దక్షిణాది సినిమాను గొప్ప మలుపు తిప్పిన దర్శకుడు శంకర్. ‘జెంటిల్‌మ్యాన్’తో మొదలుపెడితే ఎన్నో అద్భుతమైన సినిమాలను అందించిన శంకర్.. రెండేళ్ల కిందట ఇండియాస్ హైయెస్ట్ బడ్జెట్ మూవీ ‘2.0’తో పలకరించాడు. దీని తర్వాత ఆయన మరో మెగా మూవీని లైన్లో పెట్టారు. అదే.. ఇండియన్-2. రెండు దశాబ్దాల కిందట వచ్చిన మెగా బ్లాక్‌బస్టర్ మూవీ ‘ఇండియన్’కు ఇది సీక్వెల్ అన్న సంగతి తెలిసిందే. కమల్ హాసనే ఇందులోనూ కథానాయకుడు.
ఐతే ఈ సినిమాను ఏ ముహూర్తాన మొదలుపెట్టారో కానీ.. ఏదో ఒక అవాంతరం వస్తూనే ఉంది. మొదట కమల్‌కు మేకప్ పడనందుకు, ఆ తర్వాత ఆయన లోక్‌సభ ఎన్నికల్లో బిజీ అయినందుకు.. ఆపై సెట్లో ఒక భారీ ప్రమాదం చోటు చేసుకోవడం వల్ల ఈ సినిమాకు బ్రేకులు పడ్డాయి. చివరికి కరోనా వచ్చి ఈ సినిమాకు ఇంకా పెద్ద బ్రేక్ వేసింది.
ఐతే కరోనా ప్రభావం కొంచెం తగ్గాక అన్ని భాషల్లోనూ చిత్రీకరణలు పున:ప్రారంభం అయినప్పటికీ ‘ఇండియన్-2’ మాత్రం పట్టాలెక్కట్లేదు. ఇందుకు కారణాలేంటేన్నది అర్థం కావడం లేదు. సమస్య నిర్మాతల దగ్గరే ఉందని కోలీవుడ్ మీడియా అంటోంది. వాళ్ల తీరుతో విసిగిపోయిన శంకర్.. తాజాగా ఒక ఘాటు లేఖ రాసినట్లు తెలిసింది. సినిమాను పున:ప్రారంభించే ప్రణాళికలేమైనా ఉన్నాయా లేదా అని ఆయన సూటిగా ప్రశ్నించాడట.
సాధ్యమైనంత త్వరగా చిత్రీకరణ మొదలుపెట్టని పక్షంలో తాను వేరే సినిమాను మొదలుపెట్టుకుంటానని ఆయన హెచ్చరించినట్లు తెలుస్తోంది. వచ్చే మూణ్నాలుగు నెలల్లో ‘ఇండియన్-2’ పూర్తి చేయని పక్షంలో ఆ తర్వాత చాలా ఆలస్యమవుతుంది. కమల్ అసెంబ్లీ ఎన్నికల పనుల్లో బిజీ అయిపోతారు. ఎన్నికల ఫలితాల తర్వాత ఆయన ప్రయాణం ఎలా ఉంటుందో చెప్పలేం. ఈ నేపథ్యంలో ‘ఇండియన్-2’ సంగతి నిర్మాతల దగ్గర తేల్చుకోవాలని శంకర్ భావిస్తున్నట్లు సమాచారం.
This post was last modified on October 23, 2020 5:58 pm
అగ్రరాజ్యం అమెరికాలో చోటు చేసుకున్న పరిణామాలు.. విదేశీ విద్యార్థులు, వృత్తి నిపుణులను ఇరకాటంలోకి నెడుతున్నాయి. మరో రెండు మూడు వారాల్లోనే…
జైలు శిక్ష ఏమిటి? అందులోనూ ఫిఫ్టీ-ఫిఫ్టీ ఏమిటి- అనే ఆశ్చర్యం అందరికీ కలుగుతుంది. కానీ, ఇది వాస్తవం. దీనికి సంబంధించి…
ఏపీలో రాజకీయ వ్యూహాలు, ప్రతివ్యూహాలు ఎలా ఉన్నా.. అధికార పార్టీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు మాత్రం కాక పుట్టిస్తున్నాయి. ఇప్పటికే…
టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి పరిటాల రవి గురించి యావత్ ఉమ్మడి రాష్ట్రానికి తెలిసిందే. అన్నగారు ఎన్టీఆర్ పిలుపుతో…
క్రిస్మస్కు తెలుగులో భారీ చిత్రాల సందడి ఉంటుందని అనుకున్నారు కానీ.. ఈ సీజన్లో వస్తాయనుకున్న గేమ్ చేంజర్, తండేల్, రాబిన్…