టాలీవుడ్ హీరోల లిస్టు తీస్తే అందులో 70-80 శాతం వారసులే కనిపిస్తారు. ఒకప్పుడు కేవలం హీరోల కొడుకులు మాత్రమే హీరోలయ్యేవారు. కానీ గత కొన్నేళ్లలో క్యారెక్టర్ల్ ఆర్టిస్టులు, కమెడియన్లు, టెక్నీషియన్లు, నిర్మాతల కొడుకులు కూడా పెద్ద సంఖ్యలో హీరోలయ్యారు. చాలామంది తమకంటూ మార్కెట్ కూడా క్రియేట్ చేసుకున్నారు. కానీ దశాబ్దం కిందట్నుంచి పోరాడుతున్నప్పటికీ లెజెండరీ కమెడియన్ బ్రహ్మానందం తనయుడు గౌతమ్ మాత్రం హీరోగా నిలదొక్కుకోలేకపోతున్నాడ.
అతను పేరున్న దర్శకులు, నిర్మాతలతో పని చేయకపోవడం మైనస్ అనే అభిప్రాయాలున్నాయి. మరి బ్రహ్మి.. తనకున్న పరిచయాలతో మంచి ప్రాజెక్ట్ ఎందుకు సెట్ చేయలేకపోతున్నాడు అని సందేహం కలగడం సహజం. ఇదే ప్రశ్న తన కొడుకుతో కలిసి నటించిన బ్రహ్మానందం టీజర్ లాంచ్ కార్యక్రమం సందర్భంగా బ్రహ్మికి ఎదురైంది. దానికి ఆయన ఆసక్తికర సమాధానం చెప్పారు.
”మీరు నా కొడుకు కోసం ఇండస్ట్రీని ఎందుకు వాడుకోలేదు అని అడుగుతున్నారు. కానీ నా కొడుకు సంగతి పక్కన పెడితే నన్నే నేను సరిగా ఉపయోగించుకోలేకపోయాను అనుకుంటాను. ఇన్నేళ్ల కెరీర్లో నేను ఎవరినీ ఒక పాత్ర కావాలని అడిగింది లేదు. అలా అని అది నా గొప్పదనం అంటే అహంకారమే అవుతుంది. అలా అడగాల్సిన అవసరం రాని స్థితిలో నేనుండడం నా అదృష్టం. నేను అన్నింటటికంటే విధిని ఎక్కువ నమ్ముతాను.
ఎవరికి ఏం జరగాలన్నది ముందే రాసిపెట్టి ఉంటుంది. జరగాలంటే జరుగుతుంది. లేదంటే లేదు. మనం నిమిత్త మాత్రులం. గౌతమ్ విషయానికి వస్తే.. గోదావరి సినిమాలో అతను హీరోగా నటించాల్సింది. శేఖర్ కమ్ముల మా ఆవిడకు మేనల్లుడే. గోదావరి సినిమాలో నటించమని అడిగితే.. అది హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలా ఉందని, తనకు అంతగా పేరు రాకపోవచ్చని భావించి అది చేయలేదు.
నేనీ మాట ఇంతకుముందు ఎవరికీ చెప్పలేదు. చెబితే శేఖర్ కమ్ముల సినిమాకే నో చెప్పేంతటి వాడా అని అంటారు. అందుకే నేను ఏదైనా విధిని అనుసరించే జరుగుతుందని నమ్ముతాను” అని బ్రహ్మి అన్నాడు.
This post was last modified on January 16, 2025 8:24 pm
హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్స్ పూర్తి చేసుకుని మరో సంచలనం కోసం అఖండ 2 తాండవం మొదలుపెట్టిన దర్శకుడు బోయపాటి శీను…
రాజమౌళి రికార్డులని దాటేసే స్థాయిలో పుష్ప 2 ది రూల్ తో ఆల్ టైం ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ సృష్టించిన…
సంక్రాంతికి ప్రతిసారీ మూడు నాలుగు సినిమాలు రిలీజ్ కావడం మామూలే. కానీ వాటిలో ఒకటి రెండు మంచి టాక్ తెచ్చుకుని…
ఈ నెల 25న ఆకాశంలో అరుదైన ప్లానెట్స్ పరేడ్ జరగనుంది. సూర్యవ్యవస్థలోని ఆరు గ్రహాలు ఒకే వరుసలోకి వచ్చే ఈ…
భారత జట్టులో మార్పులు చోటు చేసుకుంటున్న తరుణంలో టీమిండియా బ్యాటింగ్ కోచ్ బాధ్యతలను సితాంశు కోటక్ చేపట్టనున్నారు. ఇటీవల టీమిండియా…
ఈ సంక్రాంతికి బడ్జెట్, బిజినెస్ లెక్కల్లో చూస్తే బిగ్గెస్ట్ మూవీ ‘గేమ్ చేంజర్’యే. తర్వాత డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం…