రాజమౌళి రికార్డులని దాటేసే స్థాయిలో పుష్ప 2 ది రూల్ తో ఆల్ టైం ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ సృష్టించిన దర్శకుడు సుకుమార్ త్వరలో పుత్రికోత్సాహాన్ని అనుభవించబోతున్నారు. ఆయన కూతురు సుకృతి వేణి బండ్రెడ్డి తెరంగేట్రం చేస్తున్న గాంధీ తాత చెట్టు ఫిబ్రవరి 24 థియేటర్లలో విడుదల కానుంది.
ఆయన సతీమణి సమర్పకురాలిగా వ్యవహరిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ పంపిణి బాధ్యతలు చూసుకుంటోంది. ఇవాళ నిర్వహించిన ఈవెంట్ లో నిర్మాత రవిశంకర్ ఒక ఆసక్తికరమైన విషయం చెప్పారు. అది కూడా పుష్ప 2కి ముడిపడింది కావడం గమనార్షం.
పుష్ప 95 శాతం ఆడియన్స్ కి బాగా నచ్చిందని అయితే క్యారెక్టరైజేషన్ గురించి కొంత నెగటివ్ గా ఫీలైన వాళ్ళు ఒక 5 శాతం ఉంటారని వాళ్లకు కూడా నచ్చేలా గాంధీ తాత చెట్టు అద్భుతంగా ఉంటుందని, అందరూ ఆదరించాలని కోరారు. రవిశంకర్ చెప్పిన దాంట్లో పాయింట్ ఉంది.
పుష్ప 2 సునామి కొనసాగుతున్న టైంలో కొందరు రాజకీయ నాయకులు హీరో పాత్ర గురించి విమర్శలు చేశారు. స్మగ్లింగ్ చేసే కథానాయకుడి ద్వారా ఏం సందేశం ఇస్తారని కామెంట్లు విసిరారు. సరే దాన్ని అంగీకరిస్తే మరి గాంధీ తాత చెట్టు లాంటి కంటెంట్ బేస్డ్ సినిమాలను ఖచ్చితంగా ఆదరించాలిగా.
సుకుమార్ జంట ఈ మూవీ పట్ల చాలా ఎమోషనల్ గా ఉన్నారు. ముఖ్యంగా తబిత స్టేజి మీద కన్నీళ్లు ఆపుకోలేకపోవడం దానికి నిదర్శనం. టీనేజ్ లో అడుగు పెడుతున్న అమ్మాయి జుత్తు తీయడానికి ఒప్పుకోదని అలాంటిది గాంధీ తాత్ చెట్టు కోసం త్యాగం చేసిందని చెబుతూ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు.
సుకుమార్ వేదికపైకి వచ్చి ఓదార్చాకే మాములు మనిషయ్యారు. బలగం, కేరాఫ్ కంచెరపాలం తరహాలో హత్తుకునే కాన్సెప్ట్ తో వస్తున్న ఈ సినిమాకి ఆదరణ దక్కితే ఇలాంటి ప్రయత్నాలు మరిన్ని జరుగుతాయి. రిలీజ్ కు ముందే గాంధీ తాత చెట్టుకి పలు అవార్డులు దక్కడం విశేషం.
This post was last modified on January 16, 2025 8:55 pm
హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్స్ పూర్తి చేసుకుని మరో సంచలనం కోసం అఖండ 2 తాండవం మొదలుపెట్టిన దర్శకుడు బోయపాటి శీను…
టాలీవుడ్ హీరోల లిస్టు తీస్తే అందులో 70-80 శాతం వారసులే కనిపిస్తారు. ఒకప్పుడు కేవలం హీరోల కొడుకులు మాత్రమే హీరోలయ్యేవారు.…
సంక్రాంతికి ప్రతిసారీ మూడు నాలుగు సినిమాలు రిలీజ్ కావడం మామూలే. కానీ వాటిలో ఒకటి రెండు మంచి టాక్ తెచ్చుకుని…
ఈ నెల 25న ఆకాశంలో అరుదైన ప్లానెట్స్ పరేడ్ జరగనుంది. సూర్యవ్యవస్థలోని ఆరు గ్రహాలు ఒకే వరుసలోకి వచ్చే ఈ…
భారత జట్టులో మార్పులు చోటు చేసుకుంటున్న తరుణంలో టీమిండియా బ్యాటింగ్ కోచ్ బాధ్యతలను సితాంశు కోటక్ చేపట్టనున్నారు. ఇటీవల టీమిండియా…
ఈ సంక్రాంతికి బడ్జెట్, బిజినెస్ లెక్కల్లో చూస్తే బిగ్గెస్ట్ మూవీ ‘గేమ్ చేంజర్’యే. తర్వాత డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం…