Movie News

కత్తిపోట్లతో సైఫ్ కి 15 వేల కోట్ల నష్టమా…?

బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ ఇంటిలోకి చొరబడ్డ ఆ దొంగ ఏం తీసుకెళ్లలేకపోయాడు గానీ… అతడి కత్తి మాత్రం సైఫ్ కు ఏకంగా రూ.15 వేల కోట్ల మేర నష్టాన్ని మిగిల్చే ప్రమాదాన్ని తెచ్చి పెట్టింది. ఏంటేంటీ… దొంగ విసిరిన కత్తి సైఫ్ కు ఇన్నేసి వేల కోట్ల నష్టాన్ని మిగులుస్తోందా?.. అని ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ఈ మాట అక్షరాల నిజమే. కోర్టు గనుక సైఫ్ పట్ల సానుకూలంగా స్పందించకపోతే మాత్రం అతడికి అక్షరాలా రూ.15 వేల కోట్ల మేర నష్టం వాటిల్లడం ఖాయమే.

సరే… ఈ కథాకమామీషు ఏమిటో చూద్దాం పదండి. సైఫ్ రాజ కుటుంబానికి చెందిన వాడని తెలిసిందే కదా. మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ అలియాస్ టైగర్ పటౌడీ కుమారుడే సైఫ్. టైగర్ తల్లి, సైఫ్ నానమ్మ సాజిదా సుల్తాన్ బేగం ఇంకా బతికే ఉన్నారు. మనవడు సైఫ్ కు కత్తి పోట్ల కారణంగా ఆమె షాక్ కు గురై అనారోగ్యం పాలయ్యారు. ప్రస్తుతం ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సాజిదాకు ఓ అక్క అబీదా సుల్తాన్ బేగం కూడా ఉన్నారు. వీరి తండ్రి ముహమ్మద్ హమీదుల్లాహ్.. భోపాల్ కేంద్రంగా పాలన సాగించిన పటౌడీ సామ్రాజ్యానికి చివరి సుల్తాన్.

హమీదుల్లాహ్ బతికుండగానే… ఆయన పెద్ద కుమార్తె అబీదా పాకిస్తాన్ వెళ్లిపోయారు. ఆ తర్వాత చిన్న కుమార్తెతో కలిసి భారత్ లోనే ఉండిపోయిన హమీదుల్లాహ్ 1960లో మరణించారు. ఈ లెక్కన అప్పటికే పాక్ వెళ్లిపోయిన తన సోదరి కాకుండా తండ్రితో కలిసి దేశంలోనే ఉండిపోయిన తానే తన తండ్రి ఆస్తులకు వారసురాలిని అని… ఆ మేరకు తీర్మానం చేయాలని సాజిదా భారత ప్రభుత్వాన్ని కోరారు. ఈ ప్రతిపాదనకు సమ్మతిస్తూ భారత ప్రభుత్వం కూడా 1962లోనే ఆర్డర్ పాస్ చేసింది. ఫలితంగా హమీదుల్లాహ్ ఆస్తులకు చట్టబద్ధంగా సాజిదా… అంటే సైఫ్ నానమ్మే సిసలైన వారసురాలు.

ఉత్తర ప్రదేశ్, మధ్యప్రదేశ్ లలోని పలు ప్రాంతాల్లో పటౌడీ రాజవంశానికి రూ.15 వేల కోట్ల విలువ చేసే ఆస్తులున్నాయి. ఈ ఆస్తులు సాజిదాకే చెందాలి. అయితే మోదీ సర్కారు వచ్చిన తర్వాత 2017లో ఈ తరహా ఆస్తులకు సంబంధించి ఓ కీలక ఉత్తర్వు జారీ అయ్యింది. దీని ద్వారా అమలులోకి వచ్చిన భారత శత్రు ఆస్తుల పరిరక్షణ సంస్థ( సీఈపీఐ)కు ఈ ఆస్తులన్నీ చెందుతాయని కేంద్రం వాదిస్తోంది. ఎందుకంటే… హమీదుల్లాహ్ పెద్ద కుమార్తె అబీదా పాక్ వెళ్లిపోయారు కాబట్టి… ఆమెను శత్రు దేశ పౌరురాలిగా పరిగణిస్తున్నామని, ఆమెకు చెందే ఈ ఆస్తులు కొత్త చట్టం ప్రకారం ప్రభుత్వానివేనని కేంద్రం చెబుతోంది.

