో తెలుగు వాళ్లు కూడా ఈ సినిమాను బాగానే చూశారు. అలాంటపుడు తెలుగు వెర్షన్లో కచ్చితంగా మార్పు చూపించాలి.
పవన్ చేయబోయే పోలీస్ పాత్ర ఆసక్తికరంగా ఉంటుంది. అందులో దమ్ము కనిపిస్తుంది. కానీ మలయాళంలో మాదిరి సటిల్‌గా, క్లాస్‌గా ఆ పాత్రను నడిపిస్తే కిక్కుండదు. కచ్చితంగా ఆ పాత్రకు మరింత ఎలివేషన్ ఇవ్వాలి. మాస్ అంశాలు జోడించాలి. ‘దబంగ్’లో బేసిక్ ఐడియా తీసుకుని దాని రూపురేఖలు మార్చి హరీష్ శంకర్ ‘గబ్బర్ సింగ్’గా మార్చినట్లు సాగర్ కూడా ‘తెలుగు మాస్ టచ్’ ఇస్తే పవన్ పాత్ర పేలేందుకు సినిమా సూపర్ హిట్టయ్యేందుకు అవకాశముంది. అలా కాకుండా ఉన్నదున్నట్లుగా తీసేస్తే ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను ఎగ్జైట్ చేయడం కష్టమే.
This post was last modified on October 26, 2020 6:08 pm
దేశ చరిత్రలో.. ముఖ్యంగా ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంగా పరిఢవిల్లుతున్న భారత దేశంలో తొలిసారి ఎవరూ ఊహించని ఘటన..…
పుష్ప 2 ది రూల్ ర్యాంపేజ్ అయ్యాక బాక్సాఫీస్ వద్ద మరో ఆసక్తికరమైన సమరానికి తెరలేస్తోంది. క్రిస్మస్ ని టార్గెట్…
బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రజలపై…
తెలంగాణ పల్లె గీతాలకు ఆణిముత్యమైన జానపద గాయకుడు మొగిలయ్య ఈ రోజు తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. కొంతకాలంగా గుండె, కిడ్నీ…
వైసీపీ తీరు మారలేదు. ఒకవైపు.. ఇండియా కూటమిలో చేరేందుకు ఆసక్తి కనబరుస్తున్నట్టు ఆ పార్టీ కీలక నాయకుడు, రాజ్యసభ సభ్యుడు…
అగ్రరాజ్యం అమెరికాలో చోటు చేసుకున్న పరిణామాలు.. విదేశీ విద్యార్థులు, వృత్తి నిపుణులను ఇరకాటంలోకి నెడుతున్నాయి. మరో రెండు మూడు వారాల్లోనే…