రామ్ గోపాల్ వర్మలో ఎప్పుడూ లేని పశ్చాత్తాప భావన చూస్తున్నాం ఇప్పుడు. ఒకప్పుడు రంగీలా, సత్య లాంటి క్లాసిక్స్ తీసిన తాను.. ఆ తర్వాత ఆ ప్రమాణాలకు తగ్గ చిత్రాలు తీయలేకపోయానని.. ఇందుకు చింతిస్తున్నానని.. ఇకపై మంచి సినిమాలే చేస్తానని వర్మ ఇటీవల ట్విట్టర్లో పెట్టిన పోస్టు చర్చనీయాంశం అయింది. ఏదో ఒక స్టేట్మెంట్ ఇచ్చి తర్వాత తూచ్ అనడం వర్మకు అలవాటు కాబట్టి ఈ పోస్టును లైట్ తీసుకున్నవాళ్లూ ఉన్నారు.
కానీ వర్మ తీరు చూస్తుంటే ఆయన ఈసారి సిన్సియర్‌గానే ఈ స్టేట్మెంట్ ఇచ్చినట్లు కనిపిస్తోంది. గత పదేళ్లలో నాసిరకం సినిమాలు తీసిన వర్మ.. ఈసారి అలా కాకుండా పెద్ద కాస్టింగ్‌తో భారీ చిత్రం చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్న విషయం వెల్లడైంది. ఇప్పుడు ఆ సినిమానే అధికారికంగా ప్రకటించాడు వర్మ. ఆయన తెరకెక్కించనున్న కొత్త చిత్రం పేరు.. సిండికేట్.
ఇటీవల ‘సత్య’ సినిమా చూసి తాను ఇచ్చిన కన్ఫెషన్ స్టేట్మెంట్‌కు కొనసాగింపుగా ఇప్పుడీ సినిమా ప్రకటన చేస్తున్నట్లుగా చెప్పిన వర్మ.. తన కెరీర్లో ‘సిండికేట్’ బిగ్టెస్ట్ ఫిలిం అని చెప్పాడు. 70వ దశకంలో స్ట్రీట్ గ్యాంగ్స్‌తో మొదలుపెట్టి ఐసిస్ వరకు ఎన్నో రకాల సంఘ వ్యతిరేక శక్తులను ఇండియా చూసిందని.. ఐతే గత పది పదిహేనేళ్లుగా చెప్పుకోగదగ్గ కొత్త గ్రూప్స్ లేవని.. ఒకవేళ భవిష్యత్తులో కొత్త తరహా సంఘ వ్యతిరేక శక్తులు ఎలా ఉంటుందో ‘సిండికేట్’ రూపంలో చూపించబోతున్నానని వర్మ సంకేతాలు ఇచ్చాడు.
‘‘ఓన్లీ మ్యాన్ కెన్ బి ద మోస్ట్ టెర్రిఫైయింగ్ యానిమల్’ అంటూ ఈ సినిమాకు ఒక ట్యాగ్ లైన్ కూడా జోడించాడు వర్మ. తాను గత కొన్నేళ్లుగా చేసిన సినిమా పాపాలన్నింటినీ కడిగేసే ఒకే ఒక్క చిత్రంగా ‘సిండికేట్’ను వర్మ అభివర్ణించాడు. ఈ సినిమాకు పని చేసే నటీనటులు, టెక్నీషియన్ల వివరాలను త్వరలో పంచుకుంటానని వర్మ వెల్లడించాడు. ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్ర పోషించే అవకాశాలున్నట్లు సమాచారం. విక్టరీ వెంకటేష్‌ను కూడా ఓ పాత్ర కోసం సంప్రదిస్తున్నాడట వర్మ.
This post was last modified on January 22, 2025 6:03 pm
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…