కేంద్రం వాదన తప్పు అని… ఇదివరకే కేంద్రం ఈ ఆస్తులు తమవేనని ఓ ఆర్డర్ కూడా జారీ చేసిందని చెబుతూ సాజిదా కోడలు, పటౌడీ సతీమణి షర్మిలా ఠాకూర్ మద్యప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించారు. కేంద్రం తెచ్చిన ఈ కొత్త చట్టం తనకు వర్తించదని ఆమె వాదిస్తున్నారు. ఈ కేసులో ఇంకా తుది తీర్పు రాలేదు. అయితే ఇటీవలే ఈ కేసులో కేంద్రం తన వాదనను వినిపిస్తూ… పటౌడీ ఫ్యామిలీ ఏది చెప్పాలనుకున్నా… ముంబైలోని సీఈపీఐ అప్పీలేట్ కోర్టులో చెప్పుకోవాలని కోరింది. కేంద్రం వాదనతో ఏకీభవించిన ఎంపీ హైకోర్టు కూడా ఈ వివాదాన్ని సీఈపీఐలో తేల్చుకోవాలని..అందుకు 30 రోజుల గడువు ఇస్తున్నట్లు ఇటీవలే తీర్పు చెప్పింది. ఆ గడువు శుక్రవారంతో ముగిసింది.

అయితే సైఫ్ ఇంటిలో చోరీ యత్నం, అతడిపై కత్తిపోట్లతో అతడి కుటుంబం ఆసుపత్రిలో ఉండిపోయింది. తీరా సైఫ్ ఇంటికి చేరుకోగానే… ఆయన నానమ్మ అనారోగ్యానికి గురయ్యారు. ఈ హడావిడిలో పడి సైఫ్… సీఈపీఐని ఆశ్రయించే విషయాన్నే మరిచిపోయారు. న్యాయవాదులు గుర్తు చేద్దామన్నా కుదరలేదు. దీంతో ఇప్పుడు సీఈపీఐని ఆశ్రయించేందుకు మరింత గడువు కావాలని హైకోర్టును కోరేందుకు సైఫ్ ఫ్యామిలీ సిద్ధమైంది. వీరి అభ్యర్థనను కోర్టు మన్నిస్తే.. రూ.15 కోట్ల ఆస్తులపై పోరాటం చేసే అవకాశం సైఫ్ కు ఉంటుంది. లేదంటే… ఆ ఆస్తులను అతడి ఫ్యామిలీ వదులుకోక తప్పదన్న మాట.

Satya

Recent Posts

30 దాటాక కూడా రేస్‌లో ఉండాలంటే…

ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరీర్ కు ఒక ఎక్స్ పైరీ డేట్ ఉంటుందనేది ఎప్పటినుంచో వినిపించే మాటే. పాతికేళ్ల నుంచి ముప్పై…

3 hours ago

మ‌హారాష్ట్ర ముఖ్య‌మంత్రితో లోకేష్ భేటీ రీజ‌నేంటి?

మ‌హారాష్ట్ర ముఖ్య‌మంత్రి, బీజేపీ సీనియ‌ర్ నాయ‌కుడు దేవేంద్ర ఫ‌డ‌ణవీస్‌తో ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్…

4 hours ago

నమ్మకం టన్నుల్లో… రామ్ చరణ్ మాటల్లో

విజయవాడ పెద్ది ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా ముగిసింది. ఏర్పాట్ల దగ్గరి నుంచి అయిపోయే దాకా ఎక్కడా అపశ్రుతి లేకుండా…

5 hours ago

జ‌గ‌న్‌కు క‌విత మ‌ద్ద‌తిస్తున్నారా?

తెలంగాణ నాయ‌కురాలు, తెలంగాణ ర‌క్ష‌ణ సేన‌(టీఆర్ఎస్‌) పార్టీ అధ్య‌క్షురాలు క‌విత తాజాగా చేసిన వ్యాఖ్య‌ల‌పై సోష‌ల్ మీడియాలో పెద్ద ఎత్తున…

5 hours ago

మస్సా మస్సా… లెక్క సరిపోయింది

పెద్ది నుంచి ఏదైనా బ్యాంగర్ లాంటి కంటెంట్ కావాలని ఎదురు చూస్తున్న అభిమానులకు అది మస్సా మస్సా వీడియో సాంగ్…

6 hours ago

ప‌క్కా మాస్… క‌ల్లు రుచి చూసిన బాబు

ఏపీ సీఎం చంద్ర‌బాబు.. తాజాగా క‌ల్లు రుచి చూశారు. వాస్త‌వానికి ఆయ‌న ఇలాంటి వాటికి క‌డు దూరంగా ఉంటారు. అయితే..…

6 hours ago