ఇటీవలే కల్ట్ క్లాసిక్ సత్య రీ రిలీజ్ సందర్భంగా దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దానికొచ్చిన స్పందన చూసి తనకు జ్ఞానోదయం అయ్యిందని, ఇకపై నిజాయితీగా పని చేసి మంచి సినిమా తీస్తానని ప్రకటించడం అభిమానుల మధ్య చర్చకు దారి తీసింది. ట్వీట్ పెట్టిన ఇరవై నాలుగు గంటల్లోనే సిండికేట్ టైటిల్ తో ప్రాజెక్ట్ అనౌన్స్ చేయడం ఆశ్చర్యానికి గురి చేసింది.
అయితే ఇందులో బడా స్టార్లు భాగమవుతున్నారనే వార్త హాట్ టాపిక్ గా మారింది. వెంకటేష్, అమితాబ్ బచ్చన్, విజయ్ సేతుపతి లాంటి పెద్ద పేర్లు బయటికి రావడంతో ఇది నిజంగా సాధ్యమవుతుందా అనే అనుమానాలు తలెత్తతున్నాయి.
సంకల్పం ఎంత బలంగా ఉన్నా రామ్ గోపాల్ వర్మ మునుపటి మేజిక్ చేయగలడా అనేదే అసలు ప్రశ్న. వెంకటేష్ తో ఆయన తీసిన క్షణ క్షణం ఇప్పటికీ ఫ్యాన్స్ ప్రత్యేకంగా చెప్పుకుంటారు. ఆ తర్వాత ఈ కలయిక సాధ్యపడలేదు. అమితాబ్ బచ్చన్ కు సర్కార్ రూపంలో ఇచ్చిన బ్రేక్ చిన్నది కాదు.
తర్వాత ఫ్లాపులు పడినా కూడా బిగ్ బికి వర్మ మీద అభిమానం అలాగే ఉండిపోయింది. ఇక విజయ్ సేతుపతి సంగతి సరేసరి. కథ నచ్చితే ఇమేజ్ పక్కనపెట్టి మరీ విలన్ గా చేయడానికైనా సిద్ధపడతాడు. సో అడగాలే కానీ నో చెప్పే ఛాన్స్ ఉండదు. ఈ కాంబో నిజంగా కార్యరూపం దాలిస్తే శుభవార్తే.
కాకపోతే ఇదేమైనా పబ్లిసిటీ స్టంటా లేక సీరియస్ గానే ఆ దిశగా అడుగులు పడుతున్నాయా అనేది వేచి చూడాలి. గత కొన్ని సంవత్సరాలుగా వర్మ తీసిన సినిమాలు ఏదో ఒక వ్యక్తిగత ఎజెండా లేదా ప్రయోజనం కోసం తీసినవి. వీటిలో ఒక్కటి కూడా ఆడలేదు. మరో విషయం ఏంటంటే వర్మ తీసేవి డార్క్ మాఫియా డ్రామాలు.
సిండికేట్ టైటిల్ కూడా అదే సూచిస్తోంది. మరి ఎంటర్ టైన్మెంట్ తోనే ఎఫ్2, సంక్రాంతికి వస్తున్నాం లాంటి హిట్లు కొడుతున్న వెంకటేష్ తిరిగి జానర్ మారుస్తారా అనేది డౌటే. ప్రస్తుతానికి ఇదంతా ప్రచారం స్టేజిలోనే ఉంది కాబట్టి అఫీషియల్ గా చెప్పేదాకా ఏదీ నిర్ధారించలేం.
This post was last modified on January 25, 2025 11:02 am
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…