స్టార్ క్యాస్టింగ్ లేని చిన్న సినిమాలకు కంటెంటే బలం. అది ఎంత స్ట్రాంగ్ గా ఉంటే ప్రేక్షకులు అంతా బాగా రిసీవ్ చేసుకుంటారు. గతంలో ఇది చాలా సార్లు ఋజువయ్యింది. ఆ నమ్మకంతోనే వస్తోంది సంతాన ప్రాప్తిరస్తు. విక్రాంత్, చాందిని చౌదరి హీరో హీరోయిన్ గా నటిస్తున్న ఈ ఎంటర్ టైనర్ లో వెన్నెల కిషోర్ డాక్టర్ భ్రమరం అనే వెరైటీ పాత్రను పోషిస్తున్నాడు. ఈ పేరు వినగానే దశాబ్దాలుగా ఓ ప్రముఖ వారపత్రికలో సెక్స్ ప్రశ్నలకు సమాధానాలు చెప్పే ప్రముఖ వైద్యుడు గుర్తు రావడం సహజం. ఆయన స్ఫూర్తితోనే భ్రమరంని రాసుకున్నట్టు వేరే చెప్పాలా. టైటిల్ సూచిస్తోంది కూడా అదే.
సంతాన ప్రాప్తిరస్తు దర్శకుడు సంజీవ్ రెడ్డి. నవ్వించడమే టార్గెట్ గా మధురా ఎంటర్ టైన్మెంట్స్, నిర్వి ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. షూటింగ్ పూర్తి కావొస్తోంది. సంతానం కోసం పరితపించే ఒక యువ జంటకు ఎదురయ్యే సమస్యల నేపథ్యంలో ఈ సినిమాని రూపొందిస్తున్నట్టు టాక్. భ్రమరం నిర్వహించే ఆసుపత్రి పేరు గర్భగుడి వెల్ నెస్ సెంటర్ అని పెట్టడం చూస్తేనే కీలకమైన పాయింట్ ఏదో అర్థమవుతోంది. ఆయుర్వేదాన్ని, అలోపతిని మిక్స్ చేసే ఒక వినూత్న వైద్యుడు సంతానం కలిగించేందుకు జంటలకు ఇచ్చే మందులు, సలహాలు ఏంటనేది తెరమీద చూస్తేనే కిక్కు.
విడుదల తేదీ ఇంకా ఖరారు కాని సంతాన ప్రాప్తిరస్తుని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. అభినవ్ గోమటం, మురళీధర్ గౌడ్, జీవన్ కుమార్, తాగుబోతు రమేష్, రచ్చ రవి తదితరులు ఇతర తారాగణం. కామెడీనే నమ్ముకున్న ఈ సినిమాలో సందేశం కూడా ఉంటుందట. అదేంటనేది తెరమీద చూడాలి. కలర్ ఫోటోతో గుర్తింపు తెచ్చుకున్న చాందిని చౌదరికి ఇది మరో బ్రేక్ అవుతుందన్న నమ్మకాన్ని ఆ అమ్మాయి వ్యక్తం చేస్తోంది. ఫెర్టిలిటీ (సంతాన భాగ్యం) మీద తెలుగులో వచ్చిన సినిమాలు చాలా అరుదు. అందులోనూ వినోదాత్మకంగా ఎవరూ టచ్ చేయలేదు. ఇది హిట్టయితే మరికొన్ని రావొచ్చు.
This post was last modified on February 11, 2025 12:45 pm
ఫిబ్రవరి మామూలుగా సినిమాలకు అంతగా కలిసొచ్చే సీజన్ కాదు. సినిమాలకు మహారాజ పోషకులైన యూత్ పరీక్షలకు సంబంధించిన హడావుడిలో ఉంటారు…
ఛాంపియన్స్ ట్రోఫీకి సిద్ధమవుతున్న తరుణంలో కెప్టెన్ రోహిత్ శర్మ మొన్నటివరకు వరుసగా విఫలమవ్వడం జట్టుకు భారంగా మారిందనే కామెంట్స్ ఎక్కువగానే…
ఒక్క అప్డేట్ బయటికి తెలియకుండా గుట్టుచప్పుడు కాకుండా షూటింగ్ జరుపుకుంటున్న ఎస్ఎస్ఎంబి 29 అడవుల బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న…
అక్రమ వలసదారుల నియంత్రణకు ఇటీవల పలు దేశాల తీసుకుంటున్న నిర్ణయాలు హాట్ టాపిక్ గా మారుతున్నాయి. రీసెంట్ గా అమెరికా…
ఇజ్రాయెల్ - హమాస్ ఘర్షణలో కీలక మలుపు చోటుచేసుకుంది. గాజాను పూర్తిగా స్వాధీనం చేసుకుని పునర్నిర్మించాలని ట్రంప్ ఇప్పటికే ప్రతిపాదించారు.…
ఇంకో నాలుగు రోజుల్లో విడుదల కాబోతున్న చావా మీద పెద్దగా బజ్ కనిపించడం లేదు. బాలీవుడ్ లో అత్యంత భారీ…