టాలీవుడ్ బెస్ట్ కమెడియన్స్ పేర్లు రాసుకుంటూ పోతే వాటిలో ఖచ్చితంగా వచ్చే పేరు ఎంఎస్ నారాయణ. కాలం చేసి స్వర్గానికి వెళ్లిపోయారు కానీ నిత్యం మనం చూసే పాత సినిమాల్లో ఇంకా బ్రతికే ఉన్నట్టు అనిపిస్తారు. ముఖ్యంగా తాగుబోతు పాత్రలకు వేరే ఎవరినీ ఊహించలేనంత గొప్పగా పండించేవారు.
అయితే ఇలాంటి మహా నటుల చివరి క్షణాలు ఎలా గడిచాయనేది సాటి కుటుంబ సభ్యులు, స్నేహితులు చెబితే కానీ బయటికి రావు. బ్రహ్మానందం అలాంటిది ఒకటి తాజాగా పంచుకున్నారు. ఈ రోజు విడుదలైన బ్రహ్మ ఆనందం ప్రమోషన్లలో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలలో గతాన్ని గుర్తు చేసుకున్నారు.
తీవ్ర అనారోగ్యంతో ఎంఎస్ నారాయణ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నప్పుడు గోపీచంద్ సినిమా షూటింగ్ లో ఉన్న బ్రహ్మానందం గారికి ఫోన్ వచ్చింది. నాన్న మిమ్మల్ని చూడాలని కోరుకుంటున్నట్టుగా పేపర్ మీద రాసిచ్చారని ఆయన కూతురు చెప్పింది. వెంటనే ఎవరికి చెప్పకుండా బ్రహ్మానందం హుటాహుటిన హాస్పిటల్ కు వెళ్లిపోయారు.
మంచం దగ్గరికి చేరగానే ఎంఎస్ ఆత్మీయంగా బ్రహ్మి చేయి గట్టిగా నొక్కి పట్టుకున్నారు. మాట్లాడలేకపోయినా మనసులో భావాన్ని అర్థం చేసుకున్నారు. డబ్బు ఎంత ఖర్చయినా నయం చేయమని డాక్టర్లకు చెప్పి షూట్ కి బయలుదేరారు. మధ్య దారిలో ఎంఎస్ పోయారనే వార్తలు వచ్చాయి.
నిజానికి అప్పుడాయన ఉన్నారో పోయారో నిర్ధారణ చేసుకోకుండానే యూట్యూబ్ ఛానల్స్ థంబ్ నైల్స్ పెట్టేయడం ఎందరో అభిమానులకు గుండె కోతని మిగిల్చింది. బ్రహ్మానందం తపన అటుపై ఎంఎస్ ని బ్రతికించలేకపోయినా చివరి క్షణంలో చేయి పట్టుకోవడం మాత్రం జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేనని అంటున్నారు.
ఇద్దరు కలిసి ఎన్నో బ్లాక్ బస్టర్లలో భాగం పంచుకోవడం ఫ్యాన్స్ గుర్తు చేసుకుంటూనే ఉంటారు. స్టార్ హీరోలు పిలిచి మరీ ఎంఎస్ ని తమతో పాటు నటింపజేసుకున్న సందర్భాలు ఎన్నో. లెజెండరీ హాస్యనటుడిగా చిరస్థానం సంపాదించుకున్న ఎంఎస్ తెలుగు సినిమాల్లో ఎప్పటికీ సజీవులే.
This post was last modified on February 14, 2025 2:52 pm
సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా కోరుతూ కాక్రోచ్ జనతా పార్టీ ఢిల్లీలో నిరసన చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ నిరసనలకు…
ఒక ప్యాన్ ఇండియా మూవీ షూటింగ్ ఆలస్యమైనప్పుడు, వాయిదాలు పడినప్పుడు దాని గురించి రకరకాల ప్రచారాలు జరగడం మాములే. బాహుబలి…
భారత ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాక్రోచ్ జనతా పార్టీ చేస్తున్న…
నిన్న విడుదలైన కామ్రేడ్ కళ్యాణ్ ఓపెనింగ్స్ డీసెంట్ గా మొదలయ్యాయి. ఉదయం కొంచెం నెమ్మదిగా ఉన్నప్పటికీ సాయంత్రానికి పరిస్థితిలో మార్పొచ్చింది.…
అక్టోబర్ 15 విడుదల కాబోతున్న జైలర్ 2 మొదటి రోజు చెన్నై టికెట్ ధర కంటే ఆంధ్రప్రదేశ్ లోని ఒక…
ఒక ఇంట్లో దొంగ పడ్డాడు. నగలు, నట్రా దోచుకున్నాడు. యజమాని ... ఆ దొంగను గుర్తించాడు. పోలీసులకు ఫిర్యాదు చేశాడు.…