సరిగ్గా పది సంవత్సరాల క్రితం 2015లో ఇదే జనవరి 28 జరిగిన టెంపర్ ఆడియో లాంచ్ ని అభిమానులు గుర్తు చేసుకుంటున్నారు. జూనియర్ ఎన్టీఆర్ అప్పుడు వరస ఫ్లాపులు ఎదురుకుంటున్న సమయం. కథలు దర్శకుల ఎంపికలో పొరపాట్ల కారణంగా బాక్సాఫీస్ ఫలితాలు చేదుగా వస్తున్నాయి.
రామయ్యా వస్తావయ్యా, రభస లాంటివి దారుణంగా పోయాయి. చిన్న వయసులోనే సింహాద్రి లాంటి ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన తమ హీరోకు ఇలా జరగడం చూసి ఫ్యాన్స్ నొచ్చుకున్నారు. సరిగ్గా అప్పుడు కుదిరింది టెంపర్ కాంబో. దర్శకుడు పూరి జగన్నాధ్ సైతం డౌన్ లో ఉన్నప్పుడు ఈ కలయిక సాధ్యమయ్యింది.
ఆ వేడుకలో తారక్ మాట్లాడుతూ ఇకపై నందమూరి అభిమానులు కాలర్ ఎగరేసుకునేలా సినిమాలు చేస్తానని, గతంలో కొన్ని నిరాశపరిచినా ఇకపై జాగ్రత్తగా ఉంటానని సభావేదికగా హామీ ఇచ్చాడు. నిజంగానే తను అన్నది జరిగింది. టెంపర్ నుంచి దేవర దాకా జూనియర్ ఎన్టీఆర్ ఫ్లాప్ చూడలేదు.
నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్, జై లవకుశ, అరవింద సమేత వీరరాఘవ వీటిలో ఏదీ నిరాశపరచలేదు. రామ్ చరణ్ తో కలిసి చేసిన ఆర్ఆర్ఆర్ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చింది. ఇప్పుడు ఏకంగా వార్ 2 తో బాలీవుడ్ డెబ్యూ జరుగుతోంది. పదేళ్ల ప్రయాణం ఫ్యాన్స్ కోరుకున్న దానికన్నా మిన్నగా జరిగింది.
అప్పుడేదైతే చెప్పాడో జూనియర్ ఇప్పుడూ అదే పాటిస్తున్నాడు. తొందరపాటు చూపించడం లేదు. వార్ 2 తర్వాత ప్రశాంత్ నీల్ ప్యాన్ ఇండియా మూవీతో మరిన్ని పెద్ద టార్గెట్లను పెట్టుకున్నాడు. దేవర 2కి ఎంత టైం పట్టొచ్చనేది ప్రస్తుతానికి తేలలేదు కానీ దాని తర్వాత కూడా హడావిడి నిర్ణయాలు తీసుకునే ఉద్దేశం కనిపించడం లేదు.
పైన చెప్పిన టెంపర్ ఈవెంట్ లో తారక్ బాబాయ్ బాలకృష్ణ ప్రస్తావన తెచ్చి రాబోయే సినిమా గురించి ఫ్యాన్స్ లో ఉత్సాహం రేపడం విశేషం. కొన్ని జ్ఞాపకాలు అంతే. ఒక కాలపరిమితి దాటాక ప్రత్యేకంగా అనిపిస్తాయి. దశాబ్దం తర్వాత టెంపర్ వేడుక అదే కోవలోకి వచ్చింది.
This post was last modified on January 28, 2025 4:32 pm
టార్గెట్ కేటీఆర్.. లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బీఆర్ఎస్ నాయకుడు, మాజీ మంత్రి కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న…
ఈ మధ్య కాలంలో రెండు అతి పెద్ద హిట్ సినిమాలు ఏవయ్యా అంటే వెంటనే గుర్తొచ్చే పేర్లు మండాడి, బెత్లెహాం…
విజయవాడలో నిర్వహించిన ‘పేదల పట్టాల పండుగ’ సభలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. అయితే, చంద్రబాబు ప్రసంగిస్తుండగా సభా ప్రాంగణం సమీపంలో…
వైసీపీ నుంచి ఆ మాటకొస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించిన రాజ్యసభ మాజీ సభ్యుడు వేణుంబాక విజయ సాయిరెడ్డి కొద్ది…
ఒక పెద్ద బ్లాక్ బస్టర్ సీక్వెల్ అంటే ఏ స్థాయిలో అంచనాలు ఉంటాయో వేరే చెప్పనక్కర్లేదు. బాహుబలి, పుష్ప, కెజిఎఫ్,…
ప్యాన్ ఇండియా జానర్ వల్ల భాషల మధ్య హద్దులు చెరిగిపోతున్నాయి. దర్శకులు ఒక వుడ్డుకే అంకితం కాకుండా ఇతర పరిశ్రమలకు…