Movie News

తారక్ వల్ల కాలేదు.. చరణ్ వల్ల అవుతుందా?

ఒక భారీ పాన్ ఇండియా హిట్ కొట్టాక.. ఆ హీరో నటించే సినిమా జాతీయ స్థాయిలో ఎలా ఆడుతుందనే ఆసక్తి అందరిలోనూ ఉంటుంది. ఐతే ‘బాహుబలి’ తర్వాత ప్రభాస్ మార్కెట్ పెరిగినట్లుగా మిగతా హీరోల మార్కెట్ అయితే పెరుగుతుందా అన్నది సందేహంగానే ఉంది. ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ నుంచి వచ్చిన ‘దేవర’ సినిమా నార్త్ ఇండియాలో పెద్దగా ప్రభావం చూపలేకపోయింది.

మరి ‘ఆర్ఆర్ఆర్’లో మరో హీరో రామ్ చరణ్ నుంచి వస్తున్న ‘గేమ్ చేంజర్’ ఏమవుతుందన్నది ఆసక్తికరం. చరణ్ ఆల్రెడీ ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత ‘ఆచార్య’ చేశాడు. కానీ అందులో లీడ్ రోల్ చిరుది. దాన్ని పాన్ ఇండియా సినిమాగా ఏ దశలోనూ ప్రొజెక్ట్ చేయలేదు. ఆ సినిమా కంప్లీట్ మిస్ ఫైర్ అయింది. దీంతో చరణ్ అభిమానుల ఆశలన్నీ ‘గేమ్ చేంజర్’ మీద నిలిచాయి. ఐతే ఈ సినిమా రిలీజ్ బాగా ఆలస్యం కావడం, మధ్యలో శంకర్ నుంచి వచ్చిన ‘ఇండియన్-2’ డిజాస్టర్ కావడం ప్రతికూలంగా మారింది.

ప్రస్తుతానికి పరిస్థితి చూస్తుంటే.. ‘గేమ్ చేంజర్’ పాన్ ఇండియా హిట్ కావడం అంత తేలిక కాదనే అనిపిస్తోంది. పాన్ ఇండియా స్థాయిలో సక్సెస్ కావాలంటే ప్రి రిలీజ్ బజ్ చాలా ముఖ్యం. కానీ ‘గేమ్ చేంజర్’కు అలాంటి బజ్ కనిపించడం లేదు. తెలుగు సినిమాలకు కన్నడలో ఎప్పుడూ మంచి హైపే ఉంటుంది. ఇక శంకర్ సినిమా కావడం వల్ల తమిళంలో ఈ చిత్రానికి కొంత బజ్ ఏర్పడింది. ఈ రాష్ట్రాలను మినహాయిస్తే ‘గేమ్ చేంజర్’ లో బజ్‌తోనే రిలీజవుతోంది.

ముఖ్యంగా పాన్ ఇండియా సక్సెస్‌కు కీలకమైన హిందీలో ‘గేమ్ చేంజర్’కు అనుకున్నంత హైప్ క్రియేట్ కాలేదు. అక్కడి ప్రేక్షకులు ఎక్కువగా ఎగ్జైట్ అవ్వాలంటే అది బాహుబలి తరహా ఈవెంట్ ఫిలిం అయ్యుండాలి. లేదంటే కేజీఎఫ్, పుష్ప తరహాలో కథాంశంలో డిఫరెంట్ వరల్డ్ ఉండి, రా అండ్ రస్టిక్ ఫీల్ కలగాలి. ఇవేవీ ‘గేమ్ చేంజర్’లో కనిపించడం లేదు. ట్రైలర్ చూస్తే మరీ సర్ప్రైజింగ్‌గా ఏమీ లేదు. ఈ నేపథ్యంలో టాక్ చాలా బాగుండి, పాన్ ఇండియా ప్రేక్షకులను ఆకర్షించే డిఫరెంట్ కంటెంట్ ఏదైనా ఉంటేనే ఈ చిత్రం జాతీయ స్థాయిలో సక్సెస్ అయ్యే స్కోప్ ఉంది. మరి అలాంటి మ్యాజిక్ ఏమైనా సినిమాలో శంకర్ క్రియేట్ చేశాడేమో చూడాలి.

This post was last modified on January 9, 2025 9:59 am

Share

Recent Posts

అంబానీని ఏం అనలేరా జగన్?

రాయ‌ల‌సీమ‌లో ఇండియ‌న్ స్కూల్ ఆఫ్ అగ్రిక‌ల్చ‌ర్(ఐఎస్ ఏ) ఏర్పాటుకు భూమి పూజ జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఈ కార్య‌క్ర‌మంలో ప్ర‌ముఖ…

6 hours ago

స్వర్గానికి వెళ్ళిపోయిన సింగీతం శ్రీనివాసరావు

దక్షిణాది సినీ పరిశ్రమను తీవ్ర విషాదంలో ముంచెత్తుతూ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు శాశ్వత సెలవు తీసుకున్నారు. టాలీవుడ్ పునాదుల నుంచి…

6 hours ago

అసలు తుస్సు… కొసరు ప్లస్సు

సాధారణంగా ఒక భాషలో విజయవంతమైన సినిమాను మళ్లీ రీమేక్ చేసి అంత మంచి ఫలితం రాబట్టడం అంత తేలిక కాదు.…

6 hours ago

డ్రాగన్ భామకు డబుల్ హ్యాట్రిక్ షాకులు

ఏ భాష అయినా ఇండస్ట్రీలో మాట్లాడేది, డిమాండ్ పెంచేది సక్సెసే. ఇందులో వేరే డిబేట్ లేదు. ఎన్ని హిట్లు పడ్డాయనే…

7 hours ago

కింగ్ కాస్త ఎక్కువ కనిపిస్తూ ఉండాలి

కింగ్ నాగార్జున కెరీర్ లో చాలా కీలకమైన మైలురాయి వందో సినిమా. కింగ్ 100 టైటిల్ తో రూపొందుతున్న ఈ…

7 hours ago

మహేష్ & తారక్ అభిమానుల విన్నపాలు

ఇంట్లోనే కాదు ఇండస్ట్రీలో కూడా కొన్ని మొహమాటాల మీద జరుగుతాయి. పాత బాకీ ఉందని ఒక సినిమా ఒప్పుకోవాల్సి వస్తుంది.…

8 hours ago