గత కొంత కాలంగా చిరంజీవి మళ్ళీ రాజకీయాల్లోకి వచ్చే సూచనలు ఉన్నాయంటూ పలు మీడియా కథనాలు బాగానే చక్కర్లు కొట్టాయి. రాజ్యసభ సీట్ ఇస్తారని ఒకరు, జనసేన కోసం బీజేపీతో చేతులు కలుపుతారని మరొకరు ఏవేవో అల్లేశారు. ఇప్పటిదాకా దాని గురించి ఎక్కడా స్పందించని మెగాస్టార్ ఇవాళ జరిగిన బ్రహ్మ ఆనందం ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పూర్తి క్లారిటీ ఇచ్చేశారు.
పాలిటిక్స్ కి ఇకపై దూరంగా ఉంటానని, కేవలం సినిమాలకు మాత్రమే దగ్గరగా ఉంటూ కళామతల్లి సేవలో తరిస్తానని, అందరూ అనుకుంటున్నట్టు, ప్రచారం జరుగుతున్నట్టు తిరిగి మనసు మార్చుకునే ఉద్దేశం లేదని కుండ బద్దలు కొట్టేశారు.
తన ఆశయాలు, లక్ష్యాలు తమ్ముడు పవన్ కళ్యాణ్ తీరుస్తున్నాడని, ఇకపై ఎలాంటి సందేహాలకు తావు లేదని మరోసారి నొక్కి వక్కాణించారు. దీంతో ఒక పెద్ద గాసిప్ వాహనానికి బ్రేకులు వేసినట్టు అయ్యింది. నిజానికి చిరుకి రాజకీయ పునఃప్రవేశం మీద ఎలాంటి ఆసక్తి లేదని ఖైదీ నెంబర్ 150 నుంచే అభిమానులకు అర్థమైపోయింది.
కాంగ్రెస్ లో సభ్యుడైనా, తెలంగాణలో ఆ పార్టీ అధికారంలోకి వచ్చినా ఎక్కడా చిరంజీవి అందులో భాగం కావాలని ప్రయత్నించలేదు. జనసేన పార్టీ కూటమిలో కీలక పాత్ర పోషిస్తున్నప్పటికీ ఒక అన్నయ్యగా చూసి ఆనందించారు తప్పించి ఎలాంటి ప్రమేయం చూపించలేదు.
మొన్న లైలా ఈవెంట్ లో జై జనసేన నినాదం చేసిన చిరంజీవి ఇప్పుడీ పరిణామంతో పూర్తి స్పష్టత ఇచ్చేసినట్టే. సినిమాల పరంగా మెగాస్టార్ ఎంత బిజీగా ఉన్నారో చూస్తున్నాం. విశ్వంభర విడుదలకు దగ్గరవుతుండగానే అనిల్ రావిపూడికి ఎస్ చెప్పేశారు. శ్రీకాంత్ ఓదెల చెప్పిన వయొలెంట్ యాక్షన్ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
వాల్తేరు వీరయ్య కాంబోని రిపీట్ చేస్తూ బాబీకి ఇంకో ఛాన్స్ ఇచ్చే ఆలోచన చేస్తున్నారు. కుదిరితే సందీప్ వంగా లాంటి యంగ్ టాలెంట్స్ తో చేతులు కలిపేందుకు ఎదురు చూస్తున్నారు. ఆర్టిస్టుగా ఇంత బిజీగా ఉంటే ఇక రాజకీయాలు, పదవులు అంటూ ఆలోచించే ఛాన్స్ ఎక్కడిది.
This post was last modified on February 11, 2025 10:49 pm
టీమిండియా స్టార్ బ్యాట్స్మన్ విరాట్ కోహ్లీకి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏ స్థాయిలో ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇండియాలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా…
ఈ శుక్రవారం విడుదల కాబోతున్న బ్రహ్మ ఆనందం ప్రమోషన్ల పరంగా అన్ని చేస్తున్నా ఒక బలమైన పుష్ కోసం ఎదురు…
కెరీర్ ఎప్పుడో మొదలైనా, ఎన్నో హిట్లు చూసినా వంద కోట్ల క్లబ్ అందని ద్రాక్షగా నిలిచిన నాగచైతన్యకు అది తండేల్…
దివంగత అక్కినేని నాగేశ్వరరావు గారు పోషించిన అజరామరమైన పాత్రల్లో తెనాలి రామకృష్ణ చాలా ముఖ్యమైంది. ఎన్టీఆర్ అంతటి దిగ్గజం శ్రీకృష్ణ…
వాలెంటైన్ వీక్ సందర్భంగా ఎక్కడ చూసినా ఎన్నో రకాల గులాబీలు.. వాటి సుగందాలు మనల్ని పలకరిస్తూనే ఉంటాయి. గులాబీ పువ్వు…
ఇప్పుడు సినిమాల్లో క్వాలిటీ కంటెంట్, భారీతనం, బిజినెస్, కలెక్షన్స్.. ఈ కోణంలో చూస్తే బాలీవుడ్ మీద సౌత్ సినిమానే స్పష్టమైన…