ఇటీవలే విడుదలై బాక్సాఫీస్ వద్ద సంచలనం నమోదు చేస్తున్న చావా మీద ప్రశంసల వర్షం కురుస్తోంది. మరాఠా వీరుడు శంభాజీ మహారాజ్ కథను గొప్పగా తెరకెక్కించి కన్నీళ్లు పెట్టించారని ప్రేక్షకులు భావోద్వేగంతో చెబుతున్న వీడియోలు ఎక్స్, ఇన్స్ టా తదితర మాధ్యమాల్లో వైరలవుతున్నాయి. గతంలో తానాజీ, బాజీరావు మస్తానీ, సామ్రాట్ పృథ్విరాజ్, అశోక, కేసరి, పానిపట్ లాంటి ఎన్నో సినిమాలు వచ్చాయి కానీ అన్నీ హిట్ కాలేదు. అయితే చావా లాంటి నేపధ్యాలు టాలీవుడ్ లో ఎప్పటి నుంచో ఉన్నాయనేది చరిత్రని తరచి చూస్తే అర్థమవుతుంది. కమర్షియల్ గానూ గొప్ప విజయం సాధించినవి ఎన్నో.
బ్లాక్ అండ్ వైట్ కాలం నుంచి చూసుకుంటే స్వర్గీయ ఎన్టీఆర్ బొబ్బిలి యుద్ధం – పల్నాటి యుద్ధంతో మొదలుపెట్టి చరిత్రలో నిలిచిపోయిన క్లాసిక్స్ చరిత్రలో సువర్ణాధ్యాయాలు లిఖించాయి. కృష్ణంరాజు తాండ్ర పాపారాయుడు, కృష్ణ విశ్వనాథ నాయకుడు – సింహాసనం ఇవన్నీ 80 దశకంలో వచ్చిన బ్లాక్ బస్టర్ సినిమాలు. బోలెడంత డ్రామాతో పాటు ఎంతో పరిశోధనతో ఆయా దర్శకులు వీటిని రూపొందించిన విధానం అబ్బురపరుస్తుంది. విజువల్ ఎఫెక్ట్స్ లేని కాలంలో సహజత్వానికి పెద్ద పీఠ వేస్తూ భారీ సెట్లతో ఆడియన్స్ ని అబ్బురపరిచిన తీరు మాటల్లో చెప్పేది కాదు. ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే. ఇక వర్తమానానికీ వద్దాం.
అనుష్క రుద్రమదేవి, బాలకృష్ణ గౌతమీపుత్ర శాతకర్ణి, చిరంజీవి సైరా నరసింహారెడ్డి ఇవన్నీ ఇప్పటి తరానికి పరిచయం చేసిన వీరయోధుల గాథలు. బాక్సాఫీస్ వద్ద ఆడాయి కూడా. ఇవేవి ఫాంటసీ కథలు కాదు. చావా లాగే వాస్తవాలు చూపించే ప్రయత్నం చేసినవి. క్రియేటివ్ లిబర్టీ కొంత తీసుకుని ఉండొచ్చు కానీ నిజాలను పక్కదారి పట్టించినవి మాత్రం కాదు. నిఖిల్ స్వయంభు కూడా ఇదే తరహా బ్యాక్ డ్రాప్ లో రూపొందుతోందని టాక్ ఉంది. ఏది ఏమైనా చావా చూసి వాళ్ళు ఎంతైనా పొగుడుకోవచ్చు కానీ మనం ఎప్పుడో అలాంటి క్లాసిక్స్ ని ఇచ్చాం, ఇస్తూనే ఉన్నాం. తెలుగువాళ్ళకు ఇది ఎప్పటికీ గర్వకారణమే.
This post was last modified on February 17, 2025 7:14 pm
ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…
ప్రధాని మోదీ, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ లపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఓట్ల…
ఒకప్పుడు వైసీపీలో ఓ వెలుగు వెలిగిన విజయ సాయిరెడ్డి ఇప్పుడు ఆ పార్టీపై ఒంటికాలిపై లేస్తున్న వైనం పలువురిని ఆశ్చర్యపరుస్తోంది.…
దసరా నెల ప్రారంభంలో విడుదలవుతున్న మొదటి వారం సినిమాల్లో సిగ్మా మీద మంచి అంచనాలే నెలకొన్నాయి. తమిళనాడు సిఎం కొడుకు…
దక్షిణాది సంగీత దర్శకుల్లో అత్యధిక డిమాండ్ ఎంజాయ్ చేస్తున్న వాళ్లలో మొదట వినిపించే పేరు అనిరుధ్ రవిచందర్. బ్యాక్ గ్రౌండ్…
కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీపై సోషల్ మీడియాలో రకరకాల ట్రోలింగ్స్ వస్తుంటాయి. గతంలో అయితే ఆయనను పప్పు అంటూ…