యానిమల్, పుష్ప 2 ది రూల్ రూపంలో రెండు ఆల్ టైం బ్లాక్ బస్టర్లు ఖాతాలో వేసుకున్న రష్మిక మందన్న ఫిబ్రవరిలో చావాతో రాబోతోంది. విక్కీ కౌశల్ టైటిల్ రోల్ పోషించిన ఈ హిస్టారికల్ డ్రామాని తొలుత పుష్పకి పోటీగా రిలీజ్ చేద్దామనుకున్నారు కానీ తర్వాత నిర్ణయం మార్చుకుని రెండు నెలలు వాయిదా వేసుకున్నారు.
ఉత్తరాదిలో అందులోనూ ప్రత్యేకంగా మహారాష్ట్ర వైపు దేవుడిగా కొలిచే చతప్రతి శంభాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా చావా రూపొందింది. లక్ష్మణ్ ఉతేకర్ దర్శకత్వంలో లెజెండరీ ఏఆర్ రెహమాన్ సంగీతం సమకూరుస్తుండటం అంచనాలు పెంచుతోంది. ఇక ఛాలెంజ్ ఎందుకన్నామో చూద్దాం.
చావాలో రష్మిక పోషిస్తున్న పాత్ర శంభాజీ భార్య మహారాణి యేసుబాయ్ బోన్సాలేది. 1730 సంవత్సరం దాకా ఈవిడ ప్రస్థానం సాగింది. మరాఠా సామ్రాజ్యపు మహారాణిగా యేసుబాయ్ వీరగాథలు ఎన్నో ప్రచారంలో ఉన్నాయి. రాజతంత్రాలు, యుద్దాలు, రాజకీయ వ్యూహాల్లో ఈవిడ మరాఠా సామ్రాజ్యానికి చేసిన సేవలు ఎనలేనివి.
శంభాజీ చనిపోయాక రాయగడ్ సంస్థానాన్ని కాపాడుకోవడానికి మొఘలులతో ఎనిమిది నెలల పాటు అలుపులేని యుద్ధం చేశారు. జైలులో చాలా సంవత్సరాలు మగ్గారు. ఆమె కొడుకే షాహు మహారాజ్. శంభాజీ పాలనలో భర్తతో కలిసి ఈవిడ వేసిన ముద్ర గురించి ఇప్పటికీ కథలుగా చెప్పుకుంటారు.
ఈ లెక్కన రష్మిక మందన్నకు దక్కింది ఆషామాషీ క్యారెక్టర్ కాదనే విషయం అర్థమైపోయిందిగా. బాలీవుడ్ లో గ్లామర్ టచ్ ఉన్నవి కాకుండా పెర్ఫార్మన్స్ డిమాండ్ చేసేవి కోరి ఎంచుకుంటున్న శ్రీవల్లికి దానికి తగ్గ ఫలితాలే దక్కుతున్నాయి. చావాలో నటనకు చాలా స్కోప్ దక్కిందని ఇన్ సైడ్ టాక్.
ఈ ఏడాది రష్మిక మందన్న జోరుగా ఉండబోవడం లేదు. హారర్ మూవీ తమలోనూ ఛాన్స్ కొట్టేసింది. త్వరలో తెలుగులో ది గర్ల్ ఫ్రెండ్ తో పలకరించనుంది. అన్నట్టు చావాలో తను పోషించిన యేసుబాయ్ పాత్రని గత ఏడాది మూడు సినిమాల్లో వేరేవాళ్లు చేశారు. వాళ్లకు దక్కని పేరు 2025లో రష్మిక సాధిస్తుందేమో చూడాలి.
This post was last modified on January 21, 2025 3:40 pm
ఖుషి తర్వాత స్క్రీన్ పై కనిపించకుండా పోయిన సమంతా తిరిగి ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. తన…
టాలీవుడ్ హీరోల్లో నానికి ఉన్న క్రెడిబిలిటీనే వేరు. ప్రతి హీరోకూ కెరీర్లో ఫ్లాపులు తప్పవు కానీ.. నాని కెరీర్ సక్సెస్…
టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు గురువారం బిజీబిజీగా గడిపారు. ఓ వైపు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు, మరోవైపు…
ఐపీఎల్ 2025 సీజన్‌కు ముందు ఢిల్లీ క్యాపిటల్స్ కీలక మార్పును చేపట్టింది. జట్టును ముందుండి నడిపించిన రిషభ్ పంత్ స్థానాన్ని…
జయకేతనం పేరిట జనసేన ఆవిర్బావ వేడుకలు శుక్రవారం అంగరంగ వైభవంగా జరగనున్నాయి. జనసేనాని. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్…
దర్శకధీర రాజమౌళి పలు సందర్భాల్లో చెప్పిన కల లాంటి ప్రాజెక్టు మహాభారతం. చాలా పెద్ద స్కేల్ మీద టాలీవుడ్ టాప్…