వచ్చే నెల ఫిబ్రవరి 14 విడుదల కాబోతున్న చావా మీదున్న అంచనాలు ట్రైలర్ వచ్చాక రెట్టింపయ్యాయి. విక్కీ కౌశల్ టైటిల్ రోల్ పోషిస్తున్న ఈ హిస్టారికల్ డ్రామాలో రష్మిక మందన్న మహారాణి యేసుబాయ్ గా కీలకమైన పాత్ర దక్కించుకుంది. ఇది పోషించాక రిటైర్ అయిపోయినా పర్వాలేదనిపించిందని చెప్పడం చూస్తే క్యారెక్టర్ తనకు ఎంత స్కోప్ దక్కిందో అర్థం చేసుకోవచ్చు.
అయితే రిలీజ్ కు ఇరవై రోజులు కూడా సమయం లేని పరిస్థితిలో మెల్లగా వివాదాలు చుట్టుముట్టేలా ఉన్నాయి. వాయిదా పడటం లాంటివి జరగకపోవచ్చు కానీ కొన్ని కాంట్రావర్సిలు ఎదురుకునేందుకు టీమ్ సిద్ధం కావాల్సి రావొచ్చు.
చావా చిత్రం ఛత్రపతి శంభాజీ మహారాజ్ జీవిత కథ. మరాఠి సామ్రాజ్యంలో ఆయన వీరోచిత గాథలు ఎన్నో స్ఫూర్తిగా నిలిచాయి. ఆ వంశం వారసులు ఈ సినిమాను చరిత్రకారులకు చూపించి ఏవైనా తప్పులు ఉంటే సరిదిద్దుకోమని అడుగుతున్నారు. రాజ్యసభ ఎంపీ శంబిరాజే ఛత్రపతి దీని గురించి ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నారు.
ట్రైలర్ లో శంభాజీ, యేసుబాయ్ లెజిమ్ అనే సాంప్రదాయ సంగీత వాయిద్యాన్ని వాడినట్టు, నృత్యం చేసినట్టు చిత్రీకరణ చేశారని, కానీ క్రియేటివ్ లిబర్టీ పేరుతో జరగనివి చూపించడం గురించి ఒకసారి చెక్ చేసుకోమని దర్శకుడు లక్ష్మణ్ ఉతేకర్ కు సూచించారట.
ఇదొక్కటే కాదు ఔరంగజేబు దుర్మార్గాలను ఎక్కువ చేసి చూపించారనే కామెంట్ మరో వర్గం నుంచి వినిపిస్తోంది. ప్రస్తుతానికి ఫైనల్ వెర్షన్ చూసిన బయట వాళ్ళు ఎవరూ లేకపోవడంతో ఇలాంటి విషయాల పట్ల స్పష్టత తక్కువగా ఉంది. చావా మహారాష్ట్ర యోధుడికి సంబంధించిన కథే అయినా భాషతో సంబంధం లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే అద్భుత అంశాలు ఎన్నో ఇందులో ఉన్నాయని టీమ్ పేర్కొంటోంది.
ఏఆర్ రెహమాన్ సంగీతం సమకూర్చిన చావాను తెలుగులో కూడా డబ్బింగ్ చేస్తున్నారు. రష్మిక మందన్న ఇది చాలా పెద్ద బ్రేక్ అవుతుందనే నమ్మకంతో ఎదురు చూస్తోంది.
This post was last modified on January 25, 2025 1:10 pm
వైసీపీ మరింత డీలా పడనుందా? ఆ పార్టీ వాయిస్ మరింత తగ్గనుందా? అంటే.. ఔననే అంటున్నాయి రాజకీయ వర్గాలు. ప్రస్తుతం…
ఒక కథ ఒక చోటి నుంచి ఇంకో చోటికి ప్రయాణం చేయడం.. ఎవరికో అనుకున్న కథ ఇంకెవరికో సెట్ కావడం…
బీజేపీ సీనియర్ నాయకుడు, ఘోషా మహల్ ఎమ్మెల్యే, వివాదాలకు కేంద్రంగా ఉన్న రాజా సింగ్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు.…
కేవలం సినిమాలో వినోదం ఉంటే సరిపోదని.. ప్రమోషన్లను కూడా సినిమా థీమ్‌కు తగ్గట్లు సరదాగా డిజైన్ చేసి ప్రేక్షకుల దృష్టిని…
భారతదేశంలో 5G సేవలు చాలా వేగంగా విస్తరిస్తున్నాయి. తాజాగా కేంద్ర ప్రభుత్వం తెలిపిన వివరాల ప్రకారం, మొత్తం 776 జిల్లాల్లో…
‘మిర్చి’ సినిమా ఇంటర్వెల్ బ్యాంగ్‌లో ‘నా ఫ్యామిలీ సేఫ్’ అంటూ ప్రభాస్ చెప్పే డైలాగ్ ఎంత పాపులరో కొత్తగా చెప్పాల్సిన…