ఏ బ్యాగ్రౌండ్ లేకుండా ఫిలిం ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి.. తనకంటూ ఒక ఫాలోయింగ్, మార్కెట్ సంపాదించుకున్నాడు యువ కథానాయకుడు విశ్వక్సేన్. ఇప్పటి యువతకు ప్రతిబింబంలా కనిపించే విశ్వక్.. చాలా అగ్రెసివ్‌గా ఉంటాడు. తన సినిమాలను అతను ప్రమోట్ చేసుకునే తీరు అందరి దృష్టినీ ఆకర్షిస్తుంది. ఏదో ఒక కామెంట్ చేయడం ద్వారా అందరి చూపూ తన వైపు తిప్పుకుంటాడు.
కొన్నిసార్లు తన వ్యాఖ్యలు, చర్యలు వివాదాస్పదం అవుతుంటాయి. అవి పబ్లిసిటీకి ఉపయోగపడుతుంటాయి కూడా. ఐతే విశ్వక్ కావాలనే కాంట్రవర్శీలు క్రియేట్ చేస్తాడనే అనుమానాలు కూడా జనాల్లో ఉన్నాయి. ‘అశోక వనంలో అర్జున కళ్యాణం’ సహా కొన్ని చిత్రాల విడుదలకు ముందు రాజుకున్న వివాదాల వల్ల ఆయా చిత్రాలకు మంచి పబ్లిసిటీ వచ్చిందన్న అభిప్రాయం ఉంది.
తాజాగా ‘లైలా’ సినిమా రిలీజ్ ముంగిట ఆ సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్లో పృథ్వీ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపడం.. దీని మీద సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరగడం.. బాయ్‌కాట్ లైలా హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ కావడం.. దీనిపై టీం ప్రెస్ మీట్ పెట్టడం.. ఇదంతా తెలిసిన విషయమే. మీ ప్రతి సినిమా ముంగిట ఈ వివాదాలేంటి, పబ్లిసిటీ కోసం ఇలాంటివి మీరే చేస్తున్నారా అని విశ్వక్‌ను అడిగితే..
‘‘కాంట్రవర్శీలను ఎవరూ కోరి తెచ్చుకోరు. నాకైతే ఇవి వద్దు అనే అనిపిస్తుంది. నా చివరి మూడు సినిమాల విషయంలో వివాదాలేమీ లేవు. ‘లైలా’ ఈవెంట్లో వేరే నటుడు మాట్లాడిన మాటల మీద వివాదం చెలరేగింది. నేను మూడు నెలలకో సినిమా చేస్తున్నా. ఏదో ఒక సినిమా విషయంలో ఏదైనా జరిగినా సరే ప్రతిసారీ కాంట్రవర్శీ వస్తున్నట్లు అనిపిస్తుంది.
రోడ్డు మీద ఎక్కువ తిరిగితేనే కదా ప్రమాదాలు జరుగుతాయి. అలాగే నేను ఎక్కువ సినిమాలు చేయడం వల్ల ఇలా జరుగుతోందేమో. సినిమా వేడుకల్లో ఆర్టిస్టులు, టెక్నీషియన్లు సినిమాల గురించి మాత్రమే మాట్లాడాలని నిబంధన వస్తే సంతోషమే. అది పెద్దవాళ్లు తీసుకోవాల్సిన నిర్ణయం’’ అని విశ్వక్ తెలిపాడు.
This post was last modified on February 13, 2025 5:37 pm
ఏపీలో 175 నియోజకవర్గాలు ఉన్నాయి. అయితే.. వీటిలో కొన్ని చాలా వెనుకబడి ఉన్నాయి. మరికొన్ని మధ్యస్థాయిలో అభివృద్ధి చెందాయి. ఇంకొన్ని…
ఒక పెద్ద సినీ కుటుంబానికి చెందిన కొత్త కుర్రాడు ఇండస్ట్రీలోకి అడుగు పెడుతుంటే.. డెబ్యూ మూవీ చేస్తుండగానే వేరే చిత్రాలు…
కోనసీమ కొబ్బరి తోటలకు తెలంగాణ నాయకుల దిష్టి తగిలిందంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ…
ఒకప్పుడు ఏపీలో హెచ్ ఐవీ ఎక్కువగా ఉండేది. హైవేల పక్కన ఎక్కువ కండోమ్ లు కనపడేవి అని సీఎం చంద్రబాబు…
ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సీఎం చంద్రబాబు విజయవాడలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. అదేవిధంగా…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను ఆ పదవి నుంచి బర్తరఫ్ చేయాలని సీపీఐ సీనియర్ నేత నారాయణ డిమాండ్…