సినిమా థియేటర్లు తెరుచుకోవచ్చునని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ నిర్మాతలెవరూ ముందుకు రావడం లేదు. సగం కెపాసిటీతో రన్ అయ్యే థియేటర్లలో ఎంత వసూలవుతాయి? పంపిణీదారుల నుంచి ఎన్ని డబ్బులొస్తాయి? అనేది తేలక నిర్మాతలు తగిన సమయం కోసం వేచి చూస్తున్నారు. అందుకే పూర్తయిన సినిమాలను కూడా సెన్సార్‍కి పంపించకుండా అట్టే పెట్టుకున్నారు.
ఈ నేపథ్యంలో సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించిన ‘సోలో బ్రతుకే సో బెటర్’ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుని రిలీజ్‍కి సిద్ధమవుతోంది. ఇంకా డేట్ ప్రకటించలేదు కానీ థియేటర్లలో విడుదలకి అయితే సిద్ధపడుతున్నారు. మిగతా నిర్మాతలకు, హీరోలకూ లేని ధైర్యం సాయి ధరమ్ తేజ్‍కి ఏమిటి అనుకోవచ్చు? అయితే ఇక్కడో లాజిక్కుంది. ఈ చిత్రం థియేట్రికల్ ప్లస్ నాన్ థియేట్రికల్ హక్కులను జీ సంస్థ గుత్తంగా తీసేసుకుంది. ఓటిటి రిలీజ్ కోసమనే తీసుకున్నారు కానీ థియేట్రికల్‍గా కూడా రెవెన్యూ వస్తే వదులుకోవడం దేనికని ఈ రిస్కు తీసుకుంటోంది.
చాలా కాలం తర్వాత కొత్త సినిమా థియేటర్లలో విడుదలయితే వచ్చే ప్రేక్షకులుంటారనేది వారి అంచనా. ఒకవేళ ఈ రిస్కు పే చేయకపోయినా కానీ వారికి పెద్దగా నష్టమేమీ వుండదు… ఎలాగో ఓటిటి రిలీజ్ కోసం సిద్ధపడి వున్నారు కనుక. అయితే ఈ సినిమా రిలీజ్ అయితే మిగతా నిర్మాతలకు పరిస్థితిని సమీక్షించుకునే వీలు చిక్కుతుంది. మరి ఈ సోలో బ్రతుకు ఎంత బెటర్ అనేది థియేటర్లలో షో పడ్డాకే తెలుస్తుంది.
This post was last modified on %s = human-readable time difference 10:51 pm
ఈ దీపావళికి టాలీవుడ్ బాక్సాఫీస్ కళకళలాడిపోయింది. మంచి కంటెంట్ ఉన్న సినిమాలు పడ్డాయి. వాటికి మంచి వసూళ్లు కూడా వచ్చాయి.…
మరో వారంలో ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఇవి పూర్తిగా బడ్జెట్ సమావేశాలేనని కూటమి సర్కారు చెబుతోంది. వచ్చే మార్చి…
దసరా బ్లాక్ బస్టర్ తో నానికి మొదటి వంద కోట్ల గ్రాసర్ ఇచ్చిన దర్శకుడు శ్రీకాంత్ ఓదెల రెండోసారి న్యాచురల్…
ఖైదీ, మాస్టర్, విక్రమ్, లియో చిత్రాలతో లోకేష్ కనకరాజ్ ఎంత క్రేజ్ సంపాదించుకున్నాడో తెలిసిందే. అతడి వల్లే సినిమాటిక్ యూనివర్శ్…
దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. గత కొన్నాళ్లుగా…
సందీప్ రెడ్డి వంగ.. ఇప్పుడు ఇండియాలోనే మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్లలో ఒకడు. తనతో సినిమా చేయడానికి టాప్ స్టార్లు ఎంతో…