న్యాచురల్ స్టార్ నాని హీరోగానే కాక నిర్మాతగానూ తన అభిరుచిని చాటడం చూస్తున్నాం. ఏదో కమర్షియల్ గా తీసి నాలుగు డబ్బులు చేసుకుందామని కాకుండా కంటెంట్ తో మెప్పించి కొత్త తరహా ట్రెండ్ కి శ్రీకారం చుట్టేలా ఏదైనా చేయాలనే తాపత్రయం ప్రతి సినిమాలో కనిపిస్తుంది. ఇలా ఆలోచించి ఆ అవకాశం ఇవ్వకపోతే ఇవాళ ప్రశాంత్ వర్మ అనే దర్శకుడు ఇంత స్థాయికి రావడానికి మరింత టైం పట్టేదేమో. శైలేష్ కొలను అనే డాక్టర్ కు హిట్ ది ఫస్ట్ కేస్ ఛాన్స్ ఇవ్వకపోయి ఉంటే తర్వాత అతను అడివి శేష్, వెంకటేష్ తర్వాత ఇప్పుడు నానితోనే ప్యాన్ ఇండియా మూవీ చేసే స్థాయికి చేరడానికి లేటయ్యేదేమో.
ఇవన్నీ ఆయా దర్శకుల టాలెంట్లను నమ్ముకుని చేసిన ప్రయత్నాలే. ఫలితాలు కూడా అంతే గొప్పగా వచ్చాయి. తాజాగా నాని సమర్పణలో వస్తున్న మరో సినిమా కోర్ట్. క్యాప్షన్ గా స్టేట్ వర్సెస్ ఏ నో బడీ అని పెట్టారు. ఇవాళ జరిగిన ప్రెస్ మీట్ లో నాని మాములు కాన్ఫిడెన్స్ చూపించలేదు. మీడియా, ప్రేక్షకులు, ఇండస్ట్రీ అందరికీ ముందుగానే రెడ్ కార్పెట్ ప్రీమియర్లు వేస్తామని, షో అయ్యాక అందరూ స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చేంత గొప్పగా ఎమోషన్ పండిందని అంచనాలు పెంచేశాడు. అంతేకాదు హీరోయిన్ నటనను ప్రశంసిస్తూ మూడు నాలుగుసార్లు కన్నీళ్లు పెట్టుకున్న వైనాన్ని గుర్తు చేసుకున్నాడు.
ప్రియదర్శికి బలగంని మించిన ల్యాండ్ మార్క్ గా కోర్ట్ నిలిచిపోతుందని భరోసా ఇవ్వడం మరో విశేషం. మొత్తానికి అసలు బజ్ అంతగా లేని కోర్ట్ మీద ఒక్కసారిగా హైప్ వచ్చేలా చేయడంలో నాని వేసిన మొదటి అడుగు బాగుంది. మాములుగా ఇలాంటి కోర్ట్ రూమ్ డ్రామాలు హిందీ, మలయాళంలో ఎక్కువగా వస్తాయి. తెలుగులో వకీల్ సాబ్ లాంటి ప్రయత్నాలు తక్కువ. అది కూడా పవన్ కళ్యాణ్ చేశాడు కాబట్టి రేంజ్ పెరిగింది. కానీ నాని ఈసారి పూర్తిగా కథను నమ్మి కోర్ట్ ని తీశాడు. నిర్మాణంలో ఉండగానే నెట్ ఫ్లిక్స్ కొనేసింది. థియేటర్ ఎక్స్ పీరియన్స్ బెస్ట్ ఉంటుందని నాని ఇస్తున్న హామీ ఓపెనింగ్స్ కి పునాది వేసింది.
This post was last modified on February 21, 2025 9:40 pm
బాలీవుడ్ ఆల్ టైం టాప్ స్టార్లలో సల్మాన్ ఖాన్ ఒకడు. ఒకప్పుడు ఆయన సినిమాలకు యావరేజ్ టాక్ వస్తే చాలు.. వందల…
కలెక్షన్ల కోసం పోటీ పడే స్టార్ హీరోల అభిమానులను చూశాం కానీ ఇప్పుడీ ట్రెండ్ కటవుట్లకూ పాకింది. తమదే రికార్డుగా…
ఏపీ రాజధాని అమరావతికి ఇప్పుడు ఇతర ప్రాంతాల నుంచి వచ్చేవారు.. విజయవాడకు వచ్చి.. అటు నుంచి గుంటూరు మీదుగా అమరావతికి…
ఆంధ్రప్రదేశ్ క్రీడాప్రాదికార సంస్థ(శాప్) చైర్మన్ రవినాయుడు.. వర్సెస్ వైసీపీ మాజీ మంత్రి రోజా మధ్య ఇప్పుడు రాజకీయం జోరుగా సాగుతోంది.…
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండో సారి పగ్గాలు చేపట్టిన తర్వాత.. ప్రపంచ దేశాల దిగుమతులపై భారీఎత్తున సుంకాలు (టారిఫ్లు)…
అల్లుడు అదుర్స్ తర్వాత హిందీ ఛత్రపతి కోసం మూడేళ్లు టాలీవుడ్ కు దూరమైపోయిన బెల్లంకొండ సాయిశ్రీనివాస్ ఇప్పుడు ప్రభాస్ రేంజ్…