పదేళ్ల ముందు బాహుబలి ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ రికార్డులన్నింటినీ బద్దలు కొట్టేసినపుడు తెలుగు సినీ ప్రియులు ఎంతగానో సంబరాలు చేసుకున్నారు. తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఆ సక్సెస్‌ను ఎంతగా ఓన్ చేసుకుంది. అందరు హీరోల అభిమానులు కూడా ఏ భేదాలు లేకుండా ఆ సినిమా విజయాన్ని ఆస్వాదించారు. బాహుబలిని ప్రైడ్ ఆఫ్ తెలుగు సినిమాగా ఫీలయ్యారు.
బాహుబలి-2 దీన్ని మించి సక్సెస్ అయినపుడు కూడా అందరిదీ అదే ఫీలింగ్. ఇది తెలుగు సినిమా అని గర్వంగా చెప్పుకున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమా అంతర్జాతీయ స్థాయిలో సంచలనం రేపి, లెెజెండరీ హాలీవుడ్ ఫిలిం మేకర్ల ప్రశంసలు అందుకున్నపుడు.. రెండు ఆస్కార్ అవార్డులు గెలిచినపుడు కూడా ఆ ఘనతల గురించి మెజారిటీ తెలుగు వాళ్లు గర్వంగా చెప్పుకున్న వాళ్లే. కానీ ఇప్పుడు ‘పుష్ప-2’ సక్సెస్ విషయంలో మాత్రం ఈ పరిస్థితి లేకపోవడం ఒకింత ఆశ్చర్యం కలిగించే విషయం.
పుష్ప-2 తాజాగా ‘బాహుబలి-2’ వసూళ్లను దాటి ఆల్ టైం ఇండియన్ ఇండస్ట్రీ హిట్‌గా నిలిచినట్లు నిర్మాతలు ప్రకటించారు. కానీ ఇంత పెద్ద విజయాన్ని ఇటు ఇండస్ట్రీ కానీ.. అటు అభిమానులు కానీ సెలబ్రేట్ చేసే పరిస్థితి లేదు. సంధ్య థియేటర్ ఘటన వల్ల ‘పుష్ప-2’ టీమే తమ సినిమా సాధిస్తున్న ఏ ఘనతనూ సెలబ్రేట్ చేసే పరిస్థితి లేకపోయింది. మరోవైపు అల్లు అర్జున్ అరెస్టు తదనంతర పరిణామాలతో ఇండస్ట్రీ కూడా ఈ సినిమా విషయంలో వ్యూహాత్మక మౌనం పాటిస్తోంది.
సెలబ్రేషన్స్ లేకపోయినా.. పుష్ప-2 సాధించిన ఘనత గురించి ఎవరూ మాట్లాడట్లేదు. అల్లు అర్జున్ మీద కొన్ని కారణాల వల్ల పెరిగిన నెగెటివిటీ వల్లో.. లేదంటే ఉత్తరాదిన మాత్రం ఇరగాడేసి, తెలుగు రాష్ట్రాల్లో కొంత వరకు అండర్ పెర్ఫామ్ చేయడం వల్లో.. ఇలా పుష్ప-2 ఘనత గురించి ఎవరూ గొప్పగా మాట్లాడకపోవడానికి కారణాలు అయితే చాలానే కనిపిస్తున్నాయి.
ఏదేమైనా ఇంత పెద్ద సక్సెస్ సాధించి కూడా ఇటు పుష్ప-2 టీం కానీ.. అటు ఇండస్ట్రీ కానీ.. మరోవైపు అభిమానులు కానీ.. ఈ ఘనత గురించి మాట్లాడకపోవడం.. సెలబ్రేషన్స్ లేకపోవడం మాత్రం విచారించాల్సిన విషయమే.
This post was last modified on January 7, 2025 12:40 pm
ఏపీ మంత్రి, టీడీపీ యువ నేత నారా లోకేష్ తన ప్రసంగంలో ఏకంగా 21 సార్లు నమో అనే పదాన్ని…
విశాఖ బహిరంగ సభలో ప్రధాని మోదీని ఉద్దేశించి ఏపీ సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచం మెచ్చే ఏకైక…
ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ఇతర కేంద్ర, రాష్ట్ర మంత్రులకు, రాష్ట్ర…
ఏపీ సీఎం చంద్రబాబు కలలు గంటున్న లక్ష్యాలను సాకారం చేసేందుకు తాము అండగా ఉంటామని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ…
మొన్నటిదాకా అసలెవరో తెలియని ఇమాన్వి ఇస్మాయిల్ ప్రభాస్ సరసన హీరోయిన్ గా ఎంపిక కాగానే ఒక్కసారిగా ఇతర బాషల నిర్మాతల…
అల్లుడు అదుర్స్ తర్వాత తెలుగులో దర్శనం లేకుండా మాయమైపోయిన బెల్లంకొండ సాయిశ్రీనివాస్ ఛత్రపతి హిందీ రీమేక్ కోసం విలువైన సమయాన్ని…