సౌత్ ఇండియాలోనే కాదు బాలీవుడ్ లోనూ చాలా క్రేజ్ ఉన్న దర్శకుల్లో ప్రశాంత్ నీల్ ఒకరు. కెజిఎఫ్ వల్ల ఆయన పేరు మారుమ్రోగిపోయింది. షారుఖ్ ఖాన్ పోటీని తట్టుకుని ఇమేజ్ లేని హీరోతో బ్లాక్ బస్టర్ సాధించడం గురించి అప్పట్లో బోలెడు మాట్లాడుకున్నారు. సలార్ సైతం భారీ విజయం నమోదు చేసుకుని ప్రభాస్ వన్ అఫ్ ది బెస్ట్ గా నిలిచింది. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ తో డ్రాగన్ (ప్రచారంలో ఉన్న టైటిల్) పనిలో బిజీగా ఉన్న ఈ క్రేజీ డైరెక్టర్ ఇంకో పది నెలల్లో సరికొత్త ప్రపంచాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నాడు. ఇక బ్యాడ్ డైరెక్టర్స్ అని ఎవరిని అన్నాడో చూద్దాం.
ఇటీవలే ఫిలిం స్టూడెంట్స్ కోసం అక్కినేని అమల నిర్వహించిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న ప్రశాంత్ నీల్ కొన్ని ఆసక్తికరమైన ముచ్చట్లు పంచుకున్నారు. ” సినిమా చూడటం వేరు. తీయడం వేరు. 2014 ఉగ్రంకు ముందు ఇప్పటిదాకా సినిమాలు తీసినవాళ్లంతా బ్యాడ్ డైరెక్టర్స్ అనుకునే వాడిని. ఇండస్ట్రీలో నేనే మార్పు తేవాలని ఫీలయ్యేవాడిని. కానీ సెట్లోకి అడుగు పెట్టి షూటింగ్ స్టార్ట్ చేసి కొంత భాగం పూర్తయ్యాక అసలైన కష్టమంటే ఏంటో తెలిసొచ్చింది. నేను తీసింది పది మంది చూసినా చాలనుకునేవాడిని. టెన్నిస్ లాంటి ఫిలిం మేకింగ్ ని క్రికెట్ అనుకున్నా. పరిశ్రమలో టీమ్ వర్క్ ఉంటేనే విజయం వరిస్తుంది.”
చూశారుగా ప్రశాంత్ నీల్ తొలినాళ్లలో ఎలాంటి ఆలోచనలతో ఉన్నారో. సాధారణంగా ప్రాధమిక దశలో దర్శకుల ఆచరణలు ఇదే విధంగా ఉంటాయి. మనమే తోప్ అనుకుని కెమెరా, యాక్షన్ అంటూ మెగా ఫోన్ పట్టుకుంటారు. కానీ నీల్ చెప్పిన జీవిత సత్యం వింటే రియాలిటీ ఎంత భయపెట్టేలా ఉందో అర్థమవుతుంది. ప్రశాంత్ నీల్ అన్నట్టు ఉగ్రం మొదట్లో డివైడ్ టాక్ తెచ్చుకుని తర్వాత సూపర్ హిట్ అయ్యింది. దాన్ని ప్రపంచానికి పరిచయం చేయాలనే ఉద్దేశంతో అదే కథలో కీ పాయింట్ గా తీసుకుని సలార్ తెరకెక్కించారు నీల్. నమ్మకం వమ్ము కాకుండా ప్రభాస్ వందల కోట్ల వసూళ్లతో దాన్ని నిలబెట్టడం కీలక ట్విస్టు.