Movie News

హిట్ 4 కోసం ఊహించని మాస్ హీరో ?

దర్శకుడు శైలేష్ కొలను తీసిన హిట్ సిరీస్ లో మొదటి రెండు భాగాలు సూపర్ హిట్ అయ్యాయి. హిట్ 1 ది ఫస్ట్ కేస్ తో విశ్వక్ సేన్ మంచి విజయం నమోదు చేసుకోగా హిట్ 2 ది సెకండ్ కేస్ అడివి శేష్ కు సక్సెస్ ట్రాక్ కొనసాగించింది. ప్రస్తుతం హిట్ 3 ది థర్డ్ కేస్ ని న్యాచురల్ స్టార్ నానితో చేస్తున్న శైలేష్ దీని తర్వాత హిట్ 4 కి రంగం సిద్ధం చేస్తున్నట్టు సమాచారం.

మాస్ మహారాజా రవితేజని మోస్ట్ డేంజరస్ పోలీస్ గా చూపించే అవకాశమున్నట్టు ఇన్ సైడ్ టాక్. ఇంకా నిర్ధారణగా చెప్పలేం కానీ ఒకవేళ నిజమైతే మాత్రం ఒక చిన్న ఎపిసోడ్ షూట్ చేసి హిట్ 3 క్లైమాక్స్ లో జోడించే ఛాన్స్ ఉంది. ఖరారయ్యే దాకా చూడాలి.

హిట్ యునివర్స్ ని విస్తరిస్తానని శైలేష్ కొలను గతంలోనే చెప్పాడు. అందరు హీరోలను ఒక సినిమాలో కలిపి అవెంజర్స్ తరహాలో భారీ ట్రీట్ ఇస్తానని అన్నాడు. సో ఆ దిశగానే అడుగులు పడుతున్నాయన్న మాట. హిట్ 3 ది థర్డ్ కేస్ లో అర్జున్ సర్కార్ పాత్రలో నానిని చాలా వయొలెంట్ గా చూపిస్తున్నట్టు ఆల్రెడీ టాక్.

మర్డర్ మిస్టరీ నేపధ్యమే అయినప్పటికీ ట్రీట్ మెంట్ చాలా విభిన్నంగా ఉంటుందని, షాక్ ఎలిమెంట్స్ చాలా ఉంటాయని అంటున్నారు. ఫ్యామిలీ ఆడియన్స్ లో ఫాలోయింగ్ ఉన్న నానిని సెటిల్డ్ వయొలెన్స్ చేయడం చూసి కొత్త అనుభూతి పొందటం ఖాయమని అంటున్నారు.

సో హిట్ ప్రపంచం పెద్దది కాబోతుంది. మూడు సినిమాలకు నిర్మాతగా వ్యవహరించిన నాని ఇకపై కూడా కొనసాగబోతున్నాడు. బడ్జెట్ ప్రతి భాగానికి పెరుగుతూ పోతోంది. వెంకటేష్ లాంటి పెద్ద హీరోని హ్యాండిల్ చేయడంలో తడబడి ఫ్లాప్ అందుకున్న శైలేష్ కొలను దాన్ని పూర్తిగా మర్చిపోయే కసితో హిట్ 3ని రూపొందిస్తున్నాడట.

శ్రీనిధి హీరోయిన్ కాగా ఇప్పటికే కీలక షెడ్యూల్స్ కొన్ని పూర్తి చేశారు. చాలా అరుదైన లొకేషన్లలో షూటింగ్ జరిగింది. మే 1 విడుదల తేదీని లాక్ చేసుకున్న హిట్ 3 ప్యాన్ ఇండియా స్థాయిలో ఎలాంటి అనూహ్య పరిస్థితులు ఎదురు కాకపోతే చెప్పిన డేట్ కి మాట తప్పకుండా వచ్చేస్తుంది.

This post was last modified on January 28, 2025 2:52 pm

Share

Recent Posts

ఆ యంగ్ మినిస్ట‌ర్ దూకుడు మామూలుగా లేదుగా…

యువ మంత్రి, క‌ర్నూలు జిల్లాకు చెందిన టీజీ భ‌ర‌త్‌.. దూకుడు మామూలుగా లేదనే టాక్ వినిపిస్తోంది. టీడీపీ నాయ‌కుడిగా.. యువ…

2 hours ago

రణబాలికి ఇంతకంటే ఏం కావాలి

ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో అత్యధిక బడ్జెట్ తో రూపొందిన ప్యాన్ ఇండియా మూవీ రణబాలినే. విజయ్ దేవరకొండ, రష్మిక…

6 hours ago

ఊహించని మార్పులతో దృశ్యం 3

కొన్ని నెలల క్రితం మోహన్ లాల్ దృశ్యం 3 మీద చాలా విమర్శలొచ్చాయి. మలయాళం వెర్షన్ డబ్బులు తెచ్చి ఉండొచ్చేమో…

7 hours ago

ఒకే నెలలో సాయిపల్లవి డబుల్ బొనాంజా

గత సంవత్సరం తండేల్ తర్వాత హీరోయిన్ సాయిపల్లవి దర్శనం బొత్తిగా లేకుండా పోయింది. ఈ ఏడాది ఏక్ దిన్ తో…

8 hours ago

40 సంవత్సరాల రాక్షసుడు… ఇది చిరంజీవి కెజిఎఫ్

కొన్ని సినిమాల ల్యాండ్ మార్క్ యానివర్సరీలు గుర్తు చేసుకోవడం అవసరం. ఎందుకంటే ఇప్పటి బ్లాక్ బస్టర్ల మూలాలు ఎంతో కొంత…

8 hours ago

లక్ష కోట్లతో ‘రాయలసీమ రైజింగ్‘

ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రాభివృద్ధి జెట్ స్పీడ్ లో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఓ వైపు అమరావతి…

10 hours ago