నిన్న విడుదలైన విజయ్ దేవరకొండ కింగ్ డమ్ టీజర్ కు భారీ స్పందన కనిపిస్తోంది. దేవర, సలార్ తరహా షేడ్స్ కనిపించినప్పటికీ దర్శకుడు గౌతమ్ తిన్ననూరి నుంచి ఇలాంటి కంటెంట్ ఊహించని మూవీ లవర్స్ ఆశ్చర్యపోతున్నారు. గతంలో పలు సందర్భాల్లో నిర్మాత నాగవంశీ ఈ ప్రాజెక్టు గురించి చాలా గొప్పగా చెబుతూ వచ్చారు.
రెండు భాగాలుగా ప్యాన్ ఇండియా లెవెల్ లో వంద కోట్లకు పైగా బడ్జెట్ తో తీస్తున్నామని చెప్పుకొచ్చారు. నిన్న వీడియోలో ఫస్ట్ పార్ట్ అని లేకపోయినప్పటికీ క్రమంగా దాన్ని రివీల్ చేస్తారని తెలిసింది. అయితే కింగ్ డమ్ లో బయటికి చెప్పని రహస్యాలు చాలా ఉన్నాయని యూనిట్ టాక్.
ఇది ఇండియా శ్రీలంక సరిహద్దుల్లో జరిగే కథట. విజయ్ దేవరకొండ పోషించిన పాత్ర తాలూకు బాల్యంలో జరిగిన అణిచివేత సంఘటనలు తనను దూరంగా పంపేస్తాయి. శరణార్ధుల విషయంలో క్రూరంగా ప్రవర్తించిన సింహళీ సైనికుల ఆగడాలకు కొన్ని వేల మంది బలవుతారు.
వాళ్ళ గొంతుగా నిలబడి పోరాడే నాయకుడి కోసం ఎదురు చూస్తున్నప్పుడు విజయ్ తిరిగి వస్తాడు. అక్కడి నుంచి ఊచకోత అతని వర్గం వైపు నుంచి ప్రభుత్వం, మాఫియా వైపుకు మళ్లుతుంది. లంకను తగలబెట్టిన హనుమంతుడిలా తన వాళ్ళ కోసం ఎంతకైనా తెగించే మొండివాడు, మూర్ఖుడిగా దేవరకొండ పాత్ర టెర్రిఫిక్ గా ఉంటుందట.
1947 మన దేశానికి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఒక నలభై సంవత్సరాల దాకా శ్రీలంక బోర్డర్ లో ఏం జరిగింది, ఒక నాయకుడు ఎలా ఉద్భవించాడనే పాయింట్ మీద గౌతమ్ తిన్ననూరి అద్భుతమైన సబ్జెక్టు రాసుకున్నాడని వినికిడి. నిన్న టీజర్ మీద కొంత మిశ్రమ స్పందన సోషల్ మీడియాలో కనిపించింది.
తారక్ వాయిస్ ఓవర్ మీద కామెంట్స్ చేసినవాళ్ళున్నారు. అయినా సరే కింగ్ డమ్ హైప్ విషయంలో టీమ్ చాలా కూల్ గా ఉంది. మే నెలలో రికార్డులు బద్దలు కావడం ఖాయమని అంటున్నారు. వరస ఫ్లాపుల నుంచి బయటపడేసి మోస్ట్ పవర్ ఫుల్ కంబ్యాక్ గా ఈ సినిమా నిలుస్తుందని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.
This post was last modified on February 13, 2025 2:58 pm
నందమూరి కళ్యాణ్ రామ్ కొత్త చిత్రం అర్జున్ సన్నాఫ్ వైజయంతి మీద ప్రేక్షకుల్లో మంచి అంచనాలే ఉన్నాయి. అమిగోస్, డెవిల్…
కమ్యూనిస్టు పార్టీ సీపీఎంకు కొత్త సారథి వచ్చారు. తమిళనాడులో జరుగుతున్న 24వ అఖిల భారత మహా సభల వేదికగా.. కొత్త…
బాలీవుడ్ ఆల్ టైం టాప్ స్టార్లలో సల్మాన్ ఖాన్ ఒకడు. ఒకప్పుడు ఆయన సినిమాలకు యావరేజ్ టాక్ వస్తే చాలు.. వందల…
కలెక్షన్ల కోసం పోటీ పడే స్టార్ హీరోల అభిమానులను చూశాం కానీ ఇప్పుడీ ట్రెండ్ కటవుట్లకూ పాకింది. తమదే రికార్డుగా…
ఏపీ రాజధాని అమరావతికి ఇప్పుడు ఇతర ప్రాంతాల నుంచి వచ్చేవారు.. విజయవాడకు వచ్చి.. అటు నుంచి గుంటూరు మీదుగా అమరావతికి…
ఆంధ్రప్రదేశ్ క్రీడాప్రాదికార సంస్థ(శాప్) చైర్మన్ రవినాయుడు.. వర్సెస్ వైసీపీ మాజీ మంత్రి రోజా మధ్య ఇప్పుడు రాజకీయం జోరుగా సాగుతోంది.…