45 కోట్లతో మొదటి సిక్సర్ కొట్టిన వెంకీ

రెండున్నర గంటలు అండర్ కవర్ ఆపరేషన్ చేసి సినిమా చివర్లో ట్విస్ట్ ఇచ్చే హీరోలాగా పండగ బరిలో లాస్ట్ వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం బెస్ట్ అనిపించే దిశగా భారీ వసూళ్లతో పరుగులు పెడుతోంది. మొదటిరోజే ప్రపంచవ్యాప్తంగా 45 కోట్లకు పైగా గ్రాస్ సాధించి ఔరా అనిపించింది.

గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్ ఫస్ట్ డేతో పోలిస్తే ఇది తక్కువే అయినప్పటికీ రిలీజైన థియేటర్ల సంఖ్య, ఇచ్చిన షోల దృష్ట్యా చూసుకుంటే ఇది చాలా పెద్ద నెంబర్. చిన్నా పెద్దా తేడా లేకుండా అన్ని సెంటర్లలో ర్యాంపేజ్ స్పెల్లింగ్ రాయిస్తున్న వైడి రాజు అలియాస్ వెంకీ మామ జోరు అంత సులభంగా తగ్గేలా కనిపించడం లేదు.

ఏరియాల వారీగా నమ్మశక్యం కానీ నెంబర్లు నమోదవుతున్నాయి. ఒక్క నైజామ్ లోనే నాలుగున్నర కోట్లకు దగ్గరగా షేర్ రావడం చిన్న విషయం కాదు. ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాలు కలిపి మూడు కోట్లకు పైగానే షేర్ వచ్చింది. బాలయ్య టఫ్ కాంపిటీషన్ ఇస్తున్న సీడెడ్ లోనూ మూడు కోట్ల షేర్ దాటేసింది.

అనకాపల్లి లాంటి మీడియం సెంటర్లో రెండో రోజు ఉదయం ఎనిమిది గంటలకు నాలుగు థియేటర్లలో స్పెషల్ షోలు వేయడం ఇదే మొదటిసారి. ఈ తరహా ఉదాహరణలు తెలుగు రాష్ట్రాల్లో చాలా చోట్ల కనిపిస్తున్నాయి. ఈ రోజు అడ్వాన్స్ బుకింగ్స్ లో మొత్తం ఫుల్ అయిపోయిన సంక్రాంతికి వస్తున్నాం మాత్రమే.

ఫ్యామిలీ ఆడియన్స్ అండ ఉంటే వెంకటేష్ – అనిల్ రావిపూడి కాంబినేషన్ ఏ స్థాయిలో మేజిక్ చేస్తుందో మరోసారి అర్థమయ్యింది. లాజిక్స్ లేకుండా కేవలం మేజిక్ ఎంజాయ్ చేస్తున్న ఆడియన్స్ బయటికి బ్రహ్మాండమైన టాక్ ఇస్తున్నారు. వింటేజ్ వెంకీని చూసిన ఆనందంలో అభిమానులు రిపీట్ షోలు వేసుకుంటున్నారు.

గత ఏడాది సరిగ్గా ఇదే సమయానికి సైంధవ్ రూపంలో కలిగిన గాయం ఈసారి పూర్తిగా మానిపోయేలా బ్లాక్ బస్టర్ దక్కడం గురించి తమ సంతోషాన్ని సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. వీకెండ్ లోపే సంక్రాంతికి వస్తున్నాం వంద కోట్ల గ్రాసర్ గా మారడంలో ఎలాంటి డౌట్ లేదు.