శాండిల్ వుడ్ టాప్ స్టార్లలో ఒకడైన శివరాజ్ కుమార్ గత ఏడాది క్యాన్సర్ బారిన పడడం ఆయన కుటుంబం, అభిమానుల్లో తీవ్ర ఆందోళన రేకెత్తించింది. కొన్నేళ్ల కిందటే పునీత్ రాజ్ కుమార్ మరణంతో ఆ కుటుంబం కోలుకోలేని షాక్ తింది. అభిమానులు కూడా ఆ విషాదం నుంచి బయటికి రావడానికి చాలా టైం పట్టింది. అలాంటిది ఇప్పుడు కుటుంబానికి పెద్ద దిక్కు అయిన శివరాజ్ కుమార్‌కు క్యాన్సర్ సోకిందనే సరికి అందరూ టెన్షన్ పడ్డారు. ఐతే కొన్ని నెలల చికిత్స అనంతరం శివరాజ్ కుమార్ కోలుకున్నారు. అమెరికాలో ఆయనకు ట్రీట్మెంట్ జరిగింది. అభిమానులు శివన్న అని పిలుచుకునే ఆయన సంపూర్ణ ఆరోగ్యవంతుడయ్యే ప్రయత్నంలో ఉన్నారు.
ఇటీవలే తాను క్యాన్సర్ ఫ్రీ అని ప్రకటించిన శివరాజ్ కుమార్.. మార్చిలో మళ్లీ షూటింగ్‌కు కూడా హాజరు కానున్నట్లు వెల్లడించారు. తనకు క్యాన్సర్ సోకడం.. ఆ సమయంలో అనుభవవించిన టెన్షన్.. కోలుకుని మళ్లీ మామూలు మనిషి కావడం గురించి ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. ‘‘నాకు క్యాన్సర్ ఉన్నట్లు గత ఏడాది ఏప్రిల్లో తెలిసింది. వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న సమయంలో కొన్ని అనారోగ్య లక్షణాలు కనిపించాయి. అది విశ్రాంతి లేకుండా పని చేయడం వల్లే అనుకున్నా. బెంగళూరులోని ఓ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ కూడా తీసుకున్నా. కానీ కొన్ని రోజులకు పరీక్షలు చేయిస్తే క్యాన్సర్ ఉన్నట్లు తెలిసింది.
అప్పుడు కంగారు పడ్డాను. కానీ కుటుంబ సభ్యులు, వైద్యులు ఇచ్చిన ధైర్యంతో చికిత్స తీసుకున్నా. కానీ వెంటనే షూటింగ్స్ మానలేదు. కీమో థెరపీ చేయించుకుంటూ కూడా చిత్రీకరణలో పాల్గొన్న రోజులు ఉన్నాయి. కీమో థెరపీ సమయంలో బాగా నీరసంగా అనిపించేది. మొత్తానికి క్యాన్సర్ నుంచి కోలుకున్నాను. ఇప్పుడు సంపూర్ణ ఆరోగ్యవంతుడయ్యే దిశగా ఆహార నియమాలు పాటిస్తున్నా. యోగా చేస్తున్నా. మార్చి 3 నుంచి మళ్లీ షూటింగ్‌లో పాల్గొంటాను. మార్చి 5న హైదరాబాద్‌కు వెళ్తున్నా. రామ్ చరణ్ సినిమా చిత్రీకరణలో పాల్గొంటా. ఆ చిత్రంతో నా పాత్ర ప్రత్యేంగా ఉంటుంది’’ అని శివన్న తెలిపాడు.
This post was last modified on February 26, 2025 4:27 pm
షూటింగ్ అయిపోయింది ఇంకే టెన్షన్ లేదని హరిహర వీరమల్లు వెంటనే రిలాక్స్ అవ్వడానికి లేదు. ఎందుకంటే అసలైన సవాల్ విడుదల…
ఓబుళాపురం మైనింగ్ కంపెనీ అధిపతి, మాజీ మంత్రి గాలి జనార్దన్‌రెడ్డి సహా మరికొందరికి తాజాగా నాంపల్లిలోని సీబీఐకోర్టు 7 ఏళ్ల…
జమ్మూ కాశ్మీర్ లోని పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రవాదులు జరిపిన దాడిలో 28 మంది అమాయకులు అశువులు బాసిన సంగతి తెలిసిందే.…
హీరోయిన్లుగా ఒక వెలుగు వెలిగాక.. ఏదో ఒక దశలో డౌన్ కావాల్సిందే. హీరోల మాదిరి దశాబ్దాల తరబడి కెరీర్లో పీక్స్‌లో…
టాలీవుడ్ అగ్ర నటుడు, టీడీపీ సీనియర్ నేత, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆధ్వర్యంలో నడుస్తున్న ఇండో అమెరికన్ బసవతారకం…
పెహల్గామ్ దుర్ఘటన తర్వాత ఇండియా, పాకిస్థాన్ మధ్య ఏర్పడిన ఉద్రిక్తతలు ఎలాంటి పరిణామాలకు దారి తీస్తాయో ఊహించడం కష్టంగా ఉంది.…