తెలుగమ్మాయిలను తెలుగు చిత్ర పరిశ్రమ చిన్న చూపు చూస్తుందనేది ఎప్పట్నుంచో వున్న విమర్శ. టెక్నికల్‌గా రీతు వర్మ తెలుగమ్మాయి కాదు కానీ హైదరాబాద్‌లోనే పుట్టి పెరిగింది కనుక తెలుగమ్మాయే అనుకోవచ్చు. అందుకేనేమో తెలుగు చిత్ర పరిశ్రమ ఈమె టాలెంట్‌ని చిన్నచూపు చూస్తోంది.
పెళ్లిచూపులు సినిమాకు ముందే షార్ట్ ఫిలింస్‌తో రీతు వర్మ తన టాలెంట్ ఏమిటనేది చూపించింది. పెళ్లిచూపులు చిత్రం అంత పెద్ద హిట్టయినా కానీ రీతు వర్మకు అవకాశాలు రాలేదు. ఆమె మళ్లీ జనం దృష్టిలో పడింది ‘కనులు కనులను దోచాయంటే’ చిత్రంతోనే. ఇందులో చాలా సర్ప్రైజింగ్ క్యారెక్టర్ చేసిన రీతు వర్మ తన టాలెంట్ ఏమిటనేది మళ్లీ చాటుకుంది. ఆమె నటించిన తాజా చిత్రం అమెజాన్ ప్రైమ్‌లో రిలీజ్ అయింది. ‘పుదమ్ పుదు కాలై’ అనే ఆ చిత్రం అయిదు కథల సమాహారం.
అయిదుగురు దర్శకులు రూపొందించిన వివిధ షార్ట్ ఫిలింస్ ఒకే సినిమాగా విడుదలయ్యాయి. ఇందులో గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఫిలింలో లీడ్ క్యారెక్టర్ చేసింది రీతు వర్మ. ఎప్పట్లానే గౌతమ్ తన హీరోయిన్ని చాలా ప్రత్యేకంగా చూపించాడు. రీతు వర్మ తన అభినయంతో ఆ పాత్రను రక్తి కట్టించి సోషల్ మీడియా ద్వారా పలువురి ప్రశంసలు అందుకుంటోంది. ఇప్పటికైనా ఈ అండర్ రేటెడ్ బ్యూటీ టాలెంట్‌ని గుర్తించి టాలీవుడ్ తగినన్ని అవకాశాలు ఇస్తుందా లేదా అనేది చూడాలి.