పుష్ప-2 ఇంకా థియేటర్లలోనే ఉంది. దీనికి కొనసాగింపుగా ‘పుష్ప-3’ తీయడానికి సినిమాలో చిన్న హింట్ అయితే ఇచ్చారు కానీ.. ఆ చిత్రం ఉంటుందో లేదో క్లారిటీ లేదు. దర్శకుడు సుకుమార్, హీరో అల్లు అర్జున్ సైతం ఈ విషయంలో ఏ నిర్ణయం తీసుకోలేదు. కానీ అప్పుడే ఈ సినిమాలో ఐటెం సాంగ్ గురించి మాట్లాడేస్తున్నాడు సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్.
‘పుష్ప-3’ సినిమా తీసి, అందులో ఐటెం సాంగ్ పెట్టేట్లయితే ఆ పాటకు జాన్వి కపూర్‌ను ఎంచుకుంటే బాగుంటుందని అతను అభిప్రాయపడ్డాడు. మామూలుగా దేవి తన పరిధిలో లేని ఇలాంటి విషయాల గురించి మాట్లాడడు కానీ.. పుష్ప-3 ఐటెం సాంగ్ విషయంలో మాత్రం తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. ‘పుష్ప-2’లో ఐటెం సాంగ్ కోసం శ్రీలీలను ఎంచుకోవాలని సూచించింది కూడా తానే అంటూ అతను కొత్త విషయం కూడా బయటపెట్టాడు.
తన సినిమాల్లో ఐటెం సాంగ్స్ గురించి ఓ ఇంటర్వ్యూలో దేవి మాట్లాడుతూ.. ‘‘ఎంతోమంది స్టార్ హీరోయిన్లు తొలిసారిగా నా సినిమాల్లోనే ఐటెం సాంగ్స్ చేశారు. పూజా హెగ్డే, సమంత, శ్రీలీల, కాజల్ అగర్వాల్.. వీళ్లందరూ టాప్ రేంజిలో ఉన్నపుడే నా సినిమాల్లో ఐటెం సాంగ్స్ చేశారు. పుష్ప-3లో కిసిక్ సాంగ్‌లో ఎవరు నర్తించినా వాళ్లకు అంతర్జాతీయ స్థాయిలో పేరు వస్తుందని మాకు ముందే తెలుసు. శ్రీలీల అద్భుతమైన డ్యాన్సర్ కాబట్టి ఆమెను తీసుకుంటే బాగుంటుందని మేకర్స్‌కు నేనే చెప్పాను.
పుష్ప-3లో ఐటెం సాంగ్ ఎవరు చేయాలో దర్శక నిర్మాతలు తుది నిర్ణయం తీసుకుంటారు. పాటను బట్టి హీరోయిన్ని ఎంచుకుంటారు. ఐతే నా ఉద్దేశంలో జాన్వి కపూర్ అయితే బాగుంటుంది. ఆమె చేసిన కొన్ని పాటలు చూశాను. తను అద్భుతమైన డ్యాన్సర్. శ్రీదేవిలో ఉన్న గ్రేస్ తనలో ఉంది.
ఐటెం సాంగ్స్ హిట్ కావడానికి డ్యాన్స్ ముఖ్య కారణం. ఆమె అయితే పుష్ప-3 ఐటెం సాంగ్‌కు బాగుంటుందని అనుకుంటున్నా’’ అని దేవి చెప్పాడు. మరి సుకుమార్ పుష్ప-3 తీస్తే.. దేవి సలహాను అనుసరించి జాన్వికి ఛాన్స్ ఇస్తాడేమో చూడాలి.
This post was last modified on January 24, 2025 3:06 pm
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…
టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…
పార్వతీపురం మన్యం జిల్లా, భామినిలో నేడు నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. తొలినాళ్లలో తీసిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్…
ప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సమావేశం ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్లో జరిగింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, భారత ప్రధాని నరేంద్ర…