గత రెండు వారాలుగా ఇండియన్ బాక్సాఫీస్‌ను ఏలుతున్న సినిమా.. చావా. ఛత్రపతి శివాజీ తనయుడు శంబాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా లక్ష్మణ్ ఉటేకర్ ఈ చిత్రాన్ని రూపొందించాడు. రిలీజ్ ముందున్న అంచనాలను మించిపోయి ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపిస్తూ దూసుకెళ్తోంది. ఇప్పటికే కలెక్షన్లు రూ.300 కోట్లకు చేరువ అయ్యాయి. ఫుల్ రన్లో రూ.400 కోట్ల మార్కును కూడా ఈ సినిమా దాటేసే అవకాశముంది.
ఐతే రిలీజ్ తర్వాత ఈ సినిమా చుట్టూ కొన్ని వివాదాలు కూడా ముసురుకున్నాయి. చరిత్రను వక్రీకరించారన్న ఆరోపణలు వచ్చాయి. మరోవైపు ఈ చిత్రంలో గనోజి, కనోజీ అనే పాత్రలను చూపించిన విధానంపై వారి వారసులు తీవ్ర అభ్యంతరం తెలిపారు. చరిత్రను వక్రీకరిస్తూ తమ పూర్వీకుల పాత్రలను చెడుగా చూపించినందుకు రూ.100 కోట్ల పరువు నష్టం చెల్లించాలంటూ వారి వారసులు చిత్ర బృందానికి లీగల్ నోటీసులు పంపించారు. ఐతే సినిమా గొప్పగా ఆడుతున్న సమయంలో ఇలాంటి వివాదాలు ఎందుకని చిత్ర బృందం ఈ విషయంలో తగ్గింది. స్వయంగా దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్ గనోజీ, ఖనోజీల వారసుల్లో ఒకడైన భూషణ్ షిర్కేను కలుసుకున్నాడు.
అంతే కాక సినిమాలో ఈ ఇద్దరిపై తీసిన సన్నివేశాల విషయంలో క్షమాపణలు కూడా చెప్పాడు. ఇంటి పేర్లను వాడకుండా ఈ పాత్రలను తెరపై చూపించామని.. ఆ పాత్రలను కించపరిచే ఉద్దేశం తమకు ఎంతమాత్రం లేదని లక్ష్మణ్ ఉటేకర్ స్పష్టం చేశాడు. ఎవరి మనోభావాలైనా దెబ్బ తిని ఉంటే అందుకు మన్నించాలని కోరాడు.
ఐతే సినిమాలో అభ్యంతరంగా ఉన్న సన్నివేశాలను తొలగించాలని గనోజీ, కనోజీల వారసులు డిమాండ్ చేసిన నేపథ్యంలో దీనిపై చిత్ర బృందం ఏం చేస్తుందో చూడాలి. ఈ వివాదాన్ని పక్కన పెడితే.. గత వారం వచ్చిన, ఈ వారం వస్తున్న కొత్త చిత్రాలు కూడా ‘చావా’ మీద పెద్దగా ప్రభావం చూపే సంకేతాలు కనిపించడం లేదు. ఈ వీకెండ్లో కూడా కొత్త సినిమా తరహాలో ‘చావా’ వసూళ్లు వస్తుండడం విశేషం.
This post was last modified on February 25, 2025 5:27 pm
గత కొన్నేళ్లుగా ప్రయోగాలు, రొటీన్ మాస్ మసాలాలతో అభిమానులే నీరసపడేలా చేసిన రవితేజ ఫైనల్ గా గేరు మార్చేశాడు. సంక్రాంతికి…
కంటి ముందు కెమెరా, యూట్యూబ్ ఫాలోయర్స్ ఉంటే చాలు కొందరు ఏం మాట్లాడినా చెల్లిపోతుందని అనుకుంటున్నారు. వీళ్ళ వల్ల సోషల్…
బీఆర్ ఎస్ కీలక నాయకుడు, మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్రావు.. తన ఇంటిని తాకట్టు పెట్టారు. బ్యాంకు అధికారుల వద్దుకు…
పార్టీ పటిష్టంగా ఉండాలన్నా, ప్రజలకు పారదర్శకంగా సంక్షేమ పథకాలు అందాలన్నా ఆ పార్టీ ప్రజా ప్రతినిధులే కీలకం. రాజకీయాల్లో ఈ…
దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…