ఇవాళ విడుదలైన తండేల్ కు మంచి టాకే వినిపిస్తోంది. అదిరిపోయింది, రికార్డులు కొల్లగొడుతుందనే స్థాయిలో కాదు కానీ నిరాశ పరచలేదనే అభిప్రాయం అటు ఆడియన్స్ ఇటు మీడియాలో కనిపిస్తోంది. ఈ మధ్య కాలంలో ముందు రోజు సాయంత్రం లేదా రిలీజ్ రోజు తెల్లవారుఝామున బెనిఫిట్ షోలు వేయడం పరిపాటిగా మారింది.
అలాని అన్నింటికి ఒకేలా వర్కౌట్ కావడం లేదు. పుష్ప 2 ది రూల్ దీన్నుంచి గొప్ప ఫలితాన్ని అందుకోగా ఉదయం నాలుగు గంటలకు వేసిన షోలే గేమ్ ఛేంజర్ కు శాపంగా మారాయి. అందుకే తండేల్ విషయంలో అల్లు అరవింద్ అలాంటి బెనిఫిట్లు ఏవీ వద్దని రెగ్యులర్ షోలకు ఓటేశారు.
దీని వల్లే ఏపీలో ఉదయం ఏడు, తెలంగాణలో ఎనిమిది గంటలకు తండేల్ మొదలయ్యింది. దీని వల్ల కలిగిన లాభమే ఎక్కువ. ఎందుకంటే జెన్యూన్ టాక్ బయటికి వస్తుంది. నిద్ర కళ్ళు, తాగిన మైకం, లేట్ నైట్ దాకా మేల్కొని థియేటర్ దాకా రావడం, హాలు బయట అభిమానుల గోల ఇవన్నీ సినిమా అనుభూతి మీద ప్రభావం చూపిస్తున్నాయి.
దేవరకు ముందు మిక్స్డ్ టాక్ వినిపించింది దీని వల్లే. తర్వాత తప్పని తెలిసింది. తండేల్ అలా కాకూడదనే ఉద్దేశంతోనే స్పెషల్ ప్రీమియర్లకు నో అనేశారు. గతంలో గీతా ఆర్ట్స్ 2లో వచ్చిన ఇతర మీడియం బడ్జెట్ సినిమాలకు ఈ ట్రెండ్ మిస్ ఫైర్ అయ్యింది.
సో తండేల్ ఎలాంటి ఇబ్బందులు లేకుండా టాక్ తెచ్చుకుంది. ఇది సాయంత్రానికి మరింత పికప్ అయితే వీకెండ్ లోపు భారీ వసూళ్లు ఆశించవచ్చు. ఎలాగూ సంక్రాంతికి వస్తున్నాం స్లో అయిపోయింది కాబట్టి బాక్సాఫీస్ వద్ద వ్యాక్యూమ్ ని తండేల్ వాడుకోవాలని చూస్తున్నారు. నిన్నటి దాకా విపరీతమైన ప్రమోషన్లు చేసిన చైతు టీమ్ వాటిని ఆపబోవడం లేదు.
మరికొన్ని కార్యక్రమాలకు శ్రీకారం చుట్టబోతున్నారు. ఎలాగూ వచ్చే వారం లైలా తప్ప చెప్పుకోదగ్గ పోటీ లేదు. యూత్ సరే కానీ ఫ్యామిలీ ఆడియన్స్ సపోర్ట్ ఎంతమేరకు దక్కుతుందనేది తండేల్ ఫైనల్ రిజల్ట్ ని శాశించనుంది. చూడాలి మరి.
This post was last modified on February 7, 2025 4:00 pm
వేటూరి, సిరివెన్నెల లాంటి దిగ్గజ గేయ రచయితలు వెళ్ళిపోయాక తెలుగు సినీ పాటల స్థాయి తగ్గిపోయిందని సాహితీ అభిమానులు బాధ…
నెలలో ఒక్కరోజు గ్రామీణ ప్రాంతాలకు రావాలని.. ఇక్కడి వారికి వైద్య సేవలు అందించాలని డాక్టర్లకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్…
భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…
వైసీపీ అధినేత జగన్పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…
తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…
సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయడంలో తెలుగు వాళ్లను మించిన వాళ్లు ఇంకెవ్వరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. కొన్ని మీమ్స్…