ఎన్నాళ్ళో వేచిన ఉదయం అనే పాట ఇప్పుడు నాగచైతన్యకు బాగా సరిపోతుంది. ఎందుకంటే గత కొన్ని సినిమాలు కనీస టాక్ తెచ్చుకోలేక యుఎస్ ప్రీమియర్ల నుంచే డిజాస్టర్ అనిపించుకోవడం అభిమానులను తీవ్ర కలవరానికి గురి చేసింది. థాంక్ యు, కస్టడీ మొదటి రోజు సాయంత్రానికే చేతులెత్తేసిన వైనం అంత సులభంగా మర్చిపోయేది కాదు.
అతిథి పాత్ర చేసిన బాలీవుడ్ మూవీ లాల్ సింగ్ చద్దా సైతం దారుణమైన ఫలితాన్ని అందుకుంది. వెబ్ సిరీస్ దూతకు మంచి పేరే వచ్చినప్పటికీ దాని రీచ్ తక్కువ కాబట్టి థియేట్రికల్ గా బలంగా ఋజువు చేసుకోవాలనే కసి చైతులో కొన్ని నెలలుగా రగులుతోంది.
ఈ ఎదురు చూపులకు తండేల్ తెరవేసినట్టే. ఇండస్ట్రీ రికార్డులు బద్దలు కొట్టే టాక్ కాదు కానీ బాగుంది, నిరాశపరచలేదనే కామెంట్స్ పబ్లిక్ తో పాటు రివ్యూలలోనూ కనిపించాయి. ఆ ఆనందం చైతు మొహంలో స్పష్టమవుతోంది. నిన్న సాయంత్రం జరిగిన సక్సెస్ ప్రెస్ మీట్ లో ఆ భావోద్వేగాన్ని మీడియా ప్రతినిధులు గమనించారు.
హిట్ మాట విని చాలా కాలమయ్యిందని తనే స్వయంగా ఒప్పుకోవడం చూస్తే ఇంత కాలం ఎంత బాధపడ్డాడో అర్థమవుతోంది. సాయిపల్లవి లాంటి డామినేటింగ్ ఆర్టిస్ట్ ఉన్నప్పటికీ ఆమె కన్నా ఎక్కువ తన పెర్ఫార్మన్స్ గురించి మాట్లాడుకోవడం చైతు సాధించిన మరో బెంచ్ మార్కని చెప్పొచ్చు.
సో అక్కినేని అభిమానులకిది హ్యాపీ మూమెంట్. తండేల్ నెంబర్లు ఎలా ఉంటాయని ఊహించడం ఇప్పుడు తొందరపాటే అవుతుంది కానీ ప్రమోషన్లు ఆపకుండా జనాలకు సినిమాను మరింత చేరువగా చేసే బాధ్యతను చైతు టీమ్ తీసుకోబోతోంది. అల్లు అరవింద్ దీని కోసం ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేస్తున్నారట.
ఇటీవలే తీవ్ర సమస్యగా మారిన పైరసీ సమస్యని ఎదురుకునేలా బన్నీ వాస్ పలు సంస్థల సహాయ సహకారాలు తీసుకోబోతున్నారని తెలిసింది. ఎలాగూ ఈ నెలలో తీవ్రమైన పోటీ ఇచ్చే తండేల్ రేంజ్ సినిమాలు లేవు కాబట్టి ఈ మూమెంట్ ఇలాగే కొనసాగితే చైతు కెరీర్ లో హయ్యెస్ట్ గ్రాసర్ ఇదే కావొచ్చు.
This post was last modified on February 8, 2025 10:22 am
మేము పాత చింతకాయ పచ్చడి సినిమా తీస్తున్నాం అని పబ్లిసిటీ చేయాలంటే నిర్మాతకు బోలెడు ధైర్యం కావాలి. అందులోనూ ఒక…
ఇటీవలే బాలకృష్ణ కల్ట్ మూవీ నారి నారి నడుమ మురారి టైటిల్ ని వాడేసుకున్న శర్వానంద్ తన మరో సినిమాకి…
స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ పుట్టినరోజు సందర్భంగా నిన్న జాక్ టీజర్ విడుదల చేశారు. ఏప్రిల్ 10 విడుదల కాబోతున్న…
నిన్న విడుదలైన తండేల్ కు పాజిటివ్ టాక్ రావడంలో దేవిశ్రీప్రసాద్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించని వాళ్ళు లేరంటే అతిశయోక్తి కాదు.…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తన విధినిర్వహణలో దూసుకుపోతున్నారు. పాలనలో కీలకమైన గ్రామీణాభివృద్ధి, పర్యావరణం, అటవీ…
కేంద్రం ఏ నిర్ణయం తీసుకున్నా… అందులో ఎదో ఒక మెలిక ఉండనే ఉంటుంది. ఈ తరహా నిర్ణయాలను కేంద్రం తెలిసి…