సోషల్ మీడియా జమానాలో ప్రతి మాటా పోస్ట్ మార్టంకు గురవుతుందని తెలిసే సెలబ్రిటీలు ఆచితూచి వ్యవహరిస్తుంటారు. అయినా సరే కొన్నిసార్లు టంగ్ స్లిప్ కావడం సహజం. కాకపోతే దాని పరిణామాలు ఒక్కోసారి కొంచెం దూరమే వెళ్లొచ్చు.
ఇటీవలే చావా మ్యూజిక్ లాంచ్ ఈవెంట్ కు హాజరైన హీరోయిన్ రష్మిక మందన్న మాట్లాడుతూ నేను హైదరాబాద్ నుంచి వచ్చానని, ఇక్కడ (అంటే ముంబై) ఇంత మందిని చూశాక మీ కుటుంబంలో భాగమైనందుకు సంతోషంగా ఉందని చెప్పుకొచ్చింది. సరిగ్గా ఈ పాయింట్ దగ్గరే కన్నడ మిత్రులకు కోపం వచ్చేసింది. ఎక్స్ వేదికగా ట్రిగ్గరింగ్ ట్వీట్లు పెట్టి నిలదీస్తున్నారు.
ఎందుకంటే రష్మిక స్వరాష్ట్రం కర్ణాటక. తొలి అవకాశం వచ్చింది కన్నడ సినిమా కిరిక్ పార్టీలో. దర్శకుడు నటుడు రక్షిత్ శెట్టితో నిశ్చితార్థం అయ్యాక పెళ్లి క్యాన్సిల్ చేసుకోవడం గురించి అప్పట్లోనే చాలా కామెంట్స్ వచ్చాయి. తెలుగులో హిట్లు పడ్డాక మాతృబాషను నిర్లక్ష్యం చేస్తోందని విమర్శలు కూడా వినిపించాయి.
అయినా అమ్మడు అవేవి పట్టించుకోలేదు. ఇంకా పెళ్లి కాలేదు కాబట్టి సాంకేతికంగా రష్మిక బెంగళూరు నుంచి వచ్చినట్టు అవుతుంది తప్ప హైదరాబాద్ కాదనేది శాండల్ వుడ్ ఫ్యాన్స్ వెర్షన్. ఇందులో లాజిక్ లేదని చెప్పలేం. అవును మరి మూలాలు గుర్తుపెట్టుకోవాలనేది ఇతరుల అభిప్రాయం.
ఏది ఎలా ఉన్నా రష్మిక మందన్న ఇవన్నీ పట్టించుకోదు కానీ తను మాత్రం ఫుల్ హైలో ఉంది. యానిమల్, పుష్ప 2 ది రూల్ రెండు బ్లాక్ బస్టర్స్ అయ్యాక చావాకు ముంబై సర్కిల్స్ లో పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. వసూళ్లు భారీగా ఉన్నాయి. ఇదే మూమెంట్ ని కొనసాగిస్తే మాత్రం రికార్డులు బద్దలయ్యేలా ఉన్నాయి.
అదే జరిగితే హ్యాట్రిక్ హిట్లు కొట్టిన హీరోయిన్ గా రష్మిక ఆనందం రెట్టింపు కావడం ఖాయం. త్వరలోనే ది గర్ల్ ఫ్రెండ్ రిలీజ్ కు రెడీ అవుతోంది. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించిన ఈ ఫిమేల్ ఓరియెంటెడ్ మూవీకి బిజినెస్ ఎంక్వయిరీలు బాగానే ఉన్నాయి. ప్యాన్ ఇండియా భాషల్లో ప్లాన్ చేస్తున్నారు.
This post was last modified on February 14, 2025 9:16 pm
టార్గెట్ కేటీఆర్.. లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బీఆర్ఎస్ నాయకుడు, మాజీ మంత్రి కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న…
ఈ మధ్య కాలంలో రెండు అతి పెద్ద హిట్ సినిమాలు ఏవయ్యా అంటే వెంటనే గుర్తొచ్చే పేర్లు మండాడి, బెత్లెహాం…
విజయవాడలో నిర్వహించిన ‘పేదల పట్టాల పండుగ’ సభలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. అయితే, చంద్రబాబు ప్రసంగిస్తుండగా సభా ప్రాంగణం సమీపంలో…
వైసీపీ నుంచి ఆ మాటకొస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించిన రాజ్యసభ మాజీ సభ్యుడు వేణుంబాక విజయ సాయిరెడ్డి కొద్ది…
ఒక పెద్ద బ్లాక్ బస్టర్ సీక్వెల్ అంటే ఏ స్థాయిలో అంచనాలు ఉంటాయో వేరే చెప్పనక్కర్లేదు. బాహుబలి, పుష్ప, కెజిఎఫ్,…
ప్యాన్ ఇండియా జానర్ వల్ల భాషల మధ్య హద్దులు చెరిగిపోతున్నాయి. దర్శకులు ఒక వుడ్డుకే అంకితం కాకుండా ఇతర పరిశ్రమలకు…