మాస్ మహారాజా రవితేజ ధమాకా బ్లాక్ బస్టర్ తర్వాత దర్శకుడు త్రినాథరావు నక్కిన చేస్తున్న సినిమా మజాకా శివరాత్రి పండగ సందర్భంగా ఫిబ్రవరి 26 థియేటర్లలో అడుగు పెట్టనుంది. సందీప్ కిషన్ చాలా గ్యాప్ తర్వాత ఫుల్ ఫన్ రోల్ చేయగా హీరోయిన్ రీతూ వర్మ రూటు మార్చి కమర్షియల్ టచ్ ఉన్న అమ్మాయిగా సందడి చేయబోతోంది. దీనికన్నా అసలు విశేషం రావు రమేష్ ఫుల్ ఎనర్జిటిక్ పాత్ర చేయగా ఆయనకు జోడిగా ఎప్పుడో మన్మథుడులో నాగార్జునకి జోడిగా చేసిన అన్షుని వెతికి తీసుకురావడం. ఇన్ని విశేషాలతో ఇందులో కథేంటనే సస్పెన్సుకు చెక్ పెడుతూ ట్రైలర్ లో గుట్టు విప్పేశారు.
అనగనగా ఒక కుర్రాడు (సందీప్ కిషన్). ఒక అమ్మాయి (రీతూ వర్మ) ని చూడగానే ప్రేమిస్తాడు. ఆమెను కోడలిగా ఇంటికి తీసుకు రావాలనుకున్నప్పుడు (రావు రమేష్) ఎవరో స్త్రీ (అన్షు) ని ఇష్టపడిన విషయం బయటపడుతుంది. ఇదెక్కడి చిక్కురా అనుకుంటున్న టైంలో అనుకోకుండా కొన్ని చిక్కులు ఏర్పడతాయి. తండ్రి కొడుకులు పోలీస్ స్టేషన్ కు వెళ్లాల్సి వస్తుంది. విలన్ వీళ్ళ జీవితాలతో ఆడుకోవడానికి ట్రై చేస్తే వీళ్ళేమో దాన్ని సరదాగా తీసుకుంటారు. ఆ తర్వాత ఏమైంది, రెండు జంటల లవ్ స్టోరీస్ కి ఎలాంటి ముగింపు దొరికిందనేది వచ్చే వారం థియేటర్లలోనే చూడమంటున్నారు.
నవ్వించడమే లక్ష్యంగా పెట్టుకునే త్రినాథరావు మరోసారి అలాంటి ఫార్ములాతో రచయిత బెజవాడ ప్రసన్న కుమార్ తో కలిసి మజాకాని వడ్డించబోతున్నట్టు అర్థమైపోయింది. పంచులు, వన్ లైనర్లు పేలేలా ఉన్నాయి. సరిగ్గా కామెడీ కుదిరితే ఏమవుతుందో ఇటీవలే సంక్రాంతికి వస్తున్నాం ఋజువు చేసింది. ఇప్పుడు మజాకా కూడా అదే కోవలోనే కనిపిస్తోంది. ఆఖరిలో జై బాలయ్య రెఫరెన్సు ఫ్యాన్స్ కి వెరైటీ బోనస్. లియోన్ జేమ్స్ సంగీతం సమకూర్చిన ఈ ఎంటర్ టైనర్ లో అసలు హీరోయిన్ల కన్నా సందీప్ కిషన్, రావు రమేషే ఎక్కువ డామినేట్ చేసినట్టు ఉన్నారు. వినోదం గ్యారెంటీ అని ఇచ్చిన మాటను మజాకా నిలబెట్టుకుంటే హిట్టే.
Gulte Telugu Telugu Political and Movie News Updates