జాతీయ స్థాయిలో పుష్ప 2 సత్తా చాటాక టాలీవుడ్ నుంచి మరో ప్యాన్ ఇండియా మూవీకి రంగం సిద్ధమవుతోంది. మూడేళ్ళకు పైగా నిర్మాణంలో ఉండి మెగా ఫ్యాన్స్ ని ఒక రేంజ్ లో ఎదురు చూసేలా చేసిన గేమ్ ఛేంజర్ ప్రీమియర్లు ఇంకొన్ని గంటల్లో ప్రారంభం కాబోతున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో అర్ధరాత్రి ఒంటి గంట, తెలంగాణలో తెల్లవారుఝాము నాలుగు గంటలకు మొదటి షోలు పడుతున్నాయి. ఈ మేరకు ఆన్ లైన్ అడ్వాన్స్ బుకింగ్స్ మొదలైపోయాయి. అనుమతుల ప్రక్రియ కొంత ఆలస్యం కావడం వల్ల టికెట్ల అమ్మకాలు నెమ్మదిగా మొదలైనా క్రమంగా ఊపందుకున్న దాఖలాలు కనిపిస్తున్నాయి.
ఇదిలా ఉండగా 2025 తొలి పెద్ద సినిమాగా గేమ్ ఛేంజర్ మీద భారీ అంచనాలున్నాయి. సోలో హీరోగా రామ్ చరణ్ కు ఈ చిత్రం చాలా కీలకం. రాజమౌళి యాంటీ సెంటిమెంట్ ని జూనియర్ ఎన్టీఆర్ దేవరతో గెలిచాడు. ఇప్పుడు మెగా పవర్ స్టార్ దాన్ని కొనసాగించాలి. ఇండియన్ 2 దెబ్బకు ట్రోలింగ్ చూడాల్సి వచ్చిన దర్శకుడు శంకర్ కు ఇది బ్లాక్ బస్టర్ అయితే స్టార్ హీరోల తలుపులు మరిన్ని తెరుచుకుంటాయి. తమ బ్యానర్ 50వ ల్యాండ్ మార్క్ మూవీగా దీన్ని ఎంచుకున్న నిర్మాత దిల్ రాజు ఎప్పుడూ లేని రీతిలో లెక్కలు వేసుకోకుండా వందలాది కోట్ల ప్రాజెక్టుని డీల్ చేశారు. ఇది చిరకాలం గుర్తుండిపోవాలనేది ఆయన లక్ష్యం.
హైప్ ఎక్కువుందా తక్కువుందా అనేది పక్కనపెడితే గేమ్ ఛేంజర్ కనక పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే కలెక్షన్ల హోరు మాములుగా ఉండదు. ముఖ్యంగా యూత్, మాస్ దీని పట్ల చాలా ఆసక్తిగా ఉన్నారు. టీమ్ గొప్పగా చెప్పుకోవడం సహజమే కానీ అంతర్గత వర్గాల నుంచి వస్తున్న ఇన్ సైడ్ రిపోర్ట్స్ పాజిటివ్ ఉండటం శుభ శకునంగా చెప్పొచ్చు. కేవలం రెండు రోజుల గ్యాప్ తో డాకు మహారాజ్, ఆపై సంక్రాంతికి వస్తున్నాం ఉన్నాయి కాబట్టి గేమ్ ఛేంజర్ ఎక్స్ ట్రాడినరిగా ఉందనిపించుకోవడం ముఖ్యం. మెగాభిమానుల ఆకాంక్ష ఏ మేరకు నెరవేరబోతోందో రేపీ సమయానికి పూర్తి స్పష్టత వచ్చేసి ఉంటుంది. చూద్దాం.
This post was last modified on January 9, 2025 10:47 am
మాస్ రాజా రవితేజ ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి విభిన్నమైన సినిమాలు చేస్తున్నాడు ఈ మధ్య. ఈ క్రమంలో…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…
ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…
ప్రధాని మోదీ, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ లపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఓట్ల…
ఒకప్పుడు వైసీపీలో ఓ వెలుగు వెలిగిన విజయ సాయిరెడ్డి ఇప్పుడు ఆ పార్టీపై ఒంటికాలిపై లేస్తున్న వైనం పలువురిని ఆశ్చర్యపరుస్తోంది.…
దసరా నెల ప్రారంభంలో విడుదలవుతున్న మొదటి వారం సినిమాల్లో సిగ్మా మీద మంచి అంచనాలే నెలకొన్నాయి. తమిళనాడు సిఎం కొడుకు…