హనుమాన్ తర్వాత ఏకంగా ఏడాదిన్నర గ్యాప్ తో తేజ సజ్జ నుంచి వస్తున్న సినిమా మిరాయ్. గత ఏడాది టీజర్ టైంలో విడుదల తేదీ ఏప్రిల్ 18 అని ప్రకటించి అఫీషియల్ పోస్టర్ వదిలారు. కానీ షూటింగ్ తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ కు ఎక్కువ సమయం అవసరం కావడంతో ఇప్పుడు ఏకంగా ఆగస్ట్ 1కి షిఫ్ట్ చేశారు. ఇదే పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నుంచి వస్తున్న ది రాజా సాబ్ కూడా ఏప్రిల్ 10 వదులుకున్న విషయం తెలిసిందే. ఈగల్ ఫేమ్ కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తున్న మిరాయ్ లో మంచు మనోజ్ విలన్ గా నటిస్తుండగా భారీ బడ్జెట్, ప్యాన్ ఇండియా స్థాయిలో దేశ విదేశాల్లో చిత్రీకరణ జరుపుతున్నారు.
అంతా బాగానే ఉంది కానీ మిరాయ్ పెట్టుకున్న ఆగస్ట్ 1 వెనుక పోటీ రిస్క్ లేకపోలేదు. ఎందుకంటే ఇప్పటిదాకా ఉన్న సమాచారం ప్రకారం వార్ 2 రిలీజ్ ఆగస్ట్ 14. ప్రస్తుతానికి వాయిదా లాంటి వార్తలు రావడం లేదు. హృతిక్ రోషన్ – జూనియర్ ఎన్టీఆర్ మీద పాట షూట్, కొంత ప్యాచ్ వర్క్ తప్ప దాదాపు పూర్తయిపోయింది. కాకపోతే పోస్ట్ ప్రొడక్షన్ కు సమయం సరిపోతుందా లేదానే దాని మీద దర్శకుడు అయాన్ ముఖర్జీ కసరత్తు చేస్తున్నాడు. ఇంకోవైపు రజనీకాంత్ కూలిని అదే డేట్ కి వచ్చేలా లోకేష్ కనగరాజ్ ప్లాన్ చేస్తున్నాడు. ఒకవేళ వార్ 2 తప్పుకుంటే కనక కూలిని దింపాలనేది అసలు కాన్సెప్ట్.
ఒకవేళ అదే జరిగితే మిరాయ్ కి రెండు వారాల ఫ్రీ గ్రౌండ్ దొరుకుతుంది. బ్లాక్ బస్టర్ టాక్ వస్తే ఇబ్బంది లేదు. పధ్నాలుగు రోజుల్లోపే బ్రేక్ ఈవెన్ దాటేయొచ్చు. తర్వాత ఎవరు వచ్చినా రాకపోయినా ఇబ్బంది ఉండదు. కొన్ని తక్కువైనా సరే మూడో వారంలోనూ థియేటర్లు కొనసాగుతాయి. కాకపోతే లాంగ్ రన్ మీద కొంత ప్రభావం ఉంటుంది. స్వతంత్ర దినోత్సవం నాడే ది ఢిల్లీ ఫైల్స్ రాబోతోంది. మిరాయ్ కున్న ప్రధాన సానుకూలాంశం జూలై చివరి వారంలో చెప్పుకోదగ్గ సినిమాలు లేవు. సో ఓపెనింగ్ పెద్ద ఎత్తున దక్కుతుంది. ఫాంటసీ బ్యాక్ డ్రాప్ లో రూపొందిన ఈ యాక్షన్ డ్రామాలో విఎఫ్ఎక్స్ ఎక్కువగా ఉంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates