సంక్రాంతి సినిమాల సందడి ముగింపు దశకు వచ్చింది. ఇక తెలుగు ప్రేక్షకుల దృష్టి ‘తండేల్’ మీదికి మళ్లబోతోంది. ఈ సినిమా మొదలైనప్పుడే మంచి బజ్ తెచ్చుకుంది. రిలీజ్ టైంకి హైప్ వేరే లెవెల్‌కు వెళ్తోంది. చిత్ర బృందం కూడా పకడ్బందీగా ప్రమోషన్లు ప్లాన్ చేస్తోంది. ఇటీవలే గ్రాండ్‌గా ట్రైలర్ లాంచ్ చేశారు. ఇక చిత్ర బృందంలోని ముఖ్యుల మీడియా ఇంటర్వ్యూలకు కూడా సమయం ఆసన్నమైంది. ముందుగా దర్శకుడు చందూ మొండేటి ఇంటర్వ్యూలు ఇస్తున్నారు.
ఈ క్రమంలో ఆయనో ఇంటర్వ్యూలో సినిమాలో మేజర్ హైలైట్ అవుతుందని భావిస్తున్న ఎపిసోడ్ గురించి చెప్పిన మాటలు చర్చనీయాంశంగా మారాయి. ఈ సినిమా టీజర్ రిలీజైన దగ్గర్నుంచి అందరినీ ఆకర్షించిన అంశం.. పాకిస్థాన్ ఎపిసోడ్. ఉత్తరాంధ్రకు చెందిన జాలర్ల బృందం పాకిస్థాన్ జనాల్లోకి వెళ్లి అక్కడి నావికా సిబ్బందికి చిక్కడం.. జైలు పాలవడం.. అక్కడ్నుంచి తప్పించుకుని తిరిగి సొంతూరికి చేరడం.. ఇదీ ‘తండేల్’లో కోర్ పాయింట్.
వాస్తవంగా జరిగిన ఈ ఉదంతం నేపథ్యంలోనే ‘తండేల్’ సినిమా రూపొందింది. ఐతే సినిమాలో ఆ ఎపిసోడ్ 20 నిమిషాలే ఉంటుందని.. సినిమాలో మేజర్ పోర్షన్ చైతూ-సాయిపల్లవిల ప్రేమకథ మీదే నడుస్తుందని దర్శకుడు చందూ చెప్పడం ఆశ్చర్యం కలిగిస్తోంది. అసలు కథకు మూలమే పాక్ ఎపిసోడ్ అంటే.. అది 20 నిమిషాలకు పరిమితం అయితే ప్రేక్షకులు హర్షిస్తారా అన్నది ప్రశ్నార్థకం.
అంత తక్కువ టైంలో ఆ ఎపిసోడ్‌ను ముగిస్తే దాని తాలూకు ఎమోషన్, ఇంపాక్ట్ ప్రేక్షకుల మీద ఏమేర ఉంటుందని సోషల్ మీడియాలో నెటిజన్లు చర్చించుకుంటున్నారు. ఐతే కేవలం పాకిస్థాన్‌లో మాత్రమే జరిగే సన్నివేశాల రన్ టైం మాత్రమే చందూ చెప్పాడని.. ఆ ఎపిసోడ్ మొదలయ్యాక మధ్యలో వేరే సన్నివేశాలు కూడా వచ్చి పోతుంటాయని.. కాబట్టి అది తక్కువ సమయంలో ముగిసినట్లేమీ ఉండదని..
మరీ ఎక్కువ టైం పాకిస్థాన్ నేపథ్యంలో నడిస్తే డాక్యుమెంటరీ తరహాలో ఉంటుందనే ఉద్దేశంతో.. తక్కువ టైంలో ఎక్కువ ఎఫెక్టివ్‌గా ఉండేలా ఈ ఎపిసోడ్‌ను తీర్చిదిద్ది ఉంటారని.. చందూ-అరవింద్-బన్నీ వాసు త్రయం అన్నీ ఆలోచించే ఈ ఆలోచన చేసి ఉంటుందనే వాదన కూడా నడుస్తోంది. మరి రేప్పొద్దున ఈ ఎపిసోడ్ విషయంలో ప్రేక్షకుల స్పందన ఎలా ఉంటుందో చూడాలి.
This post was last modified on January 30, 2025 1:40 pm
కొన్నిసార్లు అనుకోని అదృష్టం వల్ల శకునాలు కలిసి వచ్చి జాతకం మారిపోతుంది. ఇది సినిమాలకు కూడా వర్తిస్తుంది. వెంకటేష్ వీరాభిమాని…
సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న జైలర్ 2 విడుదల అక్టోబర్ 15 జరగనుంది.…
ప్రముఖ నిర్మాత, నటుడు, వ్యాపారవేత్త బండ్ల గణేష్ గురించి ఇరు తెలుగు రాష్ట్రాల ప్రజలకు పరిచయం అక్కర లేదు. నిర్మొహమాటంగా,…
మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వాస్తవాలు కక్కిస్తామంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. కుట్రలే గొడ్డలి…
డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ బాక్సాఫీస్ ఫలితం చాలా త్వరగా తేలిపోయింది. ప్రీమియర్ల నుంచి మొదలైన మిక్స్డ్ టాక్ చివరికి…
మొన్న అక్టోబర్ రెండు గాంధీ జయంతికి చాలా సినిమాలొచ్చాయి. వాటిలో తమిళ డబ్బింగ్ డోరతీ కూడా ఉంది. సున్నితమైన అంశం…