ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా సెలవు రోజు అయిన ఆదివారం దుబాయి అంతర్జాతీయ స్టేడియంలో దాయాదీ దేశాలు భారత్, పాకిస్థాన్ ల మధ్య ఆసక్తికర మ్యాచ్ జరుగుతోంది. ఈ ఏటి ఛాంపియన్స్ ట్రోఫీకి పాకిస్థాన్ ఆతిథ్యమిస్తున్నా… అక్కడ తాము ఆడబోం అంటూ బీసీసీఐ తేల్చి చెప్పడంతో భారత్ తో జరిగే మ్యాచ్ లన్నింటినీ తటస్థ వేదికలు అయిన అరబ్ దేశాలకు మార్చారు. ఈ క్రమంలోనే దుబాయిలో భారత్, పాక్ ల మధ్య మ్యాచ్ జరిగింది.
ఈ మ్యాచ్ ను టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఓ సాధారణ వీక్షకుడిలా అలా చూస్తూ గడిపారు. ఈ మ్యాచ్ కోసం ఆయన స్టేడియానికి ఒంటరిగానే వచ్చినట్టున్నారు. పక్కనెవరూ లేకుండా… ఒంటరిగా మ్యాచ్ ను ఆయన ఎంజాయ్ చేస్తూ కనిపించారు. ఈ సందర్భంగా రెండు సార్లు కెమెరాలను ఆయనను ఫోకస్ చేయగా… ఆయనను గుర్తు పట్టిన పలువురు క్రికెట్ అభిమానులు ఆయన వద్దకు వచ్చి ఆయనతో చేతులు కలిపారు. బ్లాక్ డ్రెస్ లో అదే కలర్ క్యాప్ తో కనిపించిన చిరు.. చేతిలో పాప్ కార్న్ తో కనిపించారు.
అయినా ఒంటరిగా దుబాయిలో చిరు ఏం చేస్తున్నారనేగా మీ అనుమానం? రెండు రోజుల క్రితం చిరు ఓ ట్వీట్ చేసిన విషయం గుర్తుందా? తన వివాహ వార్షికోత్సవాన్ని తన అతికొద్ది మంది సన్నిహితుల మధ్య వినువీధిలో జరుపుకుంటున్నానంటూ ఓ రెండు ఫొటోలను షేర్ చేశారు. ఆ వినువీధిలోకి వారిని తీసుకెళ్లిన విమానం హైదరాబాద్ లో టేకాఫ్ తీసుకుని దుబాయిలో ల్యాండ్ అయ్యిందట. యానివర్సరీ కోసం దుబాయి వెళుతున్నట్లు చిరునే ప్రకటించారు.. అంటే… మేరేజ్ యానివర్సరీ కోసం దుబాయి వెళ్లిన చిరు.. పనిలో పనిగా దాయాదుల పోరును అలా ఒంటరిగా…మౌన ప్రేక్షకుడి మాదిరిగా చూస్తూ ఎంజాయ్ చేశారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates