ఇంకొద్ది గంటల్లో తండేల్ ప్రీమియర్ షోలు ప్రారంభం కాబోతున్నాయి. సంక్రాంతికి వస్తున్నాం తర్వాత బాక్సాఫీస్ వద్ద సందడి చేసిన సినిమా ఏదీ లేకపోవడంతో బయ్యర్లతో పాటు ప్రేక్షకుల కళ్లన్నీ దీని మీదే ఉన్నాయి. ఈ నేపథ్యంలో తండేల్ పాసవ్వాల్సిన పరీక్షలు కొన్నున్నాయి. అవేంటో చూద్దాం.
మొదటిది నాగచైతన్య ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న బ్లాక్ బస్టర్ ఇవ్వడం. థాంక్ యు, కస్టడీలతో పాటు క్యామియో చేసిన బాలీవుడ్ డెబ్యూ లాల్ సింగ్ చద్దా దారుణంగా పోయాయి. నా సామిరంగా హిట్ తర్వాత అక్కినేని ఫ్యాన్స్ కి ఏడాది గ్యాప్ వచ్చేసింది. సో ఆ ఆకలిని డబుల్ డోస్ తో తీర్చాల్సిన బాధ్యత తండేల్ మీదుంది.
రెండో పరీక్ష గీతా ఆర్ట్స్ బ్యానర్ నమ్మకాన్ని నిలబెట్టుకోవడం. మీడియం రేంజ్ హీరో మీద అల్లు అరవింద్ ఇంత బడ్జెట్ ఖర్చు పెట్టడం అరుదు. కానీ సబ్జెక్టు మీద నమ్మకంతో ముందు వెనుకా ఆలోచించకుండా ఎస్ అనేశారు. ఆయన నమ్మకం ఏ స్థాయిలో ఉందో ప్రమోషన్లలో కనిపిస్తోంది. చాలా ఉత్సాహంగా కనిపిస్తున్నారు.
అడిగిన వాళ్లందరితో బోలెడు కబుర్లు పంచుకుంటున్నారు. బన్నీ వాస్ ని మించిన కాన్ఫిడెన్స్ అరవింద్ గారిది. ఇక మూడో ఎగ్జామ్ చందూ మొండేటికి. కార్తికేయ 2 ఇచ్చిన ప్యాన్ ఇండియా బ్లాక్ బస్టర్ ఇమేజ్ ని కాపాడుకోవడం చాలా ముఖ్యం. రిస్క్ ఉన్నా సరే తండేల్ ని కథను ఎంచుకోవడం సవాలే.
ఇక దేవిశ్రీ ప్రసాద్ కు ఈ సక్సెస్ చాలా కీలకం. పుష్ప 2 బోలెడు కిక్ ఇచ్చినా దాని బీజీఎమ్ లో ఇతరులు భాగం కావడం పట్ల తనలో కొంత అసంతృప్తి ఉంది. అది పూర్తిగా రూపుమాపే బరువు తండేల్ మీదే ఉంది. సాయిపల్లవి పరంగా ఎలాంటి పరీక్ష లేదు. ఎందుకంటే ఆమె ఆల్రెడీ క్రౌడ్ పుల్లర్.
అమరన్ లో తన ఫ్యాక్టర్ ఎంత బాగా పని చేసిందో చూశాం. కాకపోతే ఇక్కడ నటన, డాన్స్ పరంగా చైతూతో పోటాపోటీ సవాళ్లు ఎదురు కావడం ఒకరకంగా ఆమెలోని నటికి ఛాలెంజ్ విసిరినట్టే. చూడాలి మరి తండేల్ ఈ పరీక్షలన్నీ దాటి హిట్ కొట్టిందంటే మాత్రం ఫిబ్రవరి నెలలో వసూళ్ల రికార్డులు తన పేరు మీదే ఉంటాయి.
This post was last modified on February 6, 2025 5:22 pm
విశ్వక్ సేన్ పూర్తి స్థాయి ఆడవేషం వేసిన లైలా ఫిబ్రవరి 14 విడుదల కాబోతోంది. ముందు వాయిదా అనే వార్తలు…
అమెరికా ఇటీవల భారత్‌కు చెందిన అక్రమ వలసదారులను ప్రత్యేక విమానంలో పంపిన నేపథ్యంలో, కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్…
ఇదిగో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంటే..అదుగో ప్లాంట్ మూసేస్తున్నారు అంటూ కొంతకాలంగా ప్రచారం జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఏకంగా…
వైసీపీ అధినేత జగన్ నివాసం కమ్ పార్టీ ప్రధాన కార్యాలయం ఉన్న గుంటూరు జిల్లా తాడేపల్లిలోని ప్యాలస్‌కు గుర్తు తెలియని…
విజయ్ దేవరకొండ-పూరి జగన్నాథ్‌ల క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కిన ‘లైగర్’ సినిమాపై విడుదల ముంగిట ఏ స్థాయిలో అంచనాలున్నాయో తెలిసిందే. కానీ…
ఏపీ సీఎం చంద్రబాబు సతీమణి, ఎన్టీఆర్ ట్రస్టు సీఈవో నారా భువనేశ్వరి.. తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విజయవాడలో మ్యూజికల్…