నిన్న విడుదలైన తండేల్ కు పాజిటివ్ టాక్ రావడంలో దేవిశ్రీప్రసాద్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించని వాళ్ళు లేరంటే అతిశయోక్తి కాదు. సక్సెస్ ప్రెస్ మీట్ లో నిర్మాత అల్లు అరవింద్ అన్నట్టు అతనే సెకండ్ హీరో. పుష్ప 2 బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విషయంలో రిలీజ్ కు ముందు ఏవైతే కామెంట్స్ వచ్చాయో వాటికి పూర్తి సమాధానం ఇచ్చేలా నిన్న బీజీఎమ్ తో దేవి అదరగొట్టేశాడు.
ప్రతి రివ్యూ, పబ్లిక్ టాక్ లో ఈ విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నారు. పాటలు ముందే హిట్టయ్యాయి కాబట్టి అందరి దృష్టి నేపధ్య సంగీతం మీదే ఉంది. దానికి దేవి పూర్తి న్యాయం చేకూర్చడంతో అభిమానులు హ్యాపీగా ఉన్నారు.
తండేల్ లో దేవి పనితనం గురించి చెప్పేందుకు కొన్ని ఉదాహరణలు చెప్పొచ్చు. ఫస్ట్ హాఫ్ లో రాజు వేట పూర్తి చేసుకుని తిరిగి వచ్చి సత్యని పరిగెత్తుకుంటూ లాక్ టవర్ పైకి తీసుకెళ్లి తన ప్రేమను ప్రదర్శిస్తాడు. చైతు, సాయిపల్లవి పరుగుకు అనుగుణంగా వెనుక వినిపించే స్కోర్ వెంటాడేలా ఉంటుంది.
రాజు విరహ వేదనతో బుజ్జితల్లి పాడుకున్నప్పుడు, క్లైమాక్స్ కు ముందు జరిగే ఫ్రెండ్ షిప్ ఎపిసోడ్ లో దేవి పనితనం కనిపిస్తూనే ఉంటుంది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఒకప్పుడు వర్షం, నువ్వొస్తానంటే నేనొద్దంటానా టైంలో వినిపించిన వింటేజ్ దేవి ఇప్పుడు తండేల్ లో వినిపించాడు.
ఏదైతేనేం మ్యూజిక్ లవర్స్ హ్యాపీ. 2025లో తొలి మ్యూజికల్ హిట్ గా సంక్రాంతికి వస్తున్నాం నిలిస్తే రెండోది తండేల్ అవుతోంది. రేంజ్ దాంతో పోల్చడానికి అర్హత ఉందో లేదో వీకెండ్ అయ్యాక క్లారిటీ వస్తుంది కానీ హిట్ అనిపించుకునే దిశగా కలెక్షన్లు ఉండటం విశేషం.
దేవిశ్రీ ప్రసాద్ తర్వాత వచ్చే సినిమా గుడ్ బ్యాడ్ అగ్లీ. దీనికి పాటలు సమకూర్చగా బీజీఎమ్ బాధ్యతలు జివి ప్రకాష్ కుమార్ కుమార్ కు ఇచ్చారని గతంలోనే టాక్ వచ్చింది. మొత్తానికి దేవి ఏదైతేనేం ఐ యాం బ్యాక్ అనిపించాడు. నాగార్జున ధనుష్ కాంబో మల్టీస్టారర్ కుబేర మీద కూడా భారీ అంచానాలున్నాయి. విడుదల తేదీ ఇంకా ఖరారు చేయలేదు.
This post was last modified on February 8, 2025 9:00 am
మేము పాత చింతకాయ పచ్చడి సినిమా తీస్తున్నాం అని పబ్లిసిటీ చేయాలంటే నిర్మాతకు బోలెడు ధైర్యం కావాలి. అందులోనూ ఒక…
ఇటీవలే బాలకృష్ణ కల్ట్ మూవీ నారి నారి నడుమ మురారి టైటిల్ ని వాడేసుకున్న శర్వానంద్ తన మరో సినిమాకి…
స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ పుట్టినరోజు సందర్భంగా నిన్న జాక్ టీజర్ విడుదల చేశారు. ఏప్రిల్ 10 విడుదల కాబోతున్న…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తన విధినిర్వహణలో దూసుకుపోతున్నారు. పాలనలో కీలకమైన గ్రామీణాభివృద్ధి, పర్యావరణం, అటవీ…
కేంద్రం ఏ నిర్ణయం తీసుకున్నా… అందులో ఎదో ఒక మెలిక ఉండనే ఉంటుంది. ఈ తరహా నిర్ణయాలను కేంద్రం తెలిసి…
తెలంగాణాలో త్వరలో మంత్రివర్గ విస్తరణ ఉంటుందని కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే… ఆ వార్తలన్నింటిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి…