పుష్ప 2 ది రూల్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విషయంలో దేవిశ్రీ ప్రసాద్ ఎదురుకున్న ఇబ్బందులు, వేరొకరితో నేపధ్య సంగీతం బాధ్యతలు పంచుకోవాల్సి రావడం గురించి రేగిన వివాదం కొన్ని రోజుల పాటు హాట్ డిస్కషన్స్ లో ఉండిపోయాయి. ఏదైతేనేం సినిమా బ్లాక్ బస్టర్ కావడంతో ఈ విషయం పక్కకు వెళ్ళిపోయింది.
అయితే ఆడియో విషయంలో దేవి నిరాశ పరచలేదు. కిస్సిక్, సూసేకి పాటలు ఒకదాన్ని మించి మరొకటి ఛార్ట్ బస్టర్ అయ్యాయి. జాతర ఎపిసోడ్ సాంగ్ మాములుగా పేలలేదు. సంక్రాంతికి వచ్చిన గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్ కన్నా పుష్ప 2 పాటలే బాగున్నాయనేది కాదనలేని వాస్తవం.
అయినా కూడా దేవి మీద ఇంకేమైనా సందేహాలు ఉంటే తండేల్ వాటిని పూర్తిగా తీర్చబోతోంది. ఇప్పటిదాకా వచ్చిన మూడు పాటలు జనంలోకి బాగా వెళ్లిపోయాయి. బుజ్జితల్లికి వచ్చిన స్పందన చూసి నిర్మాతలు సంక్రాంతి రిలీజులతో పాటు థియేటర్లలో స్క్రీనింగ్ చేయడం మంచి ఫలితం ఇస్తోంది.
శివరాత్రి జాతర పాట సినిమా రిలీజయ్యాక భారీ స్పందన తెచ్చుకోవడం ఖాయం. చైతు, సాయిపల్లవిల డాన్స్ దానికి మరింత అందాన్ని తీసుకురానుంది. నిన్న రిలీజ్ చేసిన హైలెస్సో హైలెస్సో ముందు రెండింటిని మించి దూసుకుపోయేలా కనిపిస్తోంది. తక్కువ టైంలో ట్రెండింగ్ లోకి వెళ్లిపోయింది.
తండేల్ కు పూర్తి స్థాయి బీజీఎమ్ దేవినే ఇవ్వబోతున్నాడు. తగినంత సమయం దొరికితే అతను ఎంత బెస్ట్ ఇస్తాడో వాల్తేరు వీరయ్య, ఉప్పెన లాంటి సినిమాలు నిరూపించాయి. ఇప్పుడు తండేల్ కూడా అంతే టైం ఇవ్వడంతో అభిమానులు బెస్ట్ ఆశిస్తున్నారు. అక్కినేని హీరోలకు డిఎస్పి గతంలో మంచి ఆల్బమ్స్ ఇచ్చాడు.
మన్మథుడు, కింగ్, మాస్, రారండోయ్ వేడుక చూద్దాం, డమరుకం లాంటివి మచ్చుకు కొన్ని. ఇప్పుడు తండేల్ వాటికి మించి ఉంటుందనే అంచనాలు భారీగా ఉన్నాయి. ఫిబ్రవరి 7 విడుదల కాబోతున్న ఈ చిత్రాన్ని చందూ మొండేటి దర్శకత్వంలో గీతా ఆర్ట్స్ పెద్ద బడ్జెట్ తో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించింది.
This post was last modified on January 24, 2025 3:20 pm
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…
సంక్రాంతి సినిమాల హడావుడి మరో లెవెల్ కు చేరుకుంది. ఇప్పటికే రాజాసాబ్ థియేటర్లలో సందడి చేస్తుండగా రేపు మెగాస్టార్ చిరంజీవి…
ఒకప్పుడు సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఒక వెలుగు వెలిగింది సమంత. ఇటు తెలుగులో, అటు తమిళంలో అగ్ర…
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 19 నెలలు అయిన నేపథ్యంలో, అన్ని వర్గాల ప్రజల సంతృప్తిపై మరోసారి ప్రభుత్వం ఐవీఆర్ఎస్…
ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణులు మంతెన సత్యనారాయణ రాజు గారు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ ఆరోగ్య సూత్రాలు…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు వరుసగా లభిస్తున్న గౌరవాలు ఆయన వ్యక్తిత్వానికి మరో కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తున్నాయి. భారతీయ సంస్కృతి,…