తన స్టార్‍డమ్‍కి అతీతంగా పవన్ కళ్యాణ్ ఒక్కోసారి విచిత్రమైన ప్రాజెక్టులు ఓకే చేస్తుంటాడు. మళ్లీ నటించాలనే నిర్ణయం తీసుకున్న తర్వాత ‘పింక్’ రీమేక్ చేయాలని పవన్ డిసైడ్ అవడమే ఆశ్చర్యకరమయితే ఇప్పుడు ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ చిత్రాన్ని తెలుగులో చేస్తున్నాడట. సితార ఎంటర్‍టైన్‍మెంట్స్ పతాకంపై రూపొందే ఈ చిత్రానికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ త్వరలోనే వస్తుందని సమాచారం. ఈ చిత్రానికి యువ దర్శకుడు సాగర్ చంద్ర దర్శకత్వం వహిస్తాడని ప్రచారంలో వుంది.
నారా రోహిత్, శ్రీవిష్ణుతో ‘అప్పట్లో ఒకడుండేవాడు’ చిత్రాన్ని రూపొందించిన సాగర్ చంద్ర ఆ తర్వాత మరే చిత్రం రూపొందించలేదు. పవన్‍కళ్యాణ్ లాంటి అగ్ర హీరోతో అంతగా అనుభవం లేని, కనీసం ఫీల్డులో కూడా లేని దర్శకుడితో సినిమా ఏమిటనేది ఫాన్స్ కి అంతు చిక్కడం లేదు. వకీల్ సాబ్ మాదిరిగా తక్కువ వర్కింగ్ డేస్‍లో కంప్లీట్ అయ్యే సినిమా కనుక పవన్ కళ్యాణ్ దీనిని ప్రిఫర్ చేస్తున్నట్టు భోగట్టా. వకీల్ సాబ్ షూటింగ్ పూర్తి కాగానే ఈ చిత్రం మొదలు పెట్టి ఆ తర్వాత క్రిష్‍తో చేసే చిత్రానికి పవన్ షిఫ్ట్ అవుతాడట. ఆ తర్వాతే హరీష్ శంకర్‍తో మైత్రి మూవీస్ సినిమా వుంటుందని ఇండస్ట్రీ రిపోర్ట్.
This post was last modified on October 25, 2020 10:51 am
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…