ఫిబ్రవరి 14 విడుదల కాబోతున్న ‘బ్రహ్మ ఆనందం’ టైటిల్ కు తగ్గట్టు కేవలం బ్రహ్మానందం పేరు మీదే మార్కెటింగ్ చేసుకుంటోంది. ఆయన అబ్బాయి గౌతమ్ ఇందులో హీరో అయినప్పటికీ ఆడియన్స్ కి ఎవరి ద్వారా రీచ్ అవుతోందో అందరికీ తెలిసిన విషయమే. అయితే ఇలాంటి సినిమాలకు థియేటర్ పుష్ కావాలంటే ప్రమోషన్లతో పాటు బలమైన మద్దతు అవసరం.
లేదంటే సామాన్య ప్రేక్షకుల్లో ఆసక్తి రగిలించడం కష్టం. ఏదో సోషల్ మీడియా, యూట్యూబ్ లో బ్రహ్మి జోకులకు పగలబడి నవ్వుకున్నంత మాత్రాన అందరూ టికెట్లు కొంటారన్న గ్యారెంటీ లేదు. అందుకే టీమ్ మెగా డార్లింగ్ సపోర్ట్ తీసుకుంది.
ట్రైలర్ ని ప్రభాస్ తో లాంచ్ చేయిస్తోంది. ఇది పెద్ద బూస్ట్. కల్కి 2898 ఏడిలో ఉన్నది కాసేపే అయినా బ్రహ్మానందంతో డార్లింగ్ సీన్లు బాగానే పేలాయి. ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్ కి చిరంజీవిని గెస్టుగా తీసుకురాబోతోంది. చిరు, బ్రహ్మిల మధ్య ఉన్న అనుబంధం లెక్కలేనన్ని సార్లు బయట పడింది.
జంధ్యాల, చిరంజీవి తనను పరిశ్రమకు తీసుకురావడంలో ఎంత సహకారం అందించారో, అవకాశాలు వచ్చేలా ఏమేం చేశారో చాలా సార్లు బ్రహ్మానందం పంచుకున్నారు. ఆయన లేకపోతే నేనీవాళ ఈ స్థాయిలో ఉండేవాడిని కాదని చాలాసార్లు చెప్పారు. ఇప్పుడు కొడుకు కోసం ఈ కలయిక స్టేజి మీద జరగనుంది.
టాక్ బాగుంటే కనక బ్రహ్మ ఆనందంకు మంచి ఛాన్స్ ఉంది. విశ్వక్ సేన్ లైలా తప్ప కొత్త రిలీజులేవి పోటీ లేవు. కిరణ్ అబ్బవరం దిల్ రుబా తప్పుకోవడం ప్లస్ అయ్యింది. వేరే పాత సినిమాల రీ రిలీజులు ఉన్నాయి కానీ వాటి హడావిడి ఉదయం ఓ రెండు షోలు అయ్యాక ముగిసిపోతుంది కాబట్టి టెన్షన్ లేదు.
తండ్రి కొడుకులతో పాటు వెన్నెల కిషోర్ ఒక ప్రధాన పాత్ర పోషించిన బ్రహ్మ ఆనందం ఫుల్ ఎంటర్ టైనర్ గా ప్రేక్షకుల ముందుకొస్తోంది. స్టార్ క్యాస్టింగ్ లేకుండా లెజెండరీ కమెడియన్ ని నమ్ముకుని దర్శకుడు ఆర్విఎస్ నిఖిల్ పెద్ద రిస్కే చేశాడు. ఫలితం బాగుంటే మరిన్ని సినిమాలు ఈ జానర్ లో ఆశించొచ్చు.
This post was last modified on February 10, 2025 12:52 pm
తిరుమలలో పరకామణి చోరీ వ్యవహారంపై రెండు రోజుల కిందట ప్రెస్ మీట్ లో మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు…
ఏపీలో లేడీ డాన్లు పెరిగిపోయారు.. వారి తోక కట్ చేస్తానంటూ సీఎం చంద్రబాబు నాయుడు మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఈరోజు…
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…
శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…
తెలంగాణకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…
బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…